best ringworms homeremedy

తొడలు,గజ్జల్లో వచ్చే భయంకరమైన గజ్జి,తామర,దురదను 3 రోజుల్లో మాయం చేసే ఆయుర్వేద చిట్కా

హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం గజ్జి తామర దురద ఇటువంటి చర్మ సంబంధ సమస్యల నివారణకు ఒక అద్భుతమైన ఆయుర్వేదిక్ హోమ్ రెమిడీ గురించి తెలుసుకుందాం. ఈ రెమిడి ఎలా తయారు చేయాలో ఎలా వాడాలో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.

రెమిడి ఎలా తాయారు చేసుకోవాలి

ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో ఒకటిన్నర గ్లాసు నీటిని తీసుకోవాలి. తర్వాత ఇందులో మూడు లేదా నాలుగు వేపాకు రెమ్మలను లేదా ఒక గుప్పెడు వేప ఆకులు వేయాలి. గ్యాస్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ గిన్నె పెట్టి నీటిని కనీసం ఐదు లేదా ఆరు నిమిషాల పాటు నీరు సగం అయ్యే వరకు బాగా మరిగించండి. నీటి రంగు మారిన తర్వాత స్టవ్ ని ఆఫ్ చేయండి. ఒంకొక ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ కొబ్బరినూనె తీసుకోండి. తరువాత ఇందులో రెండు కర్పూరం బిళ్ళలు పొడి చేసి ఇందులో వేసి బాగా కలపండి.

రెమిడీ వాడే విధానం

ఏప్రదేశంలో అయితే చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారో ఆ ప్రదేశంలో  వేపాకు నీటితో బాగా శుభ్రపరచాలి. తర్వాత పొడిగుడ్డతో మీ చర్మాన్ని శుభ్రంగా తుడవండి. తరువాత ఇంతకు ముందు తయారు చేసుకున్న కొబ్బరి నూనె కర్పూర మిశ్రమాన్ని మీ చర్మంపై అప్లై చేసి రెండు నిమిషాల పాటు మసాజ్ చేయండి. ఈ మిశ్రమాన్ని అలాగే ఒక గంట పాటు ఉంచుకోవాలి. లేదంటే రాత్రిపూట ఈ మిశ్రమాన్ని అప్లై చేసి రాత్రంతా అలాగే ఉంచండి. ఈ రెమిడీని ఇలా రోజులో రెండు నుంచి మూడు సార్లు ఒక్క వారం రోజులు ఫాలో అయి చూడండి. మీకు ఎటువంటి గజ్జి తామర దురదలు ఎగ్జిమా లాంటి చర్మ సంబంధిత సమస్యలు మాయమవటమే కాదు జీవితంలో మళ్లీ రావు.

వేపాకులు ఆంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ యాంటి మైక్రోబియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన చర్మసంబంధ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియాను నాశనం చేయడానికి బాగా హెల్ప్ చేస్తాయి.

Leave a Comment

error: Content is protected !!