పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు అధిక బరువు సమస్యతో పాటు గుండెజబ్బులు, కీళ్ళనొప్పులు వంటి అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతూ ఉంటుంది. దీన్ని కరిగించడానికి జిమ్‌లు, వర్కౌట్లు, డైట్లు అంటూ చాలా కష్టపడుతూ ఉంటాం. ఎన్ని చేసినా సరైన ఫలితం లేక డీలపడుతుంటాం. అలాంటప్పుడు ఈ చిట్కాలు పాటించి చూడండి. శరీరంలో ఉన్న కొవ్వుని మంచులా కరిగించి తీరైన శరీరాకృతి అందిస్తుంది. దాని కోసం మనం తీసుకోవాల్సింది వాము.
వాము లోని జీర్ణశక్తి గుణాలు మన జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయని మనందరికీ తెలిసిందే ఆహారాన్ని జీర్ణం చేయడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది ఇప్పుడు వాము రెండు స్పూన్లు తీసుకొని పాన్‌లో వేడి చేయాలి. ఇది కొంచెం వేగిన తరువాత చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. దీంట్లో వేయడానికి రెండు కరివేపాకు రెబ్బలు ఎండలో ఆరబెట్టాలి.
మనం కావాలి అనుకుంటే ఈ నిష్పత్తి కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు ఒకసారి తయారు చేసుకొని గాజు సీసాలో నిల్వ చేసుకుంటే రోజు వాడుకోవచ్చు. ఇలా వేయించిన వాము, కరివేపాకును మిక్సీలో మెత్తని పౌడర్లా మిక్సీ చేసి పెట్టాలి. ఈ పౌడర్ని గ్లాస్ నీటిలో కలిపి రోజూ తీసుకుంటూ ఉండాలి. కావాలి అనుకుంటే ఉప్పు కలుపుకోవచ్చు. రాళ్ల ఉప్పు అయితే మంచిది. బీపీ ఉన్నవారు ఉప్పుని వేసుకోకూడదు.
ఇలా కలిపిన రోజూ ఓ గ్లాసు తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే కొవ్వు కరిగిపోయి అందమైన శరీరం మీ సొంతం అవుతుంది దీంతోపాటు హెల్తీ డైట్, వ్యాయామం చేస్తూ ఉంటే త్వరగా మీ లక్ష్యాన్ని సాధించవచ్చు. వాము విత్తనాలు బరువు తగ్గడానికి సహాయపడటం ఒక ప్రయోజనం.
వాము అజ్వైన్ థైమోల్ అనే ముఖ్యమైన నూనెను కలిగి ఉంది, ఇది శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంది. ఈ ముఖ్యమైన నూనె జీర్ణవ్యవస్థను మెరుగుపరిచే గ్యాస్ట్రిక్ రసాలను స్రవించడానికి సహాయపడుతుంది. వాము శరీరం యొక్క జీవక్రియ రేటును మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.
మీ జీర్ణవ్యవస్థకు కరివేపాకు అద్భుతమైనది. ఇది అజీర్ణం సమస్య నుండి ఉపశమనం ఇస్తాయి మరియు సులభంగా ప్రేగులో మలం కదలికకు సహాయపడతాయి. అవి మీ గట్ మరియు ప్రేగులను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి, కరివేపాకు జీవక్రియను మెరుగుపరుస్తుంది మరియు బరువు తగ్గించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.