కొంతమంది జుట్టు రాలడం సమస్యతో చాలా ఎక్కువగా బాధ పడుతుంటారు. ఈ సమస్య తగ్గించుకోవడం కోసం రకరకాల హెయిర్ ప్యాక్స్, ఆయిల్స్ ఉపయోగిస్తుంటారు. మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ కెమికల్స్ ఉండటం వలన చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నాచురల్ గా దొరికే వాటితో మీ జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. దీనికోసం ముందుగా ఒక గుప్పెడు మందార ఆకులను తీసుకోవాలి. మందార ఆకులు జుట్టు రాలడం తగ్గించి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరిగేలా చేస్తుంది.
తర్వాత దీని కోసం మనం మునగాకును తీసుకోవాలి. మునగాకు విటమిన్ సి అధికంగా కలిగి ఉంటుంది. ఇది జుట్టు రాలడం తగ్గించి తలలో ఉండే చుండ్రు, ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత ఒక చిన్న సైజు కలబంద తీసుకోవాలి. కలబంద జుట్టు సాఫ్ట్ గా చేయడంలో సహాయపడుతుంది. అలాగే జుట్టు రాలడం తగ్గి జుట్టు పెరగడం ప్రోత్సహిస్తుంది. ఒక గుప్పెడు తులసి ఆకులను తీసుకోవాలి. తులసి ఆకులు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉండడం వల్ల తలలో ఉండే చుండ్రు, సోరియాసిస్, ఇన్ఫెక్షన్, పొక్కులు వంటి సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
జుట్టు పెరగడాన్ని ప్రోత్సహించడంలో కూడా తులసి ఆకులు చాలా బాగా సహాయపడుతాయి. ఒక గుప్పెడు గుంటకలవరాకు తీసుకోవాలి. గుంటకలవరాకు జుట్టు పెరగడంలో అద్భుతంగా పనిచేస్తుంది. గుంటగలగరాకు జుట్టును ఒత్తుగా, నల్లగా పెరగడంలో సహాయపడుతుంది. గుంటకలవరాకు మెలనిన్ అనే పదార్థం ఎక్కువగా రిలీజ్ చేసి తెల్ల జుట్టు రాకుండా వచ్చిన జుట్టు నల్లగా అవ్వడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. ఒక గుప్పెడు వేపాకులు తీసుకోవాలి.
వేపాకు తలలో ఉండే అన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ను తగ్గించి స్కాల్ప్ క్లియర్ చేస్తుంది. దురద, ఇన్ఫెక్షన్స్, చుండ్రు వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. జుట్టు ఒత్తుగా పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది. తర్వాత నాలుగు చెంచాల మెంతులను రాత్రి నానబెట్టుకుని ఉంచుకోవాలి. కండిషన్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడానికి కూడా ఉపయోగపడతాయి. తర్వాత రెండు చెంచాల పెరుగు వేసి వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
తర్వాత ఒక చెంచా కాస్టర్ ఆయిల్ లేదా మీరు రెగ్యులర్గా వాడే నూనె ఏదైనా సరే కలుపుకోవచ్చు. నూనె వేయడం వలన జుట్టు స్మూత్ గా అవుతుంది. ఈ ప్యాక్ నూనె రాసిన తలకు లేదా డ్రై హెయిర్ కు అప్లై చేసి ఒక గంట పాటు ఆరనివ్వాలి. తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూ లేదా హోమ్ మేడ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేసినట్లయితే మీ జుట్టు ఎంత పలుచగా ఉన్న ఒత్తుగా పెరుగుతుంది. ఈ ప్యాక్ ను అప్లై చేయడం వల్ల మీ జుట్టు నల్లగా, సిల్కీగా, మృదువుగా మెరుస్తూ కనిపిస్తుంది. ఒత్తుగా, పొడవుగా కూడా పెరుగుతుంది.