7 Proven Ways to Get Rid of Bad Breath

నోటి దుర్వాసనా?? అందరూ మీకు దూరంగా ఉంటున్నారా?? ఒకసారి ఇది చేయండి

అందరిని ఆకర్షిచేది మన వాక్చాతుర్యం. నలుగురిలో కలిసినప్పుడు మన మాట నలుగుర్ని మనవైపు తిరిగేలా చేస్తుంది. కానీ నలుగురిలో మాట్లాడుతున్నప్పుడు ఎదుటివారు  మన నుండి ఎపుడూ పారిపోదామా అన్నట్టు ఉంటారు. లేదంటే ఏ కర్చీఫ్ ముక్కుకు అడ్డు పెట్టుకునికష్టం గా మనతో మాట్లాడతారు. కారణం ఏంటి అని తరచి చూస్తే మన నోటి దుర్వాసన ఇతరులను అంతగా ఇబ్బంది పెడుతోందని పరిశీలిస్తే తప్ప అర్థం కాదు. 

అసలు నోటి దుర్వాసన ఎందుకొస్తుంది??

వేళ కాని వేళల్లో నిద్ర, ఆహారం, రుచి కోసం అడ్డమైన పదార్థాలు తినేయడం.  అనారోగ్య సమస్యలు వల్ల దీర్ఘకాల మందులు వాడేవారు,  జీర్ణాశయ సమస్యలు ఉన్నవారు. నోరు పొడి బారడం, ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు. పై కారణాల వల్ల బాక్టీరియా మన నోట్లో నాలుక, దంతాలలో చేరిపోయి  నోటి దుర్వాసనకు కారణం అవుతుంది. మొటి దుర్వాసన నివారించడానికి కొన్ని సులువైన మనమే చేసుకోదగ్గ చిట్కాలు మీకోసం.

జీలకర్ర

వంటకు ఉపయోగించే ఏ మసాలా పొడికి అయినా వాసనను పెంచేది జీలకర్ర. అలాంటి జీలకర్రను భోజనం వటారువత ఒక స్పూన్ నోట్లో వేసుకోవడం వల్ల దుర్వాసన దరిచేరదు. అంతే కాదు జీలకర్ర లో పీచు పదార్థం వల్ల నోట్లో దంతాల మద్యా ఇరుక్కుపోయిన ఆహార పదార్థాలు జీలకర్రతో పాటు మన జీర్ణాశయంలోకి వెళ్లిపోతాయి.

మెంతులు

వంటలలో మెంతులు స్థానం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఆవకాయలు పెట్టేటప్పుడు ఇల్లంతా మెంతులు వాసనతో ఘుమఘుమలాడుతుంది. మెంతులు రాత్రిపూట ఒక  గ్లాస్ నీళ్లలో నానబెట్టాలి. ఉదయాన్నే లేచి నోరు శుభ్రం చేసుకున్నాక ఈ మెంతి నీళ్లను తాగాలి, ఇష్టమున్నవారు మెంతులు కూడా తినేయవచ్చు. దీనివల్ల నోటి దుర్వాసన తొందరగా పరిష్కారమవుతుంది

లవంగాలు

లవంగం లేని మసాలా వంటకం కనిపించదనే చెప్పాలి. పంటి నొప్పి సమస్యకు లవంగం నూనె ఎంతో గొప్పగా పనిచేస్తుంది. అలాగే ప్రతి రోజులో రెండు మూడు లవంగాలు నోట్లో వేసుకుని మెల్లిగా నమిలి ఆ రసాన్ని మింగుతూ ఉంటే నోటి దుర్వాసన మాత్రమే కాకుండా జీర్ణాశయం కూడా శుభ్రపడుతుంది.

నిమ్మకాయ

నోట్లో బాక్టీరియా ను నిర్మూలించడానికి చక్కని ఔషధంగా నిమ్మకాయ పని చేస్తుంది. నిమ్మకాయ రసాన్ని నీళ్లలో వేసి ఆ నీళ్లతో నోటిని పుక్కిలించడం వల్ల నోట్లో బాక్టీరియా నశించిపోయి మనం బయటకు ఊసే నీటి ద్వారా వెళ్ళిపోతుంది. దీని ద్వారా తెల్లని పలువరుస కూడా మీ సొంతమవుతుంది.

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క కారం తీపి రుచుల కలయికతో మంచి సువాసన కలిగి ఉంటుంది. దాల్చిన చెక్క ను నీటిలో మరిగించి టీ లా తీసుకోవడం లేక దాల్చిన చెక్క పొడిని నీటిలో వేసి నోటిని పుక్కిలించడం వల్ల నోటి దుర్వాసన మాయమవుతుంది

టీ ట్రీ ఆయిల్

టూత్ పేస్ట్, చాక్లెట్, పప్పరమెంట్, కేకులు, మౌత్ వాష్ లు ఇంకా బోలెడు రకాల తయారీలో వాడేది టీ ట్రీ ఆయిల్.  ఈ టీ ట్రీ ఆయిల్ ను నీళ్లలో వేసి ఆ నీటితో నోటిని పుక్కిలించడం వల్ల నోటి దుర్వాసన పోయి తాజాదనపు అనుభూతిని ఇస్తుంది

సొంపు

చాలా చోట్ల భోజనం అవ్వగానే నోట్లో వేసుకునే పదార్థం సొంపు. ఇది గొప్ప మాత్ ఫ్రెషర్ గా పని చేస్తుంది. ప్రతిరోజు ఆహారం తీసుకున్న తరువాత సొంప్ ను కొద్దిగా నోట్లో వేసుకోవడం వల్ల జీర్ణక్రియతో పాటు నోటి దుర్వాసన సమస్య సులువుగా పరిష్కారం అవుతుంది.

చివరగా….

మనం పై పద్ధతులు ఎన్ని పాటించినా జీర్ణక్రియలో సమస్యల వల్ల వచ్చే నోటి దుర్వాసన ను  అరికట్టాలంటే మంచి భోజన పద్ధతులు, సరైన సమయం వేళలు అనుసరించాలి

Leave a Comment

error: Content is protected !!