Amazing Health Benefits Of Shankupushpam

ఈ పువ్వు గూర్చి తెలుసుకున్నారంటే మీ జీవితం ఆశ్చర్యపడేట్టు మారిపోతుంది

ఇంటి అందం కోసం ఎన్నెన్నో పూల మొక్కలు పెంచుతాం. ఆ పూలన్ని కొందరు దేవుడి పూజ కోసం వాడతారు, మరికొందరు అలా చెట్టు లోనే వాడిపోతున్నా పెద్దగా పట్టించుకోరు. ఏ పువ్వు వల్ల ఏ జబ్బు తగ్గుతుంది అనే విషయం 99% మందికి తెలియదు. ఆరోగ్య స్పృహ ఉన్న ఆ 1% మంది పువ్వులను ఎంతో జాగ్రత్తగా దాచుకుని వినియోగించుకుని  ఆరోగ్యాన్ని సొంతం చేసుకుంటారు. తీగ జాతికి చెందిన శంకు పూవుల గూర్చి అందరికి తెలిసే ఉంటుంది. తెలుపు, నీలం, లేత గులాబీ రంగులో లభ్యమయ్యే ఈ పువ్వులతో ఆశ్చర్యపరిచే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలిస్తే అందరూ చక్కగా పాటించి ఆరోగ్య ప్రయోజనాలను అండతో సొంతం చేసుకోవచ్చు. అందుకే మీకోసం శంకు పూలతో ఆరోగ్య చిట్కాలు.

 ◆శంకు పువ్వు శరీరానికి తాజాదనాన్ని చేకూర్చేందుకు ఉపయోగపడుతుంది.  ఇందులో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టానికి వ్యతిరేకంగా పోరాడటంలో సహాయపడుతుంది.  చర్మంలో మంట మరియు వృద్ధాప్య ఛాయలు తొందరగా దరిచేరకుండా నమయవ్వనంగా ఉంచడంలో దోహాధం చేస్తుంది.  ముఖ్యంగా ఆంథోసైనిన్ లను సమృద్ధిగా కలిగి ఉంటుంది.  ఇది బ్లూబెర్రీస్ మరియు రెడ్ వైన్లలో కూడా కనిపించే ఒక రకమైన యాంటీఆక్సిడెంట్, ఇది మంటతో పోరాడటానికి మరియు గుండె ఆరోగ్యాన్ని పెంచడానికి సమర్థవంతమైన ఔషధంగా గుర్తింపు పొందింది. 

◆  శంకు పువ్వు ఒక సహజ నూట్రోపిక్ గా పనిచేస్తుంది.  అంటే ఇది  జ్ఞాపకశక్తిని, ఆలోచనా శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. మెదడులోని కణాలను ఉత్తేజం చేయడం ద్వారా ఒత్తిడి తగ్గించి ఈ ఫలితాలను ఇవ్వగల గుణాలు శంకుపువ్వులో ఉన్నాయి.

 ◆ ఇది చర్మ ఆరోగ్యానికి ఎంతో గొప్పగా దోహాధం చేస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లన్నింటికీ శక్తివంతమైన ప్రభావం ఉంటుంది. కంటి ముడతలను తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. అంతే కాదు కంటి సమస్యలు అయిన కళ్ళలో మంట, కళ్ళు ఎరుపెక్కడం కంట్లో నీరు కారడం వంటి సమస్యలను తగ్గించి చికాకు, అసహనం మొదలైన వాటిని దూరం చేస్తుంది.  

  ◆ ఇది సహజసిద్ధమైన కలరింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. నిమ్మరసం, ఇతర పదార్థాలతో దీన్ని సమ్మేళనం చేయడం సహజ రంగును కోల్పోయి వివిధ రంగుల్లోకి మారిపోతూ ఉంటుంది. దీని ph స్థాయిలు ఏఅంగును బట్టి మారుతూ ఉంటాయి కూడా. రసాయనాల సమ్మేళనమైన కృత్రిమ రంగులను దూరంగా ఉంచి దీన్ని ఉపయోగించుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రవాలు దరిచేరకుండా చూసుకోవచ్చు. 

చివరగా……

శంకు పూవులు ఇంటి అందం కోసం చాలా చోట్ల పెంచుకోవడం ఇపుడు సాధారణం అయిపోయింది అయితే దీని ప్రయోజనాలు తెలుసుకున్నాక తప్పకుండా వినియోగించుకుంటే నిత్యయవ్వనాన్ని, ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.

Leave a Comment

error: Content is protected !!