amazing health benefits of anjeer fruit

ప్రతిరోజు అంజీర్ ని ఇలా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు

అంజీరాలు తాజాగా దొరికితే రోజుకి మూడు, నాలుగు వరకు చక్కగా తినవచ్చు. వీటివలన చర్మ,జుట్టు సమస్యలు తొలగిపోతాయి. ఇప్పుడు వీటిని డ్రై ప్రూట్స్ గా మార్చి అనేక సూపర్ మార్కెట్లో అమ్ముతున్నారు. కనుక కొంచెం ఖరీదయినా అందరికీ అందుబాటులో ఉంటున్నాయి. వాటి వలన కలిగే ఆరోగ్య లాభాలు తెలిస్తే తప్పకుండా తినాలి అనుకుంటారు.

చక్కెర వ్యాధి ఉన్నవారు కూడా తినొచ్చు. ఇందులో హైబ్లెడ్ షుగర్ని మామూలుగా చేసే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని గుర్తించారు. డయాబెటిస్ ఉన్నవారు రోజుకు రెండువరకూ తినొచ్చు. దీనివలన షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి. వెంట్రుకలు రాలిపోవడానికి కారణమయ్యే జింక్, ఐరన్ లోపాలను ఇది అధిగమించేలా చేస్తుంది.

ఆహరంలో రోజుకు రెండు అంజీరాలను నీళ్ళలో నానబెట్టి తింటుంటే మలబద్దకం తగ్గి ఫైల్స్ సమస్యకు చెక్ చెప్పొచ్చు. అలాగే నానబెట్టిన అంజీరాలను తినేసి ఆ నీటిని తాగడం వలన ఫైబర్ లభించి  జీర్ణక్రియ బాగా జరిగి కడుపు సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తుంది.

రక్తహినతతో బాధపడేవారికి అంజీర్ పండ్లు మంచి ఔషధం. రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. దీనివలన ఐరన్  పుష్కలంగా దొరికి రక్తహీనత సమస్య తగ్గిపోతుంది.

అంజీర్ పండ్లు ఎక్కువగా తింటే బరువు పెరగొచ్చు. అలాకాకుండా మితంగా తింటే కొవ్వును తగ్గించి బరువు తగ్గేలా చేస్తుంది. బి.పీ, గుండె సంబంధ వ్యాధులకు కూడా అంజీర్ అడ్డుకట్ట వేస్తుంది. చిన్న పనులకు కూడా అలసిపోయేవారు తమ డైట్లో అంజీర్ ను భాగం చేసుకుంటే శరీరానికి కావలసిన ఖనిజాలు లభించి ఆరోగ్యంగా ఉంటారు.

కిడ్నీ ఆరోగ్యానికి కూడా అంజీర్ మంచి మందు. కిడ్నీలలోని టాక్సిన్లను డీటాక్సిఫికేషన్ చేస్తుంది. హార్మోన్ల ఇన్ బ్యాలన్స్ ఉన్నవారికి కూడా అంజీర్ బాగా పనిచేస్తాయి. శరీరంలో పొటాషియం ఎక్కువగా, సోడియం లెవల్స్ తక్కువగా ఉంటే ఆరోగ్యానికి ప్రమాదం. అందుకే అంజీర్ తింటే ఇందులో   పొటాషియం  ఎక్కువ, సోడియం తక్కువగా ఉండి బి.పీ సమస్యలు తగ్గిస్తాయి.

ఇంకా ఆస్తమా, ఇన్పెర్టిలిటీ సమస్యతో బాధపడేవారు రోజుకు రెండు పాలల్లో నానబెట్టి తినడం వలన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇందులో దొరికే కాల్షియం ఎముకల బలానికి దోహదపడుతుంది. భవిష్యత్తులో మతిమరుపు, అల్జీమర్స్ బారినపడకుండా కాపాడుతుంది.

Leave a Comment

error: Content is protected !!