ఈ రోజుల్లో కెమికల్ పొల్యూషన్ వల్ల గాని, లైటింగ్ వల్ల గాని, సెల్ ఫోన్లు స్క్రీన్ లో వాడటం వల్ల గాని, నిద్ర తగ్గిపోవడం వల్ల గాని వయస్సుతో సంబంధం లేకుండా కంటి సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి. కంటిలో అతి ముఖ్యంగా రెటీనా అనేది చాలా ముఖ్యమైనది. అలాంటి రెటీనా దాని లోపల ఉన్న భాగాలు హెల్తీగా పని చేయడానికి ఏడు పోషకాలు ముఖ్యంగా కావాలి. మొదటిది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్. ఇవి అవిస గింజల్లో ఎక్కువగా ఉంటాయి. ఇక రెండోది జింక్, లూటిన్, జియోజాంతిన్ ఈ మూడు గుమ్మడి గింజల్లో, జనపనార గింజల్లోనూ ఉంటాయి. ఇక మూడవది, నాలుగవది విటమిన్ E మరియు విటమిన్ C.
కంటి రెటీనాలోని లేయర్స్ లో ఉండే DNA ని డేమేజ్ చేయకుండా ఈ విటమిన్ E,C కాపాడుతాయి. విటమిన్ E బాగా ఉన్నవి పొద్దుతిరుగుడు పప్పులు, అలాగే విటమిన్ C ఉన్నవి జామకాయలు లేదా ఎండిపోయిన ఉసిరికాయ ముక్కలు, ఫ్రెష్ ఫ్రూట్స్ ఏమైనా సరే తీసుకుంటే విటమిన్ C పుష్కలంగా లభిస్తుంది. ఇంకా చివరిగా చూస్తే విటమిన్ A. ఇది కంటి లోపల అందించే రాడ్స్ కలర్ ని కనిపెట్టడానికి ఏ కలర్ ఆ కలర్ సెపరేట్ చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే వీటిని A వల్ల అందత్వం రాకుండా నైట్ బ్లైండ్నెస్ రాకుండా చేస్తుంది. ఈ విటమిన్ A ఆకుకూరలో ఎక్కువగా ఉంటుందని మనకు తెలుసు.
ఎక్కువగా ఉండేది మునగాకు, పుదీనా మరియు కొత్తిమీరలో విటమిన్ A పుష్కలంగా లభిస్తుంది. ఈ ఏడు పోషకాలతో పాటు కంటి చూపు, కంటి రెటీనా మెరుగుపరచడానికి ఇంకొకటి తప్పకుండా చేయాలి. అది ఏమిటి అంటే కంటికి ఎక్కువ రెస్ట్ ఇవ్వాలి. అందుకని రాత్రి వేళల్లో ఎనిమిది, తొమ్మిది గంటలు ప్రశాంతంగా నిద్ర పోవాలి. ఎక్కువ నిద్రపోవడానికి ట్రై చేయాలి. అంటే రెస్ట్ ఎక్కువ తీసుకోవాలి. కంటికి లైట్ పడకుండా చూసుకోవాలి. కన్ను రిఫ్రెష్ అవుతుంది. నెక్స్ట్ డే కి మళ్ళీ రీఛార్జ్ అయిపోతాయి. కంటి కణాలన్నీ కూడా ఇలాంటివన్నీ చేస్తే కంటి ఆరోగ్యాన్ని కంటి లోపల ఉన్న రెటీనా ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళం అవుతాము.
ఇది కంటి ఆరోగ్యాన్ని అన్నిటినీ కాపాడుకోవడానికి ఏడు పోషకాలు బాగా ఉపయోగపడుతుంది. ఇలా చేస్తే కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.