వంటింట్లో ఉన్న పదార్థాలలో ఎక్కువ ఔషదశక్తి కలిగి ఉన్న పదార్థం ఏది అంటే ఠక్కున వెల్లుల్లి అని చెప్పవచ్చు. మన భారతీయుల వంటల్లో ఒక భాగమైన వెల్లుల్లి కేవలం వంటలకు రుచిని సువాసనను ఇవ్వడం మాత్రమే కాదు ఔషధంగా ప్రపంచ వ్యాప్తంగా వాడుకలో ఉంది. భారతదేశంలో నాటి నుండి నేటివరకు ఆదరణలో ఉన్న సిద్ధ, ఆయుర్వేదం, యునానీ వైద్యాలలో వెల్లుల్లి ఔషధ విలువలని గుర్తించారు. సంప్రదాయక చైనా వైద్యంలో వెల్లుల్లికి ప్రాముఖ్యత ఉంది. హోమియోపతిలో ఏలియం సిపా, ఏలియం సెతీవం అనే మందులు ఉన్నాయి. ఇవన్నీ కూడా వెల్లుల్లి విశిష్ఠతను చెప్పకనే చెబుతున్నాయి.
ఉబ్బసం, జర్వం, నులి పురుగులు, కాలేయం, పిత్తాశయ సంబంధ వ్యాధులు మొదలైన వాటికి వెల్లుల్లి చక్కటి ఔషధంగా ఉపయోగపడుతుంది. అలాగే హృదయ సంబంధ వ్యాధులు, జుట్టు సమస్యలకు, ఆకలి పుట్టటానికి వెల్లుల్లి ఉపయుక్తమవుతుంది. ల్యుకోడెర్మా కుష్టు, మొలలు, కడుపులో పురుగులు, ఉబ్బసం, దగ్గు మొదలైన వ్యాధులకు కూడా వెల్లుల్లి ఉపయోగపడుతుంది.
ఇంతటి గొప్ప గుణాలు ఉన్న వెల్లుల్లిని ఉదయాన్నే తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలను మనమే పరిష్కరించుకోవచ్చు. అయితే రహస్యమంతా ఆ తీసుకునే విధానంలో ఉంది. మీకోసం వెల్లుల్లితో ఒక అద్భుత రహస్యాన్ని పంచుకుంటున్నాం మీరు ఆచరించి గొప్ప ఫలితాలను పొందండి.

ఉదయాన్ని వెల్లుల్లితో మొదలు పెడదాం.
కావలనసిన పదార్థాలు.
వెల్లుల్లిపాయ, తేనె. ఇవేమీ పెద్ద ఖర్చు కూడా అవ్వవు కాబట్టి అందరూ నిస్సంకోచంగా దీన్ని వాడచ్చు. దీన్ని వాడిన తరువాత కలిగే మార్పులు చూసి మీరు ఆశ్చర్యపోవడం ఖాయం.
తీసుకునే విధానం.
వెల్లుల్లిని తురిమి తేనెలో కలిపాలి. దీన్ని ప్రతిరోజు ఉదయం లేవగానే కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత ఒక స్పూన్ మోతాదు తీసుకోవాలి. కుప్పలకొద్ది టాబ్లెట్లు మింగుతూ ఆరోగ్యం కోసం పాకులాడే బదులు ప్రతిరోజు ఉదయం ఈ చిన్న పని చేయండి చాలు.
ఉపయోగాలు
◆ఉదయాన్నే వెల్లుల్లి తీసుకోవడం వల్ల శరీరంలో రక్తాన్ని శుద్ధి చేస్తుంది, రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
◆వెల్లుల్లి మరియు తేనె లో ఉండే ఆంటి ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గొంతు నొప్పిని తగ్గించడంలో, గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగించడంలో గొప్పగా గా సహాయపడుతుంది.
◆ఇందులో ఉండే గ్లిజమిక్ ఇండెక్స్ జీర్ణ శక్తిని పెంచుతుంది తద్వారా మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది. అంతే కాదు డయోరియాను తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తుంది.
◆పచ్చి వెల్లుల్లి తేనెలో కలపడం వల్ల వెల్లుల్లి లో ఉన్న రసం తేనెతో కలుస్తుంది. అందులో ఉన్న ఆంటి ఆక్సిడెంట్స్ , ఆంటి మైక్రోబయల్ ప్రొపర్టీస్ జలుబు, దగ్గు ను సమర్థవంతంగా నయం చేస్తాయి.
◆వెల్లుల్లి తేనె మిశ్రమం శరీరంలో ఉన్న టాక్సిన్ లను తొలగించడంతో పాటు శరీరాన్ని శుభ్రం చేస్తుంది.
◆అధిక బరువు ఉన్నవాళ్లు వెల్లుల్లి తీసుకోవడం వల్ల క్రమంగా సన్నబడతారు. శరీరంలో పేరుకుపోయిన కొవ్వులను కరిగించి గుణం వెల్లుల్లితో పుష్కలంగా ఉంది.
చివరగా…….
వెల్లుల్లి అనేది మన జీవితంలో భాగం అయినప్పటికి ఉదయాన్నే తేనెతో తీసుకుంటే పైన చెప్పుకున్న సమస్యలకు పరిష్కారం మాత్రమే కాకుండా ఇంకా బోలెడు ప్రయోజనాలు కూడా పొందవచ్చు. అందుకే తల్లిలాంటి వెల్లుల్లి ప్రతి ఇంట్లో తప్పక ఉండాలి.
Super performance and health able body very very good natural health