Amazming health benefits of Single Clove Garlic

ఎవరికి తెలియని అఖండ వెలుల్లి దొరికితే అసలు వదలొద్దు

వెల్లుల్లిని మనం తరచు వాడుతూ ఉంటాం. కానీ వెల్లుల్లి గురించి కూడా మనకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి. తరతరాలుగా వెల్లుల్లిని మన వంటల్లో వాడుతూనే ఉన్నాం ఇందులోని అమోఘమైన ఔషధగుణాలు  అందరికీ తెలుసు. కొలెస్ట్రాల్ తగ్గడానికి వెల్లుల్లి ఎక్కువగా వాడుతూ ఉంటారు. వెల్లుల్లిని వాడటం మంచిది కానీ దానిని కరెక్ట్ గా వాడాలి. మనకు తెలిసిన వెల్లుల్లిలో ఒక పది పదిహేను రెబ్బలు ఉంటాయి. వెల్లుల్లిలో కొంతమందికే తెలిసిన ఇంకొక రకం అఖండ వెల్లుల్లి. ఇందులో మెడిసినల్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ అఖండ వెల్లుల్లి రెబ్బలు ఉండవు ఒకటే రెబ్బ వెల్లుల్లి లాగా వస్తుంది. ఈ వెల్లుల్లి హిమాలయ ప్రాంతాలలో ఎక్కువగా పండిస్తారు. పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి.

వెల్లుల్లిలో అలసిన్ అనే ఒక రసాయనం ఉంటుంది అది పెన్సిలిన్ లాగా పనిచేస్తుంది. అంటే ఇది ఆంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. ఉదయాన్నే రెండు వెల్లుల్లి తీసుకుంటే ఒక రోజు కు సరిపోయే రోగ నిరోధక శక్తి మనలో చేరుతుంది. మామూలు వెల్లుల్లి ఒక పది నుండి పదిహేను రెబ్బలు తీసుకుంటే వచ్చే శక్తి ఈ అఖండ వెల్లుల్లి ఒకటి తీసుకుంటే సరిపోతుంది.
వెల్లుల్లి ఎప్పుడు మనము పచ్చిగానే తీసుకోవాలి దానిని వేడి చేయడం వల్ల అందులో ఉండే ఔషధ గుణాలు తగ్గిపోతాయి. ఖాళీ కడుపుతో తీసుకుంటే మరీ మంచిది. ఖాళీ కడుపుతో తీసుకునేటప్పుడు అరగంట ముందు అరగంట తర్వాత ఏమి తినకూడదు.

ఈ అఖండ వెల్లుల్లిలో మామూలు వెల్లుల్లి లో కంటే 11 రకాల అమైనో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది మన శరీరంలో రెండు వందల రకాల ఎంజైములను తయారు చేస్తుంది. ఇది ఒక ఇమ్యూనిటీ బూస్టర్ లాగా పనిచేస్తుంది. ఈ అఖండ వెల్లుల్లిని ఖాళీకడుపుతో తీసుకోవడం వల్ల ఇది కడుపులోని జీర్ణ రసాల తో కలిసి మన జీర్ణ వ్యవస్థ మెరుగు పడేలా చేస్తుంది.మీ lungs లో ఉంటే ఇన్ఫెక్షన్లు క్లియర్ అవుతాయి హార్ట్ పంపింగ్ కెపాసిటీ పెరుగుతుంది.

దగ్గు జలుబు ఎక్కువగా వస్తూ ఉండే వారికి ఈ అఖండ వెల్లుల్లి రోజుకు ఒకటి తీసుకుంటే చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. హార్ట్ బ్లాక్ సన్ వారికి బ్లడ్ సెల్స్ లో బ్లాక్ ఉన్నవారు ఇది బాగా పనిచేస్తుంది. LDL bad cholesterol మన రక్తంలో  ఏర్పడకుండా చూస్తుంది.

మోకాలు నొప్పి ఉన్నవారికి ఈ అఖండ వెల్లుల్లి తీసుకొని కొద్దిగా పసుపు కలిపి నూరి దాన్ని ఒక గుడ్డ కు పట్టించి మోకాళ్ల మీద వేసి కట్టులా  కట్టాలి. మామూలు వెల్లుల్లి తో ఇలా చేస్తే అక్కడ శరీరమంతా కమిలిపోతుంది కానీ ఈ అఖండ వెల్లుల్లికి వాడడం వల్ల తీవ్రత కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఈ విధంగా మీరు మూడు వారాలు వాడితే మీ మోకాలు నొప్పులు తగ్గుముఖం పడతాయి.

1 thought on “ఎవరికి తెలియని అఖండ వెలుల్లి దొరికితే అసలు వదలొద్దు”

Leave a Comment

error: Content is protected !!