benefits of tender coconut water empty stomach

పరగడుపున కొబ్బరి నీళ్లు తాగితే ఎం జరుగుతుందో తెలుసా??

కొబ్బరి మన ఆహారంలో భాగం. కొబ్బరికాయ ప్రతి కార్యం లో తప్పక ఉండి తీరుతుంది. ఇది ఎంతో పవిత్రమైనది. మరి కొబ్బరి నీరు! అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరికి తప్పక ఇచ్చే ఆహారాల్లో కొబ్బరి నీరు అగ్రస్థానంలో ఉంటుంది. శరీరానికి శక్తిని ఇచ్చి, రోగనిరోధక శక్తిని పెంచడంలో కొబ్బరి నీళ్లు అద్భుతంగా పనిచేస్తాయి.  అయితే కొబ్బరి నీళ్లు ఉదయాన్నే పరగడుపున తాగడం చాలా శ్రేష్టమని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇంతకు పరగడుపున కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?? తప్పక తెలుసుకోవలసినదే.

◆గుండె పనితీరు సక్రమంగా ఉంచడంలో, మన శరీరంలోని  కణాల నుండి వ్యర్థ ఉత్పత్తులను తొలగించడానికి మరియు  శరీరంలో అవయవాల పనితీరు మెరుగుపరచడంలో శరీరానికి పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లు అవసరం.  ఈ పొటాషియం శరీరానికి గొప్ప పోషకం కూడా. పొటాషియం అనేది ప్రస్తుతం చాలా మందికి అందని పోషకాహారంగా ఉంది. ఆరోగ్యకరమైన పెద్దలకు రోజుకు సుమారు 3,510 మిల్లీగ్రాముల పొటాషియం అవసరం అవుతుంది.  అయితే కొబ్బరి నీరులో ఈ పొటాషియం స్థాయిలు సమృద్ధిగా ఉంటాయి. 

◆ఒక గ్లాసుడు కొబ్బరి నీటిలో 600 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. అరటిపండు స్తాయితో పోలిస్తే కొబ్బరి నీటిలోనే పొటాషియం ఎక్కువగా ఉంటుంది.   

◆ కొబ్బరి నీటిలో శరీరాన్ని హైడ్రేట్ చేసే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. వేసవి తో ఇబ్బంది పడుతున్నపుడు మరియు శరీర ఉష్ణోగ్రత పెరిగినపుడు కొబ్బరి నీటిని తీసుకోవడం ద్వారా శరీర ఉష్ణాన్ని సాధారణ స్థాయికి తీసుకువస్తుంది..

◆మద్యపానం అలవాటు ఉన్నవారు రాత్రంతా బాగా తాగి ఉదయాన్నే తలనొప్పి, తలా భారం తో బాధపడుతున్నపుడు కొబ్బరి నీటిని ఉదయాన్నే పరగడుపున తీసుకోవడం ద్వారా మద్యపానం వల్ల సంభవించే హ్యాంగోవర్ నుండి ఉపశమనం పొందవచ్చు.

◆కొబ్బరి నీటిలో 95% నీరు, మిగిలిన 5% గ్లూకోజ్, లవణాలు వంటివి ఉంటాయి. దీనివల్ల పరగడుపున కొబ్బరి నీరు తీసుకోవడం ద్వారా శరీరాన్ని ఉల్లాసంగా ఉండేలా చేస్తుంది. ఇది సహజమైన ఎనర్జీ డ్రింక్ గా పనిచేస్తుంది. 

◆ కొబ్బరి నీళ్ల వల్ల హైడ్రేషన్ మానసిక దృష్టిని కాపాడుకోవడానికి, శరీర  పిహెచ్ స్థాయిలను సమతుల్యం చేయడానికి, శరీర ఉష్ణోగ్రతను స్థిరీకరించడానికి మరియు  మీ శరీరానికి అవసరమైన పోషకాలను అందించడానికి కూడా అవకాశం ఉంది

◆ కొబ్బరి నీళ్ళు ఖాళీ కడుపుతో తాగడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఇది తక్కువ ఆమ్లతను కలిగి ఉంటుంది. సాధారణంగా ఉదయాన్నే తీసుకునే కాఫీ మరియు టీ వంటివి ఆమ్లత్వాన్ని అధికంగా కలిగి ఉంటాయి. వీటి బదులు కొబ్బరి నీళ్లు తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థను శుభ్రం చేస్తుంది, పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. 

◆ఎన్నోరోజులుగా తీసుకుంటున్న కాఫీ మరియు టీ ల వల్ల శరీరంలో పేరుకున్న కెఫిన్ ప్రభావాన్ని కొబ్బరి నీళ్లు తగ్గించగలవు. అలాగే మలబద్దకాన్ని తగ్గించడంలో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తాయి.

 చివరగా….

ప్రతిరోజు ఉదయాన్నే కొబ్బరి నీళ్లు  తీసుకోవడం వల్ల గొప్ప ఆరోగ్య ప్రయోజనాలే కానీ ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు కాబట్టి అందుబాటులో ఉన్నపుడు తప్పక తాగండి. 

Leave a Comment

error: Content is protected !!