అధిక బరువు అనేక అనారోగ్యాలకు హేతువు. ఒక్క సారి అధికబరువును తగ్గించాలనే వచ్చిందంటే అనేక రకాల ప్రయోగాలు చేస్తుంటాం. అనేక రకాల డైట్లు పాటిస్తాం. యోగా, ఎక్సర్సైజ్ అంటూ కొత్తలవాట్లు చేసుకుంటాం. వాటన్నిటితోపాటు ఈ ఆరు పనులు మీ బరువును తగ్గించడంలో సహాయపడతాయి. జీవనవిధానంలో చేసే చిన్న మార్పులతో పెద్ద ఫలితాలు చూడొచ్చు.
మొదటిది బరువుతగ్గడంలో భాగంగా ఉదయాన్నే చాలా మంది అల్ఫాహారం తినడం మానేస్తారు. కాని రాత్రంతా శరీరక్రియలకు కావలసిన శక్తి ఉపయోగించడంవలన ఉదయం లేచిన రెండు గంటల లోపు ఏదైనా తినాలి.
తినే ఆహారంలో ఫైబర్ ఎక్కువ ఉండేలా తీసుకోండి.దీనివలన నీరసం,ఎసిడిటీకి దూరంగా ఉండొచ్చు. అలాగే మనం ఆహారం తినే ప్లేటు చిన్నగా ఉండేలా చూసుకోండి. చిన్నపాత్రలో తినడం వలన ఎక్కువగా తిన్నామనే భావంతో త్వరగా ఆహారం తినడం ముగిస్తాం. దీనివలన తక్కువగా కావలసినంత మాత్రమే తింటాం. అలాగే నీళ్ళు ఎక్కువగా తీసుకోవాలి. కనీసం మూడున్నర నుండి నాలుగు లీటర్ల నీళ్ళు తాగడంవలన హైడ్రేట్ అయి శరీరంలోనీ విషపదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి.
దాహం వేయడంవలన కూడా ఒక్కోసారి ఆకలి అని భావించి అతిగా తింటాం కనుక నీళ్ళు సరైన మోతాదులో తాగడంవలన అనేక ఆరోగ్య సమస్యల నుండి రక్షించబడతాం. రోజూ వీలైనంత నడవండి. దగ్గరలో ఉన్న చోట్ల కు నడుచుకుంటూ వెళ్ళడం అలవాటు చేసుకోండి. లిప్ట్‌లు వాడకుండా మెట్లు దిగడం అలవాటు చేసుకోండి. నడక శరీరంలో కొవ్వు ను కరిగించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. సాయంత్రం ఆహారంలో పెరుగు తినండి. లోఫ్యాట్ పెరుగు తినడం వలన ఉదరంలో మంచి బాక్టీరియా పెరిగేలా చేస్తుంది.
శరీరంలో జీవక్రియ మెరుగుపడి తిన్న ఆహారం శక్తిగా మారుతుంది. కొవ్వు కరగడంలో ఉపయోగపడుతుంది.
పంచదారను ఉపయోగించకండి. పంచదార శరీరబరువు త్వరగా పెరగడానికి దోహదపడుతుంది. వీలైనంత సహజంగా దొరికే తీపిని అంటే ఖర్జూరం, తేనె వాడుతూ పంచదారను దూరంపెట్టడం వలన చాలా త్వరగా బరువు తగ్గుతాం. ముఖ్యంగా కూల్ డ్రింక్స్, స్వీట్లు, చాక్లెట్లకు దూరంగా ఉండండి. వీటిలో ఆర్టిఫీషియల్ షుగర్ వాడతారు. వీటిని తినడం వలన వేగంగా బరువు పెరిగిపోతారు.
Thank you for the tips to lose weight