breathing issues remedy with bay leaf

అర గ్లాస్ తాగితే చాలు ఛాతి, గొంతు, ఊపిరితిత్తులులో కఫం తగ్గించి గొంతు నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది

 వాతావరణం మారింది చలిగాలులు ఎక్కువగా ఉన్నాయి.  ఈ  సమయంలో దగ్గు జలుబు గొంతునొప్పి గొంతు ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సమస్యను ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఈ డ్రింక్ తాగితే రెండు రోజుల్లోనే అన్ని సమస్యల నుంచి బయటపడవచ్చు. టాబ్లెట్ కన్నా మన ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం మందులు వాడాల్సిందే. ప్రారంభదశలో అయితే ఈ చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

గొంతులో నొప్పిగా గడబిడగా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ చిట్కా కోసం ముందుగా పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాస్  నీళ్లు వేసుకొని  అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి.  అల్లం చాలా పోషకాలు కలిగి ఉంటుంది. విటమిన్-ఇ, మెగ్నీషియం వంటివి సమృద్ధిగా ఉండటం వల్ల గొంతు నొప్పిని తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది.  ఆ తరువాత రెండు బిరియానీ ఆకులు  చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి.

బిర్యానీ ఆకుల్లో ఉండే లక్షణాలు కూడా గొంతు నొప్పి కి సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. దగ్గు తగ్గడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఐదు నిమిషాల పాటు మరిగిస్తే బిర్యానీ ఆకు, అల్లంలో  ఉండే పోషకాలు నీటిలోకి వస్తాయి. ఈ నీళ్లు తీసుకోవడం వల్ల మానసిక ప్రశాంతత వస్తుంది. సమస్యలు తొలగిపోతాయి.  అల్లం రోజు మనం రెగ్యులర్ గా వాడుతూనే ఉంటాం కాబట్టి ఇంట్లో సులభంగా అందుబాటులోనే ఉంటుంది. 

బిర్యానీ ఆకు కూడా మనం బిర్యానీ వంటివాటిలో వేస్తూ ఉంటాం. కాబట్టి అది మనకు అందుబాటులోనే ఉంటుంది. బిర్యానీ ఆకు ఉపయోగించి ఈ చిట్కా చేసుకుంటే చాలా ఎఫెక్టివ్ గా పనిచేసి   దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. మరిగిన నీటిని గ్లాసులో వడకట్టాలి. మనం గ్లాసు నీటిని తీసుకుంటే అరగ్లాసు  అయ్యేంతవరకు మరిగించాలి. దీనిలో మనం  అర చెక్క నిమ్మరసం పిండుకోవాలి. విటమిన్ సి యాంటి ఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల గొంతు నొప్పి తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి.

ముఖ్యంగా విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది.  విటమిన్ సి అనేది శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అంటే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావు.గొంతు నొప్పి, దగ్గు, జలుబు వంటివి ఏమీ రాకుండా ఉంటాయి. ఆ తర్వాత అరస్పూన్ తేనె కలపాలి. ఎక్కువగా ఆయుర్వేదంలో వాడుతూ ఉంటారు. దీనిలో విటమిన్ సి, విటమిన్ B6, ఫ్రక్టోజ్,  కార్బోహైడ్రేట్లు, సైబోఫ్లోవిన్, నియాసిన్ ఉంటాయి. గొంతు నొప్పితో  పాటు గుండెకు సంబంధించిన సమస్యలు తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. 

యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా  ఉంటాయి. ఒక రెండు రోజులపాటు తాగితే ఉపశమనం కలుగుతుంది. కొంచెం తీవ్రత ఎక్కువగా ఉంటే ఉదయం  ఒకసారి, సాయంత్రం ఒకసారి తాగితే సరిపోతుంది. ఈ చిట్కా  వాడితే చాలా మంచిది. అయితే డయాబెటిస్ ఉన్నవారు  తేనె లేకుండా తాగాలి.

Leave a Comment

error: Content is protected !!