abhigna anand prediction in telugu

ఉప్పుతో ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది వెళ్లమన్న వెళ్ళదు

ఎంత కష్టం  పడిన కష్టానికి తగిన  ఫలితం రావట్లేదా! మీరు ఎంత సంపాదించిన డబ్బు ఇంట్లో నిలబడక పోతే  ఎంతో బాధగా అనిపిస్తుంది. ఇరుగుపొరుగువారు మీ  సంపదను చూసి ఈర్ష్య పడుతున్నారా! అయితే ఉప్పుతో ఇలా చేసినట్లయితే ఈ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. ఉప్పుతో  ఏం చేయాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం.  రాతి  ఉప్పు లక్ష్మీదేవికి ప్రతిరూపాలు అని మన పురాణాలు చెప్తున్నాయి. దీనినే కళ్ళు ఉప్పు అని కూడా అంటారు. మీ ఇంట్లో ఆర్ధిక పరిస్థితి మెరుగుపడటం కోసం, నర దిష్టి, నరగోష, ధనాకర్షణకు ఉప్పుతో పరిస్కార మార్గాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎంత కష్టపడినా ఇంట్లో డబ్బు నిలవకపోతే ఉప్పుతో ఇలా చేయండి. శుక్రవారం, మంగళవారం కాని రోజు ఇంటికి మట్టి కుండని తెచ్చుకోవాలి. ఇంటికి మట్టికుండ తెచ్ఛుకునేటపుడు x గుర్తు వేసి తెచ్చుకోవాలి. మట్టి కుండని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరనివ్వాలి. ఆదివారం లేదా మంగళవారం కుండలో సగం వరకు ఉప్పు వేసుకోవాలి. దాని మీద పేపర్ మడత పెట్టి ఉప్పుని కప్పేయాలి. నెల జీతం  కానీ వ్యాపారంలో వచ్చిన డబ్బులు కానీ కొంచెం ఈ కుండలో పెట్టి  రాత్రంతా దేవుడి మందిరంలో లేదా అలమరలో  మూలగా పెట్టాలి.

ఇలా చేయడం వల్ల ఎన్నో చేతులు మారిన డబ్బు లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. తర్వాత  ఉదయం తీసి డబ్బులు బీరువాలో పెట్టుకోవాలి. అప్పుడు అవసరాలకు వినియోగించుకోవచ్చు. ఇలా  3 నెలలు చేయడం వలన కష్టపడిన లేదు సంపాదించిన డబ్బులు నిలబడతాయి. ఎవరికైనా అప్పు ఇచ్చిన డబ్బులు సవ్యంగా తిరిగి వస్తాయి. రెండవదిగా ఒక గాజు బౌల్ తీసుకుని దానిలో నీళ్లు వేసుకోవాలి. ఆ నీటిలో కొంచెం ఉప్పు వేసి ఎవరు తిరగని చోట పెట్టాలి. 5 రోజుల తర్వాత మళ్ళీ ఆ నీటిని తీసి మళ్ళీ నీళ్లు వేసి పెట్టాలి. ఇలా తరచూ చేయడం వలన నెగెటీవ్ ఎనర్జీ పోతుంది.

కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. ఒక బౌల్ తీసుకుని ఉప్పుని వేసి ఏడు లవంగాలను తీసుకుని ఉప్పులో సవ్య దిశలో పేర్చాలి. తర్వాత ఆ గిన్నె పట్టుకుని గదిలో ప్రతి మూలలో తిరగాలి. తర్వాత గిన్నె ఇంట్లో ఏదొక మూలలో పెట్టాలి. ఇలా  2 నెలలు చేయడం వలన నరఘోష, నరదిష్ఠి, నెగెటివ్ ఎనర్జీ పటాపంచలు అయిపోతాయి. ఇలా చేయడం వలన సంపాదించిన డబ్బు నిలబడుతుంది.

Leave a Comment

error: Content is protected !!