body cooling fruits and vegetables

వేసవిలో తినాల్సిన మేలిమి పండు ఇదొక్కటే.! బాడీ కూల్ గా ఐస్ లా చేస్తుంది. ఎసి కూడా రాత్రికి అవసరం ఉండదు.

వేసవి అనగానే మనకు మొదటిగా గుర్తు వచ్చేది మామిడి పళ్ళు. ఏ పండునైన ఇష్టపడనివారు ఉంటారేమో..! కానీ మామిడి పళ్ళంటే ఇష్టం లేదనేవారు ఎవరైనా ఉంటారా.!  సీజనల్ ఫ్రూట్ కాబట్టి అందరూ ఇష్టపడి తింటారు. కానీ కొంత మందిలో ఈ మామిడిపళ్ళు తినేసరికి శరీరంలోని వేడి పెరిగి, సెగ్గడ్డలు రావటమో, విరేచనాలు, వికారం, మూత్రంలో మంట, తలనొప్పి, కళ్ళు మంట, మలబద్ధకం, సరిగ్గా నిద్ర పట్టకపోవటమో, ఇలాంటి సూచనలు కనిపించే సరికి వేడి చేసింది అనే భావనతో మామిడి పళ్ళు తినడం మానేస్తారు.

మావిడి పండు వేడి అంటారు కానీ,వేసవి కాలంలో తయారు చేసుకొనే  కొత్తావకాయ వేడి చేసింది అని ఎవరు అనరు.! అలా గమనిస్తే ఆవకాయలో నీటి శాతం అనేది అసలు ఉండదు, నీటి అంశం లేని ఆవకాయలో ఎక్కువ మోతాదులో ఉప్పు, కారం, నూనె  ఉంటుంది. మామిడి పళ్లలో 80% నీటి అంశం ఉంటుంది, పోషక విలువలు అధికంగా ఉంటాయి. ఇలాంటి మామిడి పళ్లు వేడి చేస్తాయా.! నోరూరించే కొత్తావకాయ వేడి చేస్తుందా.! మీరే తేల్చుకోండి. 

మామిడి పళ్ళు ఎంత తిన్నా, ఏ విధమైన వేడి  లక్షణాలు రాకూడదు అంటే, మామిడి పళ్ళను ఏ సమయంలో ఎలా తీసుకోవాలి చూద్దాం. మామిడి పళ్ళు తింటే వేడి చేస్తాయి అనే పుకారు ఎలా వచ్చింది అంటే.! మన నీళ్ళు త్రాగే పద్దతి సరిగ్గా లేక,ఈ మామిడి పళ్ళు మీద నిందలు వేస్తున్నాము.

•పరిష్కారం- పొదున్న లేవగానే లీటర్ నుండి లీటర్ పావు దాకా నీరు తాగెయ్యండి. -బ్రేక్ ఫాస్ట్ చేసేప్పుడు మధ్యలో నీళ్ళు తాగకండి, 45నిమిషాల తర్వాత రెండు గంటల వ్యవధిలో  లీటర్, లీటర్ నర నీళ్ళు తాగండి. 

మళ్ళీ మధ్యాహ్నం భోజనంలో నీళ్లు తాగకండి.. భోజనం అయిన గంట తర్వాత, సాయంత్రందాక అరగంటకో సారి గ్లాసు చప్పున అయిదు గ్లాస్ నీళ్లు  త్రాగండి. 

ఇలా ఆహారం తీసుకొనే సమయంలో కాకుండా మిగితా సమయంలో రోజుకి నాలుగు లీటర్ల నీళ్ళు తాగే అలవాటు చేసుకోండి. దీని వల్ల శరీంలోనీ వ్యర్థ పదార్థాలు అన్ని బయటకి వెళ్లి శరిరానికి చక్కగా కూలింగ్ అందుతుంది. 
ఈ విధానంలో రోజుకి నాలుగు నుండి ఐదు లీటర్ మంచి నీళ్ళు తాగండి, మనస్పూర్తిగా మామిడి పళ్లు ఆస్వాదించండి. 

Leave a Comment

error: Content is protected !!