9 Health Benefits Of Makhanas

వీటితో వంద లాభాలు అంతు లేకుండా లభిస్తాయి……… పరిగెత్తించి మరీ వ్యాధులను తరిమేస్తుంది…

పూల్ ముఖాన గింజలు అనేవి మనం వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాం. ఇవి చాలా రుచికరంగా ఉండడంతో పాటు చాలా కాస్ట్లీ కూడా. దీన్ని స్పెషల్ ఐటమ్ లాగా చాలామంది వాడుతూ ఉంటారు. దీనివల్ల రుచి మరియు స్పెషలే కాకుండా ఇండైరెక్ట్ గా ఎన్ని లాభాలు ఉంటాయో ఈరోజు తెలుసుకుందాం. ముఖ్యంగా ఇవి బీపీని కంట్రోల్ చేయడానికి సహాయపడతాయి. అంతేకాకుండా బీపీని రాకుండా చేయడానికి, రక్తనాళాలు యొక్క వెలాసిటీని పెంచి బాగా స్మూత్ గా ఉండేటట్లు చేయడానికి పూల్మఖాన గింజల్లో ఉండే మెగ్నీషియం బాగా ఉపయోగపడుతుంది.

                           వీటిలో 1640 మిల్లిగ్రాముల మెగ్నీషియం పుష్కలంగా లభిస్తుంది. ఇది రక్తనాళాలు యొక్క సాగే గుణాన్ని బాగా పెంచి సాగే లాగా చేస్తుంది. బీపీ టాబ్లెట్లు కూడా ఇదే విధంగా చేస్తాయి. ఈ పద్ధతిని మెగ్నీషియం న్యాచురల్ గా చేస్తుంది. కనుక దీనివల్ల బీపీ ఉన్నవారికి కంట్రోల్ లో ఉంచడానికి, లేనివారికి త్వరగా రాకుండా చేయడానికి  సహాయపడుతుంది. ఈ పూల్మాఖానా గింజలలో ఎస్.ఓ.డి అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది లివర్ యొక్క డీటాక్సీఫీకేషన్ కు చాలా బాగా సహాయపడుతుంది. మూడోదిగా పూల్మాఖానా గింజలలో యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటాయి.

                              అందువలన ఇవి ఫ్రీరాడికల్స్ ను నాశనం చేయడానికి, శరీరం నుంచి ఫ్రీ రాడికల్స్ తొలగించడానికి దీర్ఘ రోగాలు మరియు ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ రాకుండా చేయడానికి ఇందులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉపయోగపడతాయి. నాలుగవదిగా తీసుకుంటే పూల్ మఖాన గింజలలో 16 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అందువలన స్పెషల్ టేస్ట్ తో పాటు తేలికగా డైజెస్ట్ అవుతుంది. మరియు తక్కువ ఫ్యాట్ అందిస్తుంది. ఇక ఐదో లాభం తీసుకుంటే ఇందులో 55% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కానీ 55 లో 40% కార్బ్స్ అనేవి అమైలోజ్ అనేవి.

                    ఇది ఏం చేస్తాయి అంటే త్వరగా రక్తంలో గ్రహించబడవు. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు పెంచడానికి, ఒబేసిటీ త్వరగా రావడానికి, ట్రై గ్లీజరల్స్, కొలెస్ట్రాల్ వంటివి పెరగడానికి ఈ కార్బ్స్ కారణం కావు. అందువలన డయాబెటిస్ ఉన్న వాళ్ళు, ఒబేసిటీ ఉన్న వాళ్లు కూడా పూల్మఖానా గింజలు తిన్న ఇందులో ఉన్న కార్బ్స్ 40% అమైలోజ్ వల్ల ప్రమాదం ఉండదు. అందువలన వీటిని ప్రతి ఒక్కరు ఉపయోగించవచ్చు. కనుక ఇటువంటి పూల్మఖాన గింజలను ఆకాశం ఉన్నప్పుడల్లా తీసుకుంటే మంచిది.

Leave a Comment

error: Content is protected !!