8 home remedies to get rid of rats

వీటితో ఇలాచేస్తే జన్మ లో ఎలుకలు మీ ఇంట్లోకి రావు

ఎలుకలు అంటే భయపడనివారంటూ ఎవరూ ఉండరు. మనల్ని ఏం చేయకపోయినా అవి ఇంట్లో ఉంటే చాలా భయపడుతుంటారు. ఎందుకంటే ఏమైనా చేస్తాయని కాదు ఇంట్లో అన్ని వస్తువులను పాడుచేస్తూ ఉంటాయి.  అవి  వస్తువులను పాడు చేయడానికి కారణం ఏంటో తెలుసా! మనిషి గోర్లు పెరిగే విధంగా  ఎలుకలకు పళ్ళు పెరుగుతాయి.  మనం గోర్లు ఎదిగితే  కట్ చేసుకుంటాం. కానీ అవి పళ్ళు ఎదిగితే కట్ చేసుకోలేవు. 

అందుకే ఎలుకలు అన్నిటినీ కొరికి పళ్ళు అరగదీసుకుంటాయి. ఎలుకలను  తరిమేయడానికి  చాలా చిట్కాలు  ఉన్నాయి. వాటిలో  కొన్ని అప్లై చేసినప్పటికీ ఫెయిల్ అవుతు ఉంటాయి. కానీ ఈ చిట్కా ట్రై చేసినట్లయితే తప్పకుండా ఎలుకలు ఇంట్లో నుండి పారిపోతాయి. ఎలుకలు ప్లేగు వ్యాధిని విస్తరింపజేస్తాయి. ఎలుకలు ప్లేగు వ్యాధిని మాత్రమే కాకుండా చాలా రకాల వ్యాధులను విస్తరింపజేస్తాయి.  ఎలుకలను సంహరించడానికి మార్కెట్లో చాలా రకాల పెర్టిసైడ్స్, రాట్ కిల్లింగ్  మందులు వస్తున్నాయి.

వీటిని వాడటం వల్ల ఎలుకలు కంటే మనకి ఎక్కువ  దుష్ప్రభావాలు వస్తాయి. ఇంట్లో దొరికే వాటితోనే చిన్న చిన్న చిట్కాలు ట్రై చేసి ఎలుకల్ని  తరిమేయవచ్చు. బిర్యానీ ఆకు బిర్యానీలో వాడటం వలన మంచి వాసన, రుచి ఇవ్వడమే కాకుండా ఎప్పుడు తినేద్దామా అనిపించేలా ఆకర్షనీయంగా కనిపిస్తుంది. బిర్యానీ ఆకుని వశీకరణలో కూడా ఎక్కువగా వాడతారు. బిర్యానీ ఆకులు ఎలుకలు  తిరిగే ప్రదేశంలో  పెట్టడం వలన  బిర్యాని ఆకు వాసనకి ఎలుకలు  చుట్టుపక్కలకి రావు.

ఎలుకలు తిరిగే చోట కలరా ఉండలను పెట్టడం వలన ఆ ఘాటు వాసనకి ఎలుకలు రావు. ఎలుకలకు  గుడ్ల గూబలు, పాములు, పిల్లులు అంటే చాలా భయం.  ఇంట్లో  వాటి బొమ్మలు పెడితే నిజమైనవి అనుకొని ఇంటి దరిదాపుల్లోకి రావు. 
ఉల్లిపాయ సగానికి కట్ చేసి ఇంట్లో పెట్టిన ఉల్లిపాయ నుండి వచ్చే టాక్సిన్స్ వాసనకి  ఎలుకలు రావు. బేకింగ్ సోడాని ఎలుకలు  తిరిగే చోట ఉంచడం వల్ల అది తిని  ఎలుకలు చచ్చిపోతాయి.

పుదీనా  నూనెలో దూది ముంచి ఇంట్లో ఎలుకలు తిరిగే చోట ఉంచడం వల్ల ఘాటైన వాసనకు ఎలుకలు రావు. లవంగాలు పొడి చేసి నీటితో కలిపి ఎలుకలు  తిరిగే చోట  స్ప్రే  చేస్తే ఎలుకలు రావు. ఇంట్లో అనవసరమైన వస్తువులు తీసి బయట  పాడేస్తే మంచిది. దీనివల్ల ఎలుకలు ఇంట్లోకి రావు.  ఈ చిన్న చిన్న చిట్కాలు ట్రై చేసి ఎలుకలు ఇంట్లోకి రాకుండా చూసుకోవచ్చు.

Leave a Comment

error: Content is protected !!