మార్కెట్లో అమ్మలు తెచ్చే కూరగాయల్లో ముఖ్యంగా ఉండేది బెండకాయ. మహిళల చేతి వెళ్లంత సుకుమారంగా లేతగా ఉంటాయనేమో లేడీ ఫింగర్ అనే పేరు వచ్చింది. ఈ లేలేత బెండకాయలను కూరగా వండితే అద్భుతమైన రుచి, పచ్చిగా తిన్నా తియ్యనైన రుచితో బాగుంటుంది. అయితే చాలామంది పిల్లలు దీని జిగటతనం వల్ల అయిష్టం చూపుతారు. పిల్లలున్న ప్రతి ఇంట్లో తరచుగా మనం వినే మాట బెండకాయ తినరా లెక్కలు బాగా వస్తాయి. బెండకాయ తింటే లెక్కల్లో టాప్ అవుతారే తినవే అని కుతుర్లకు, కొడుకులకు బ్రెయిన్ వాష్ చేసే తల్లిదండ్రులు బోలెడు కనిపిస్తుంటారు. అయితే నిజంగానే బెండకాయ తింటే తెలివైన వాళ్లుగా లెక్కలు చేసేస్తారా అన్నదే ఇక్కడ పెద్ద ప్రశ్న అవుతోంది.
భాస్వరం మరియు విటమిన్ ఎ వంటి మెదడు పనితీరుకు ముఖ్యమైన పోషకాలలు బెండకాయలో చాలా ఎక్కువ. ఇందులోని ఒమేగా -3 మరియు ఒమేగా -6 మరియు ఇతర యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడులోని న్యూట్రానులను ఉద్దీపన చేస్తాయి. ఫలితంగా మెదడు చురుగ్గా ఉంటుంది. బెండకాయ జిగురులో ఉన్న ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు మెదడు ఎదుగుదలకు అవసరమైన కొవ్వులను అందిస్తాయి. దీనివల్ల బెండకాయ తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుందని అందరూ చెబుతారు. అయితే కేవలం బెండకాయ వల్ల తెలివొచ్చేస్తుందా??
మనిషిలో ముఖ్యంగా ఉండాల్సింది ఆసక్తి. గొప్ప ఐక్యూ ఉన్న వ్యక్తి అయినా ఆసక్తి లేకపోతే ఆ విషయం పట్ల ఏకాగ్రత పెట్టలేడు. సరిగ్గా ఇక్కడ ఇదే వర్తిస్తుంది. బెండకాయ ఎంత మెదడుకు దోహదం చేసేది అయినా విషయం పట్ల ఆసక్తి ఉన్నపుడు దాన్ని లోతుగా ఆలోచించగలిగేందుకు మెదడును చురుగ్గా పనిచేసేలా చేస్తుంది.
ఇక ఆరోగ్య ప్రయోజనాల పరంగా చూస్తే బెండకాయ బోలెడు విధాలుగా మంచి చేస్తుంది. అవేంటో చూడండి
మధుమేహం నియంత్రించడంలో సహాయపడుతుంది:
జీర్ణవ్యవస్థ నుండి చక్కెరను పీల్చుకునే రేటును నియంత్రించడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడానికి సహాయపడే డైటరీ ఫైబర్‌తో బెండకాయ నిండి ఉంటుంది. కార్బోహైడ్రేట్ల జీవక్రియ ఎంజైమ్‌లను నిరోధించే సామర్థ్యం, ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడం వంటి వాటిలో చురుగ్గా పనిచేస్తుంది. అందుకే మధ్యజమేహం ఉన్నవారు బెండకాయను విరివిగా తీసుకోవాలి.
గుండె జబ్బులను నివారిస్తుంది:
రక్తంలో అధిక కొలెస్ట్రాల్ కారణంగా గుండె జబ్బులతో బాధపడేవారు ఎక్కువ. బెండకాయలో ఉండే కరిగే ఫైబర్ అయిన పెక్టిన్ ఈ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా గుండె జబ్బులను నివారించడంలో సహాయపడుతుంది. పాలిఫినాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు బెండకాయ లో పుష్కలంగా ఉంటాయి.
బరువు తగ్గడానికి మీకు సహాయపడుతుంది:
బరువు తగ్గాలని కోరుకునే వ్యక్తులు బెండకాయను తినవచ్చు. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉన్నాయి, అంతేకాదు ఫైబర్ పాళ్లు ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువసేపు ఆకలిని నియంత్రిస్తుంది.
రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది:
బెండకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, రోజువారీ పోషక అవసరాలలో విటమిన్ సి తప్పనిసరి. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది అనేక వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది.
మానసిక సమర్త్యాన్ని మెరుగు పరుస్తుంది:
ఇందులో కీలకమైన పోషకం ఫోలేట్ లేదా విటమిన్ బి 9. ఇది మెదడులో ఉన్న త్వచాన్ని ఎప్పటికప్పుడు పునరుద్దిస్తూ మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.
క్యాన్సర్‌ను నివారిస్తుంది:
బెండకాయలో చాలా కూరగాయల కంటే యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు కణాలకు ఫ్రీ రాడికల్స్ నుండి దెబ్బతినకుండా, మరియు శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. ఇందులో కరగని ఫైబర్‌ను ఉంటుంది, ఇది ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను ప్రోత్సహిస్తుంది మరియు కొలొరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
చివరగా…..
పైన చెప్పుకున్న కారణాల ఆధారంగా బెండకాయను మెదడు పనితీరు పదును పెట్టుకోవడానికి, శరీరంలో ఉన్న జబ్బులను తరిమి కొట్టడానికి నిరభ్యరంతంగా తినవచ్చు.