Amazing 1 DAY Permanent Skin Whitening Pack

జస్ట్ ఒక్కసారి వేసుకుంటే చాలు. మీ స్కిన్ తెల్లగా మారుతుంది

చర్మంపై పొల్యూషన్ వలన, గాలిలో ఉండే దుమ్ము ధూళి వలన నల్లటి మచ్చలు వస్తుంటాయి. కొంతమంది ఎండలో ఎక్కువగా తిరగడం వలన తెల్లగా ఉండేవారు నల్లగా అయిపోతారు. ఇలాంటి మచ్చలను తొలగించి ముఖాన్ని వైటెనింగ్ చేసే చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దాని కోసం మనం తీసుకోవాల్సింది ఒక అరటిపండు తీసుకోవాలి. దానిని చిన్న ముక్కలుగా తరిగి ఒక గిన్నెలో వేసుకోవాలి. నాలుగు బాదం పప్పులను ఒక స్పూన్ ఎండు ద్రాక్ష కూడా వేసుకోవాలి. 

అరటిపండు ముఖాన్ని మృదువుగా చేస్తుంది. ముఖంపై పేరుకున్న దుమ్ము ధూళిని శుభ్రపరిచి చాలా బాగా సహాయపడుతుంది. దీనిలో ఉండే ప్రోటీన్ చర్మాన్ని ఆరోగ్యంగా చేయడంలో చాలా బాగా సహాయపడుతాయి. ఇందులో వాడిన బాదంపప్పులు కంటికింద నల్లటి మచ్చలను, నల్లటి వలయాలు తొలగించడంలో చాలా బాగా పనిచేస్తాయి.

 ఎండు ద్రాక్షలో ఉండే పొటాషియం, మెగ్నీషియం, భాస్వరం మరియు ఇనుము అధిక స్థాయిలో మీ శరీరంలో రక్త ప్రసరణను పెంచుతాయి. తద్వారా మీ చర్మం లోపల నుండి మెరుస్తుంది. నల్లని మచ్చలు తొలగించి మచ్చలులేని చర్మాన్ని అందిస్తుంది.

ఇప్పుడు ఈ మూడు పదార్థాలలో చిన్న గ్లాస్ పచ్చి పాలు కూడా వేసుకోవాలి. వీటన్నింటిని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ తేనె కూడా వేయాలి. ఈ మిశ్రమం మూడురోజులు వరకూ ఫ్రిజ్లో నిల్వ చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి ఫేషియల్ బ్రష్తో అప్లై చేయాలి. తర్వాత ఒక అరటి తొక్కతో ముఖాన్ని బాగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం పై పేరుకున్న దుమ్ము ధూళి పోవడంతో పాటు చర్మ కణాలు శుభ్రపడతాయి.

 ముఖంపై మచ్చలు తొలగిపోతాయి. ముఖ చర్మం గరుకుగా ఉండేవారికి మృదువైన చర్మం లభిస్తుంది. ఇలా మసాజ్ పూర్తయిన తరువాత మళ్లీ ప్యాక్ని మందంగా వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆరేవరకు వదిలేయాలి. ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నల్లగా ఉన్న చర్మం తెల్లగా మారడం లో చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని తరచూ వాడడం వలన మంచి చర్మ రంగును సొంతం చేసుకోవచ్చు.

Leave a Comment

error: Content is protected !!