best remedy for hair growth with aloe vera

ఈ ఆయిల్ ఒక్కసారి రాస్తే చాలు జుట్టు నల్లగా, ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది

 అందరికి జుట్టు రాలడం చాలా ఎక్కువగా ఉంది. అన్ని సీజన్స్ కంటే జుట్టు రాలే సమస్య చలికాలంలో ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో జుట్టు, చర్మం పొడిబారడం, చిగుళ్లు చిట్లిపోవడం వంటి సమస్య ఎక్కువగా ఉంటుంది. జుట్టు రాలే సమయంలో మనం కేర్ తీసుకోకపోతే జుట్టు పలుచబడిపోతుంది. జుట్టు రాలే సమస్యను ఈ చిట్కాతో ఈజీగా తగ్గుతుంది. ఇప్పుడు ఆ రెమెడీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం కలబంద మట్ట తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

పీల్ చేయనవసరం లేదు. కలబంద ముక్కలను మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఈ రెమెడీ కోసం ఆవనూనె లేదా బాదం నూనె లేదా కొబ్బరి నూనె తీసుకోవాలి. ఆయిల్ మన జుట్టుకి ఏది సరిపడితే అది వాడుకోవచ్చు. స్టవ్ మీద కడాయి పెట్టి ఒక కప్ నూనె వేసుకోవాలి. దీనిలో ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న అలోవెరా కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ నూనెను అలోవెరా మొత్తం ఆవిరి అయిపోయి నూనె మాత్రమే మిగిలేలా మరిగించుకోవాలి.

ఈ నూనెలో పది మిరియాలు కూడా వేసుకుని 5నిముషాల పాటు మరిగించుకోవాలి.  స్టవ్ ఆఫ్ చేసి  నూనె చల్లారనివ్వాలి. తర్వాత ఏదైనా  క్లాత్ తో వడకట్టుకోవాలి. ఈ నూనెను  ఏదైనా గాజు సీసాలో పెట్టి మూడు నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు. అలోవెరాలో కెరాటిన్,విటమిన్ A,విటమిన్ B యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి చందూలాల్ ఎవరో జుట్టు ఒత్తుగా పొడవుగా పెరిగేలా చూస్తుంది. మిరియాల కూడా జుట్టు నల్లగా ఒత్తుగా పొడవుగా పెరిగే లాగా చేస్తాయి.

యాంటీ ఫంగల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటాయి. ఇన్ఫెక్షన్స్ ఉంటే  తగ్గించి జుట్టు పొడవుగా పెరగడంలో  సహాయపడతాయి.చుండ్రు ఉంటే  తగ్గిస్తాయి.ఈ ఆయిల్  గోరువెచ్చగా చేసి జుట్టు కుదుళ్ళ నుండి చిగుళ్ల వరకు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నా తర్వాత 15 నిముషాల పాటు మసాజ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ అప్లై చేసి 2-3  గంటల పాటు అలా వదిలేయాలి. కుదిరితే ఒకటి, రెండు రోజులు అలా  ఉంచుకున్న పర్వాలేదు.

ఏదైనా మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు అప్లై చేయడం వలన 15 రోజులలో జుట్టు రాలడం తగ్గి, జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.ఈ ఈజీ చిట్కాతో మీ జుట్టు కూడా పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది.

Leave a Comment

error: Content is protected !!