పైనాపిల్ విటమిన్ సి, బి విటమిన్లు, ఫైబర్ మరియు మాంగనీస్ వంటి ఖనిజాలకు గొప్ప మూలం.
ఈ పండు సహజంగా ఫ్రక్టోజ్ రూపంలో చక్కెరను కలిగి ఉంటుంది, కాబట్టి పైనాపిల్ ను తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన సహజ చెక్కెరలు సులువుగా లభిస్తాయి. పైనాపిల్ ను ఆరోగ్యపరంగా ప్రయోజనాల కోసం ఎన్నో రకాలుగా తీసుకుంటారు. ఇంతకు పైనాపిల్ లో ఉన్న ఆరోగ్యప్రయోజనాలు ఏమిటో చూద్దాం మరి.
విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది.
“పైనాపిల్‌లో సమృద్ధిగా లభించే పోషకం విటమిన్ సి, ఇది రోగనిరోధక వ్యవస్థను సమర్థవంతంగా ఉండేలా చేస్తుంది. మరియు యాంటీఆక్సిడెంట్ ప్రయోజనాలను అందిస్తుంది” అనారోగ్యంతో బాధపడుతున్నవారు పైనాపిల్ ను టీసుకోవడం ద్వారా రోగనిరోధక వ్యవస్థ బలపడి వైద్యం సహకరించి తొందరగా కోలుకుంటారు. అలాగే ఇది ఐరన్ గ్రహించడంలో తోడ్పడుతుంది.
బరువు తగ్గడానికి దోహాధం చేస్తుంది
బరువు తగ్గడానికి పైనాపిల్ అద్భుతంగా పనిచేస్తుంది. పైనాపిల్ రసం కొవ్వు ఏర్పడటాన్ని తగ్గించడానికి మరియు కొవ్వును సులువుగా కరిగించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇందులో కేలరీలు తక్కువ మోతాదులో ఉంటాయి. మరియు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీవక్రియపై గణనీయమైన ప్రభావాన్ని చూపడం ద్వారా ఆహారాన్ని సులువుగా జీర్ణమయేట్టు చేయడంలో దోహాధం చేస్తుంది. ఇందులో ఎలాంటి ఫ్యాట్ ఉండదు కాబట్టి బరువు పెరుగుతామనే భయం కూడా అక్కర్లేదు.
జీర్ణక్రియకు సహాయపడుతుంది
పైనాపిల్‌లో బ్రోమెలైన్ ఉంటుంది, ఇది ఎంజైమ్‌ల మిశ్రమం, ఇది మంట మరియు నాసికా వాపును తగ్గిస్తుంది మరియు కాలిన గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది. అంతే కాదు పేగు ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇందులోని బ్రోమెలైన్ అతిసార ప్రభావాలను తగ్గించటానికి సహాయపడుతుంది.
ఎముకలను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.
ఎముకలను బలంగా ఉంచటానికి కాల్షియం తో పాటు మాంగనీస్ కూడా అవసరం అవుతుంది. మాంగనీస్ బోలు ఎముకల వ్యాధిని నివారించడంలో సహాయపడుతుంది మరియు మొత్తం ఎముక ఖనిజ సాంద్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అయితే, అతిగా తినకుండా జాగ్రత్త వహించడం ఎంతో అవసరం.
యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా కలిగి ఉంటుంది.
పైనాపిల్ యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా కలిగి ఉంటుంది, ప్రత్యేకంగా ఫినోలిక్స్, ఫ్లేవనాయిడ్లు మరియు విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. శరీరానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ ను బయటకు పంపడంతో సమర్థవంతమైన పాత్ర పోషిస్తుంది. అలాగే గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, అల్జీమర్స్ వ్యాధి మరియు కంటి సమస్యలతో సహా అనేక ఆరోగ్య సమస్యలకు దారితీసే ఫ్రీ రాడికల్స్ తో పోరాడి వాటిని విచ్చిన్నం చేస్తాయి.
యాంటీక్యాన్సర్ కణాలను కలిగి ఉంటుంది.
శరీరంలో ఆరోగ్యకరమైన కణజాలాన్ని దెబ్బతీసి రోగనిరోధక వ్యవస్థను బలహీనం అయినపుడు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాన్సర్ కు దూరం గా ఉండటానికి చాలామంది వైద్యులు యాంటీక్యాన్సర్ ఏజెంట్ లు సమృద్ధిగా ఉన్న ఆహారాన్ని తీసుకోమనడం. అలాంటి ఆహార కోవలోకే పైనాపిల్ కూడా వస్తుంది. పైనాపిల్ లో యాంటీక్యాన్సర్ కణాలు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి తరచుగా పైనాపిల్ తీసుకోవడం వల్ల కాన్సర్ కు దూరజంగా ఉండవచ్చు.
చివరగా……
పైనాపిల్ ను తరచుగా తీసుకోవడం వల్ల మంచి పోషకాల సమ్మేళనంతో నిండి ఉండటం వలన ఆరోగ్యాన్ని, యాంటీ ఏజింగ్ ఏజెంట్ గా, రోజంతా ఉల్లాసాన్ని కలిగిస్తూ గొప్ప ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది.