Belly Fat Risks Reduces Cholesterol in Body

భారీగా పెరిగిన మీ పొట్ట ఫ్లాట్ గా అవుతుంది…

అధిక బరువు వలన   బ్రెయిన్ ఎఫిషియన్సీ బాగా తగ్గిపోతుందని సైంటిఫిక్ గా నిరూపించడం జరిగింది. పిల్లలకి ఇటు పెద్దలకి ఇద్దరికీ నష్టం జరుగుతుంది అని చెప్పారు. పిల్లల్లో 10 కేజీల కంటే ఎక్కువ బరువు ఉంటే దానిని ఒబిసిటీ అంటారు. అలాంటి ఓబిసిటీ ఉన్నప్పుడు కాగ్నిటివ్ ఫంక్షన్స్ ఆలోచన శక్తి, నిర్ణయాలు తీసుకునే శక్తిగాని, తర్కం చేసే కెపాసిటీ కానీ ఇలాంటి కాగ్నిటివ్ ఫంక్షన్స్ అన్ని తగ్గిపోతున్నాయని సైంటిఫిక్ గా నిరూపించడం జరిగింది. పెద్దల మీద పరిశోధన చేసింది కెనడా వారు 2022 సంవత్సరంలో 1989 మంది మీద వీళ్లు పరిశోధన    చేశారు. 30-70 సంవత్సరాల మధ్య వయసు వారిని పరిశోధన చేశారు.

               అలాగే పిల్లల్లో కూడా ఈ కాగ్నిటివ్ ఫంక్షన్స్ అన్ని బాగా తగ్గుతున్నాయి. అలాగే ఆలోచించే శక్తి, వర్క్ ఎబిలిటీ కూడా తగ్గుతున్నాయి అని 872 మంది పిల్లల్ల మీద చిల్డ్రన్స్ హాస్పిటల్ బోస్టన్ USA వారు 2014లో పరిశోధన చేశారు. ఈ ఫ్యాట్ పెరిగే దాంట్లో ఎబ్డామినల్ ఫ్యాట్ ఎవరికైతే పెరుగుతుందో వీళ్ళకి ఇంకా ఎఫెక్ట్ అవుతుందని ఇద్దరు పరిశోధనలలో తెలియజేశారు. ఈ కొవ్వు కణాలు ఇన్ఫ్లమేషన్ కి గురై మూడు కోణాల్లో బ్రెయిన్ సెల్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. మొదటిది బ్రెయిన్ సెల్స్ లో రిలీజ్ అయ్యే ట అని ప్రోటీన్ మరియు ఎంలోయిడ్ ఇవన్నీ కూడా అధికంగా రిలీజ్ అవుతున్నాయి.

              ఇన్ఫ్లమేషన్ వల్ల ఈ రిలీజ్ అయిన ఈ వేస్ట్ అంతా నర్వ్ సెల్స్ లో డిపాజిట్ అవ్వడం జరుగుతుంది. దీనివల్ల నర్వ్ సెల్స్ యెక్క నెట్వర్క్ డ్యామేజ్ అయ్యి  కమ్యూనికేషన్ వ్యవస్థ బాగా దెబ్బతినడం వల్ల బ్రెయిన్ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. ఇది మెయిన్ గా ఈ బ్రెయిన్ సెల్స్ లో రిలీజ్ అయ్యే వేస్ట్ వల్ల జరిగే నష్టం. ఈ ఫ్యాట్ సెల్స్ లో రిలీజ్ అయ్యే ఇన్ఫ్లమేషన్ వల్ల మెదడు కణాల్లో ఉండే రిసెప్టార్స్ ని, కణం లోపల ఉండే మైటోకాండ్రియాలని డామేజ్ చేస్తుంది. మూడవది బ్రెయిన్ సెల్స్ కి వెళ్లే బ్లడ్ సప్లైలో ముడుచుకుపోయిన  బ్రెయిన్ సెల్స్ కి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. అందుకని సాధ్యమైనంత వరకు కొవ్వులు పెరగకుండా ఉండాలంటే ఉదయం పూట ఫ్రూట్స్, స్ప్రౌట్స్ తినాలి.

             మధ్యాహ్నం ఒక పుల్కా పెట్టుకొని తినాలి. సాయంత్రం పూట ఫ్రూట్స్, సలాడ్స్, నట్స్ తింటే చాలా మంచిది.

Leave a Comment

error: Content is protected !!