amazing health benefits of pumpkin seeds

3 రోజులు – గుప్పెడు తింటేచాలు షుగర్, కొలెస్ట్రాల్,ఊబకాయం,రక్త హీనత,నిద్రలేమి,గుండెపోటు జీవితంలో రావు

మనుషులు ఆరోగ్యంగా ఉండాలంటే  మంచి ఆహారం తినాలని అందరికీ తెలుసుకానీ జిహ్వ చాపల్యంతో రోడ్డుమీద దొరికే చిరుతిండ్లు, జంక్ ఫుడ్, మసాలాలు తినేస్తారు. తర్వాత ఆరోగ్యం పాడయ్యాక ఆరోగ్య కరమైన ఆహారానికి మారాలనుకుంటారు. అప్పటికే డబ్బులు పెట్టినా నయమవని రోగాలకు గురవుతుంటారు. సరైన సమయంలో ప్రారంభిస్తే  మంచి ఆహారం, వ్యాయామం మీ ఆరోగ్యాన్ని తిరిగి నయంచేయగలవు. అన్ని రకాల పోషకాలను అందిస్తూ ఉండాలి. అందులో ముఖ్యమైనది గుమ్మడిగింజలు. ఇందులో మెగ్నీషియం, కాపర్ , ప్రోటీన్లు జింక్ పుష్కలంగా ఉంటాయి. అందుకే రోజూ వీటిని తినడంవలన ఆరోగ్యానికి చాలా మంచిది. వీటివలన శరీరానికి దొరికే అద్బతమైన ప్రయోజనాలు ఏంటో చూసేద్దాం. ఇందులో ఉండే మెగ్నీషియం ఎముకల ఎదుగుదలకు, బలానికి చాలా అవసరం. మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి..

ఎంత ఎక్కువ మెగ్నీషియం తీసుకుంటే ఎముకల ఆరోగ్యానికి అంత మంచిది. దీనివలన ఆస్థియోపోరోసిస్ రాకుండా చేస్తుంది. అలాగే ఇప్పటికాలంలో పెరిగిపోతున్న మధుమేహం రోగుల్లో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. గుమ్మడిగింజలు గ్లూకోజ్ లెవల్స్ తగ్గిస్తాయని ఎలకల మీద చేసిన ప్రయోగంలో తేలింది. మీరు ఈ గింజలను పచ్చిగా లేదా వేయించుకుని స్నాక్లొ తినొచ్చు. సలాడ్, సూప్స్లా కూడా తినొచ్చు. మెగ్నీషియం వలన శరీరం ఏ రోగాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుంది. శ్వాస కోశ వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది. కృత్రిమ సప్లిమెంట్ల మీద ఆధారపడకుండా సహజంగా మెగ్నీషియం తీసుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా గుమ్మడిగింజలు వాడకం ఎక్కువయింది. నిపుణులు సైతం ఈ విషయాన్ని సూచిస్తున్నారు.

 సూపర్ ఫుడ్ వరసలో గుమ్మడిగింజలు మొదటివరసలో ఉంటాయి. సత్వర శక్తి కోసం గుమ్మడిగింజలు రోజుకి గుప్పెడు తీసుకోవాలి. ఈ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, జింక్, ఫ్యాటీ యాసిడ్ ఉంటాయి కాబట్టి గుండెకి మంచిది. గుండెవ్యాధులు ఉన్నవారు ఈ గింజలను తినడం అలవాటు గా మార్చుకోవాలి. కరోనరి,ఆర్టినరీ వ్యాధులను నివారించి గుండెకు రక్తప్రసరణ మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది. అధిక బరువు పెరగకుండా కాపాడుతుంది. ఏమైనా తినాలనిపించినపుడు ఈ గింజలను తినడంవలన కడుపు నిండిన ఫీలింగ్ వచ్చి అనవసరంగా ఆహారం తీసుకోవడం తగ్గించొచ్చు. జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. నిద్రలేమిని టెప్టోపాన్ తగ్గిస్తుంది. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. ఒత్తిడి, డిప్రెషన్ దూరం చేస్తుంది.

Leave a Comment

error: Content is protected !!