black cardamom benefits in telugu

రోజుకి ఒకటి…కీళ్ల నొప్పులు,అధిక బరువు,రక్తపోటు,శ్వాస సమస్యలు,గుండె దడ వంటి సమస్యలు జీవితంలో ఉండవు

యాలకులు అనగానే మనకి పచ్చవి మాత్రమే గుర్తొస్తాయీ. కానీ యాలకులలో నల్లవికూడా ఉంటాయి. ఈరోజు నల్లయాలకులు గురించి తెలుసుకుందాం. యాలకులు మంచి  సుగంధద్రవ్యము. యాలకులను పురాతన కాలం నుండి సుగంధద్రవ్యంగా వాడతారు. రెండవశతాబ్దంలో శుశ్రూతుడు రాసిన చరక సంహితలోనూ , నాలగవ శతాబ్దంలో కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రంలోనూవీటీ ప్రస్తావన ఉంది. 

వీటిని సుగంధద్రవ్యాలను రాణిగా పేర్కొంటారు. మనం ఎక్కువగా పచ్చ యాలకులు వాడుతుంటాం. నల.లయాలకులు చాలా అరుదుగా దొరుకుతాయి. ఇప్పుడు సూపర్ మార్కెట్లో సులువుగానే దొరుకుతున్నాయి. నల్లయాలకులలో ఔషధగుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం. మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి

యాలకులు నుండి తీసిన నూనెను ప్రభావవంతమైన ఎసెన్షియల్ ఆయిల్ గా వాడతారు. అరోమాళథెరపీలో ఎక్కువగా వాడతారు. నల్లయాలకుల ఉద్దీపన గుణాలు గ్యాస్ట్రిక్, పేగు గ్రంథుల కణాల పరిమాణంలో అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. గుండెల్లో మంట, గ్యాస్ట్రిక్, అల్సర్, తిన్న ఆహారంజీర్ణంకాకపోవడం వంటి కడుపు సంబంధ వ్యాధులను తగ్గించడంలో దోహదపడుతుంది. 

ఆకలి లేనివారికి ఆకలి కలిగిస్తుంది. నల్లయాలకులు గుండె ఆరోగ్యానికి సహకరిస్తాయి. గుండె కొట్టుకునే తీరును నియంత్రిస్తుంది. రక్తపోటు అదుపులో ఉండేలా చేస్తుంది. రక్తం గడ్డకట్టే సంభావ్యతను తగ్గిస్తుంది. వేసవిలో వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. శ్వాస కోశ వ్యాధులను తగ్గించడంలో సహకరిస్తుంది. ఉబ్బసం, దగ్గు, బ్రాంకైటీస్ వంటిఅనేక శ్వాసకోశ వ్యాధులను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. 

శ్వాస కోశంలో వేడిపుట్టించి ఊపిరి తీసుకోవడం సులభతరం చేస్తుంది. శ్లేష్మపొరను తగ్గించడం కూడా శ్వాసకోశ ం ద్వారా శ్లేష్మాన్ని తగ్గిస్తాయి. జలుబు‌,దగ్గు, గొంతునొప్పి తగ్గేలా చేస్తాయి. దంతాల ఇన్పెక్షన్, గమ్ ఇన్ఫెక్షన్ వంటి ఇన్ఫెక్షన్ లు తగ్గిస్తుంది. నోటిదుర్వాసన తగ్గడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక యాలకును నమలడం ద్వారా నోటిదుర్వాసన తగ్గించుకోవచ్చు. మూత్రవిసర్జన సులభతరం చేస్తుంది. 

మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మూత్రపిండాల్లో రాళ్ళు చిన్నచిన్నవైతే కరిగేలా చేస్తుంది. రాళ్ళు ఏర్పడకుండా సహకరిస్తుంది. నల్లయాలకులలో డైనో లిగ్మంటిన్, ఇండోల్ త్రీ కార్బినల్ అనే యాంటీ ఆక్సిడెంట్లు, రసాయనాలు ఉంటాయి. పెద్దపేగు, ప్రొస్టేట్ , అండాశయ కాన్సర్ ఎదుర్కొంటాయి. యాంటీ కాన్సర్ కణాలు కాన్సర్ కణాలతో పోరాడతాయి.

 నిర్విశీకరణ చేస్తాయి.శరీరంలో విషపదార్థాలు బయటకు పంపేలా చేస్తాయి. ఆల్కలాయిడ్స్ నుండి శరీరాన్ని కాపాడతాయి. మత్తు లక్షణాలు వలన తలనొప్పి, విపరీతమైన కీళ్ళనొప్పులు, కండరాల నొప్పులు నుండి కూడా ఉపశమనం కలిగిస్తాయి. ఒత్తిడి, అలసట నుండి  రక్షిస్తాయి. క్రిమినాశక, యాంటీబాక్టీరియల్ లక్షణాలు ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి.

1 thought on “రోజుకి ఒకటి…కీళ్ల నొప్పులు,అధిక బరువు,రక్తపోటు,శ్వాస సమస్యలు,గుండె దడ వంటి సమస్యలు జీవితంలో ఉండవు”

Leave a Comment

error: Content is protected !!