baby skin whitening bath powder

మీ పిల్లలు పుట్టినప్పుడు తెల్లగా ఉండి తర్వాత నల్లగా మారుతున్నారు. అయితే ఈ బాత్ పౌడర్ వాడి చూడండి

చిన్నపిల్లల్లో పుట్టినపుడు ఒక రంగులో ఉండి పెరిగేకొద్దీ రంగు తగ్గిపోతూ ఉంటారు. అలా జరగడానికి కారణాలు ఏవైనా  మనం కొద్దిగా శ్రద్ధ పెడితే పిల్లలు మంచి రంగులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవచ్చు. దాని కోసం మనం బయట మార్కెట్ లో దొరికే ప్రోడక్ట్స్ వాడితే వారికి అవి పడకపోతే స్కిన్ ఎలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా సహజమైన పదార్థాలతో మన పెద్దలు ఉపయోగించే సున్నిపిండి పిల్లలకు ఎంతో మేలు చేసేది. ఇప్పుడు ఆ సున్నిపిండి తయారీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.

 దీని కోసం మనం ఒక స్పూన్ బియ్యం తీసుకోవాలి. దానిలో 4 స్పూన్ల పెసరపప్పు వేసుకోవాలి. దానిలో మినప్పప్పు వేసుకోవాలి. ఛాయ మినపపప్పు అయితే రెండు స్పూన్లు, గుళ్ళు అయితే ఒక స్పూన్ వేసుకోవాలి. ఈ మూడింటిని మిక్సీలో వేసి మెత్తని పౌడర్ చేసుకోవాలి. పౌడర్ బాగా జల్లించుకుని కొంచెం గరుకుగా ఉన్న దానిని పక్కన పెట్టుకోవాలి. ఇది పిల్లలకి నలుగుపెట్టినపుడు చర్మాన్ని చీరుకునేలా చేస్తుంది. 

ఇప్పుడు మెత్తని పౌడర్ ఒక స్పూన్ తీసుకుని అందులో  ఒక స్పూన్ పాల మీగడ వేసుకోవాలి. పాలమీగడ చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా చేస్తుంది. ఈ పదార్థాలు అన్ని బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా నీటిని వేసుకుంటూ పిల్లలకు అప్లై చేసే విధంగా ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. పిల్లలకు కొద్దిగా కొబ్బరి నూనె అప్లై చేసి మంచిగా మసాజ్ చేయాలి. దీనివలన పిల్లల్లో రక్తప్రసరణ మెరుగుపడి మంచి రంగు వస్తారు. తరువాత ఈ మిశ్రమాన్ని రాసి నెమ్మదిగా నలుగు పెట్టడం ద్వారా వారి చర్మంపై ఉన్న మృత కణాలు తొలగిపోయి చర్మం మంచి కాంతివంతంగా రంగులోకి వస్తుంది.

 ప్రతిరోజు స్నానం చేసే ముందు ఇలా నలుగు పెట్టవచ్చు. ప్రతిరోజు కుదరనివారు కనీసం వారానికి రెండు రోజులు వాడాలి. ఇంకా ఈ నలుగు పిండిలో కొద్దిగా పసుపు పెసరపప్పు బదులు పెసలు వాడుకోవచ్చు. ఇవన్నీ పిల్లల్లో రంగును పెంచేందుకు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు చాలా బాగా సహాయపడుతాయి.

Leave a Comment

error: Content is protected !!