Amazing Health Benefits and Uses of Jamun Fruit Neredu Pallu

కేవలం రెండు రూపాయల ఖర్చుతో లక్షలు ఖర్చుపెట్టినా నయంకాని రోగాలను నయం చేయవచ్చు..

సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండటం కోసం.. ప్రకృతి సిద్ధంగా లభించే ఆహారపదార్థాలు ఎంచుకోవాలి. అలాంటి సీజనల్గా దొరికే పండ్లలో నేరేడు ఒకటి. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ నల్లటి పండు పోషకాల గని.. అనారోగ్యాల నివారణిగా పనిచేస్తుంది. నేరేడు సత్వర శక్తి నందించి.. ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

కొన్నిరకాల రోగాలనూ నియంత్రించే శక్తి నేరేడు సొంతం. ఒక్క నేరేడు పండే కాదు.. దాని ఆకులు.. బెరడు కూడా శరీరానికి ఎంతో మేలును చేస్తాయి. ఆక్సాలిక్‌ టాన్మిక్‌ ఆమ్లం, విటమిన్లు, క్రోమియం.. వంటివి నేరేడులో పుష్కలంగా ఉంటాయి. నేరేడుపండు ఆరోగ్యానికి మంచిది. ఔషధగుణాలు కల్గినది ఈ చెట్టు. 

నేరేడు పండ్లు ఆరోగ్యానికి చాలా విధాలుగా ఉపయోగాపడుతాయి. అందుకే ఈ పండ్లను ఆరోగ్య ఫలప్రధాయిని అని కూడా పిలుస్తుంటారు. ఈ ఆరోగ్య ఫలప్రధాయినిలో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. నేరేడు పండ్లలో అతి తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల ఇవి డయాబెటిక్ పేషంట్లకు చాలా మంచిది. 

ఇది మధుమేహ రోగుల్లో బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచడమే కాదు, సాధరణంగా వచ్చే డయాబెటిక్ లక్షణాలు తరచూ దాహం మరియు తరచూ యూరినేషన్ వంటి లక్షణాలను తగ్గిస్తుంది. ఇది మధుమేహ బాధితులకు వరంలా పనిచేస్తుంది. గింజల్ని ఎండబెట్టి పొడిగా చేసుకొని నీటిలో కలుపుకొని తాగితే శరీరంలో చక్కెర నిల్వలు తగ్గుతాయి. 

నేరేడు గుండె జబ్బులను దూరంగా ఉంచడంరో దోహదపడుతుంది. నేరేడుపండులో పొటాషియం అత్యధికంగా ఉంటుంది . 100గ్రాముల పండ్లలో 55mg ల పొటాషియం ఉంటుంది. అనారోగ్యకరమైన ఆహారం తీసుకొనే వారిలో కొన్ని పోషకాహారాల లోపం వల్ల గుండె జబ్బులకు కూడా దారి తీస్తుంది. 

కాబట్టి యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే ముదురురంగు ఆహారాలైన నేరేడు పండ్లు మరియు టమోటో వంటి పండ్లను తరచూ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి. వైట్ డిశ్చార్జ్ లేదా తెల్ల బట్ట నివారణకు ఇది చాలా బాగా సహాయపడుతుంది. పంటి సమస్యలను నివారిస్తుంది. 

నేరేడు పండ్లలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వల్ల దంత సమస్యలను నివారించే అనేక మందుల్లో నేరేడుని విరివిగా ఉపయోగిస్తున్నారు. నేరేడు పళ్లను తీసుకొనే వారిలో పళ్లు, చిగుళ్లు ధృడంగా ఉంటాయి. నేరేడు ఆకుల్ని దంచి కషాయంగా కాచి పుక్కిలిస్తే పళ్ళు కదలడం.. చిగుళ్ల వాపులు, పుండ్లు వంటివి త్వరగా తగ్గుతాయి. ఈ ఆకులను నమిలి నీళ్లతో పుక్కిలించి ఉమ్మి వేస్తుంటే.. నోటి దుర్వాసనకు ఉపశమనం లభిస్తుంది. 

శరీరంను డీహైడ్రేష్ నుండి రక్షిస్తుంది. వేసవిలో వేడి వాతవరణం నుండి మన శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా నేరేడుపండు కాపాడుతుంది. అలాగే దాహాన్ని కంట్రోల్ చేస్తుంది. చర్మ సమస్యలును నివారించి క్లియర్ స్కిన్ అందిస్తుంది. నేరుడు గింజలను పౌడర్ చేసి, ఆపౌడర్ను పాలతో కలిపి ముఖానికి రాసి మరుసటి రోజు ఉదయం శుభ్రంగా కడిగితే మొటిమలు తగ్గుతాయి.  మళ్ళీ త్వరగా రాకుండా చేస్తాయి. 

వీటిలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల ముసలితనం ఆలస్యం చేస్తుంది. వృద్ధులవుతున్న కొద్దీ మెదడు నెమ్మదించే అవకాశమున్నది . అలాంటి అనారోగ్యాలనుండి కాపాడుతాయి.రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నేరుడు పండు శక్తివంతమైన యాంటి ఆక్సిడెంటుగా పనిచేయడమే కాక, రోగనిరోధక శక్తి మెరుగవడానికి తోడ్పడతాయి. 

Leave a Comment

error: Content is protected !!