Ayurvedic Remedy To Stop HairFall

ఇలా చేస్తే ఎంతటి పల్చబడ్డ జుట్టైనా నల్లగా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది

జుట్టు లావుగా, ఆరోగ్యంగా, పొడవుగా పెరగాలంటే ఇప్పుడు చెప్పబోయే ఆయుర్వేద చిట్కా చాలా బాగా పనిచేస్తుంది.మా ర్కెట్లో కొనే కెమికల్ ప్రోడక్ట్స్ ఇవ్వలేని అందమైన ఆరోగ్య కరమైన జుట్టు కోసం గుప్పెడు మందార ఆకులను తీసుకోవాలి. మందారం నిద్రాణమైన వెంట్రుకల కుదుళ్ల నుండి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది, బట్టతల పాచెస్‌ను కవర్ చేయడంలో తిరిగి జుట్టును మొలిపించడంలో సహాయపడుతుంది. పొడిబారిన జుట్టును మరియు చుండ్రును కూడా ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.  

వీటిని చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక రెండు స్పూన్ల నానబెట్టిన మెంతులు తీసుకోవాలి. మెంతులు చుండ్రు సమస్య ఎదుర్కోవడంలో, జుట్టు ఆరోగ్యంగా పెరగడంలో, మృదువైన జుట్టు కోసం మెంతులు చాలా బాగా సహాయపడుతాయి. నానబెట్టిన మెంతులు కూడా మందార ఆకులలో వేసుకోవాలి. తరువాత ఒక గుడ్డులోని తెల్లసొన మాత్రమే తీసుకోవాలి. గుడ్డులో ఉండే ప్రోటీన్ జుట్టు పెరుగుదలకు చాలా బాగా సహాయపడుతుంది. జుట్టు ఏర్పడటానికి కావాల్సిన పోషకాలను అందించి ఆరోగ్యకరమైన జుట్టుకు సహాయపడుతుంది.  

ప్రోటీన్ యొక్క సరైన మోతాదు ఆహారంలో తీసుకోవడం ఆరోగ్యకరమైన జుట్టును ప్రోత్సహిస్తుంది అని తేలింది, కొందరు వ్యక్తులు గుడ్డులోని తెల్లసొనను జుట్టుకు మాస్క్‌గా మరియు డ్యామేజ్‌ని రిపేర్ చేయడానికి మరియు జుట్టు రాలడాన్ని రివర్స్ చేయడానికి ఉపయోగిస్తారు.  గుడ్డులోని తెల్లసొన హెయిర్ మాస్క్‌ని ఉపయోగించడం వల్ల స్కాల్ప్‌లో ఉన్న అదనపు నూనెలను శుభ్రపరుస్తుంది, జుట్టును బలపరుస్తుంది, పెరుగుదలను ప్రోత్సహిస్తుంది మరియు చుండ్రుతో పోరాడుతుంది. 

 జుట్టు అందంగా మెరవడానికి, స్మూత్ గా ఉండడానికి గుడ్డు చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత 2 స్పూన్ల గడ్డ పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు చుండ్రు సమస్యను అరికట్టడంలో జుట్టు మెత్తగా, మృదువుగా ఉండటంలో ఆరోగ్యంగా పెరగడంలో చాలా బాగా సహాయపడుతుంది. చుండ్రు సమస్య అధికంగా ఉన్నప్పుడు పుల్లటి పెరుగులో వేసుకోవాలి. అలాగే చుండ్రు ఉన్నప్పుడు ఒక గుప్పెడు వేపాకులు కూడా వేసుకోవాలి. తరువాత వీటన్నింటినీ మెత్తని పేస్ట్ లా చేసుకొని ఆ పేస్ట్ ను జుట్టుకు అప్లై చేయాలి. ఒక గంట తర్వాత మీరు వాడే షాంపూతో తలస్నానం చేయవచ్చు. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల ఇన్ఫెక్షన్ తగ్గి జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. అందమైన మెరిసే, పొడవైన, ఒత్తయిన జుట్టు కోసం ఈ చిట్కాను పాటించవచ్చు.

Leave a Comment

error: Content is protected !!