Best Easy Weight Loss Home Remedies in Telugu

ఈ ఒక్కటి అన్నంలో కలుపుకుని తింటే కొలెస్ట్రాల్, అధిక బరువు, షుగర్ తగ్గిపోతాయి

అన్నం పరబ్రహ్మ స్వరూపం అని సామెత ఊరికే చెప్పలేదుఈ  సామెత మన ఆహార పదార్థాలు అన్నం ఎంత ముఖ్యమైనదో తెలియజేస్తుంది. మనదేశంలోనే కాకుండా ప్రపంచంలో చాలా దేశాల్లో ప్రముఖ పాత్ర వహిస్తుంది. దక్షిణ భారత దేశంలో అయితే బియ్యం  చౌకగా ఉండటం వల్ల ఎక్కువగా అన్నం మాత్రమే తింటారు. ఏ కూరతో అయినా కలుపుకొని తినగలిగే సౌలభ్యం ఉండటంతో మన దేశంలో  ఎక్కువగా తింటాం.

అయితే ఈ రోజుల్లో చాలామంది  బియ్యాన్ని పాలిష్ చేసి తెల్లగా మల్లెపువ్వులా ఉన్న అన్నం అంటే ఇష్టం. దీన్ని ఎక్కువగా తింటుంటారు. చాలామంది  అందుకే అనారోగ్యాలు కూడా కొనితెచ్చుకుంటారు.  దీనికి ముఖ్యమైన కారణం నిత్యం ఒకే దగ్గర కూర్చుని పనిచేసే వారికి శరీరంలో శక్తి ఎక్కువగా ఖర్చు కాదు. దానితో కొవ్వు పేరుకుపోతుంది. దీంతో అధికంగా బరువు పెరుగుతారు. గుండెజబ్బులు కూడా వస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్  ఇంకా ఎక్కువవుతుంది.

దీంతో ఈ రోజుల్లో చాలా మంది ఇతర ఆహార పదార్థాలు, చపాతీలను తింటున్నారు. చపాతీలు తినలేక అన్నం మర్చిపోలేక సరిగా తినడం లేదు. మానసికంగా బాధ పడుతున్నారు. అన్నం ఇలా వండి  తిన్నట్లయితే ఎక్కువ కేలరీలు రావు. అన్నంలో వండేటప్పుడు కొబ్బరి నూనె వేయాలి. కొబ్బరి నూనె తలకు రాసుకుని కొబ్బరి నూనె కాకుండా వంట కొబ్బరి నూనె కూడా దొరుకుతుంది. కిరాణా షాపుల్లో, ఆన్లైన్ లో దొరుకుతుంది. ఈ కొబ్బరి నూనె  వండుకునేటప్పుడు బియ్యంలో  కలిపి పెట్టాలి.

కొబ్బరినూనె కలపడం వలన శరీరంలో కొలెస్ట్రాల్ పెరగదు. ఆహారం జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది.ఆహారం జీర్ణం అవ్వడానికి  శరీరంలో కొవ్వు కరిగి పోతుంది. ఈ నూనె అన్నంలో కలుపుకుని తినడం వలన అధిక బరువు, కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీనిని కేజీ బియ్యానికి 30 గ్రాములు వేయాలి. మనం  వేసుకున్న బియ్యానికి మూడు శాతం కొబ్బరి నూనె కలపాలి. అన్నం ఉడికిన తరువాత ఫ్రిజ్లో పెట్టి 12 గంటల పాటు ఉంచాలి. తర్వాత తీసి వేడి చేసుకుని తినాలి.

ఇలా చేయడం వలన  అన్నంలో క్యాలరీలను తగ్గిస్తుంది. ఇలా తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ అనేది పెరగదు. మామూలుగా కొబ్బరి నూనె వేయకుండా 100 గ్రాములు అన్నం తింటే 400 క్యాలరీలు వస్తాయి కానీ ఇలా 100 గ్రాములు అన్నం తినడం వల్ల నాలుగు క్యాలరీల శక్తి మాత్రమే వస్తుంది.  డయాబెటిస్ ఉన్నవాళ్లు కూడా  ఈ అన్నం చక్కగా తినొచ్చు.

Leave a Comment

error: Content is protected !!