ప్రియమైన పాఠకులారా… ఈరోజు మనం నడుము నొప్పి మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులు వెన్ను నొప్పి ఇలాంటి శరీరంలోని ఎముకలకు సంబంధించిన అన్ని రకాల నొప్పులను తగ్గించే ఒక మంచి ఆయుర్వేదిక్ రెమెడీ గురించి తెలుసుకుందాం. ఈ రెమెడీ మేము చెప్పినట్టు ఉపయోగిస్తే చాలు మీ శరీరంలోని ఎలాంటి నొప్పులు మరియు వాపులు నుండి మంచి ఉపశమనం పొందవచ్చు.
ఈ రెమిడీ తయారీ విధానం
ముందుగా గ్యాస్ ఆన్ చేసి దాని మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకోండి. ఇందులో 20 ml ఆవనూనెను వేయండి. ఇప్పుడు ఇందులో నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెబ్బలు పొట్టుతీసి వేయండి. తరువాత ఒక ఇంచ్ అల్లం తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేయండి. తర్వాత ఇందులో 10 లేదా 15 మిరియాలను కూడా కలపండి. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్ లో ఉంచి కనీసం 5 నుండి ఏడు నిమిషాల పాటు వీటిని బాగా వేడి చేయండి.
ఎలా వాడాలంటే ..
ఈ ఆయిల్ చల్లారి గోరు వెచ్చగా అయిన తర్వాత ఒక బౌల్ లోకి వడ పోసుకోండి. ఈ ఆయిల్ ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో ఒక నెల రోజుల పాటు భద్రపరచుకొని వాడుకోవచ్చు. మీ శరీరంలో ఏ ప్రదేశంలో అయితే మీకు నొప్పిగా అనిపిస్తుందో ఆ ప్రదేశంలో ఈ ఆయిల్ కొద్ది కొద్దిగా తీసుకొని కనీసం ఒక 15 నిమిషాలు పాటు మృదువుగా మసాజ్ చేసుకోవాలి.
ఈ రెమిడిని మీరు ఉపయోగించడం ద్వారా మీ శరీర భాగాల్లోని నొప్పులు వాపులు తగ్గించడంతో పాటు ఆ ప్రదేశంలో రక్త ప్రసరణ కూడా వేగవంతం చేస్తుంది. తద్వారా మీ నొప్పులు ఆటోమేటిక్ గా తగ్గుముఖం పడతాయి. ఎందుకంటే మన శరీరంలో రక్త ప్రసరణ లో ఆటంకం ఏర్పడటం వలన మన నరాలు సిరల్లో ఎన్నో రకాల అడ్డంకులు బలహీనతలు ఏర్పడతాయి. దీని వల్ల నరాల బలహీనత నొప్పులు వాపులు కూడా వస్తాయి. మీరు ఈ మిశ్రమాన్ని ప్రతి రోజు కనీసం మూడు సార్లు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తప్పనిసరిగా పది నుండి పదిహేను నిమిషాల పాటు మసాజ్ చేసుకోండి. దీని ద్వారా మీ శరీరంలోని అన్ని రకాల నొప్పులు వాపులు తగ్గిపోతాయి రేమిడిని మీరు ఎన్ని రోజులైనా వాడవచ్చు మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
vellulli nune raaste kaaliki bobbalu vachi, sceptic avutundi.
Doctor tho oka saari verify chesukondi