నువ్వులు గురించి సమాజంలో ఎప్పటినుంచో అపోహ ఉంది. ఇందులో ఉండే సమాచారం చదివిన వారంతా వాటిగురించి ఆలోచిద్దాం. ఈరోజు అసలు నువ్వులు చేసే మేలును ఇంకొక దాంతో పోల్చలేం. ఎముకల నిర్మాణానికి కావల్సిన ఖనిజం క్యాల్షియం. అత్యధికంగా కాల్షియం ను కలిగి ఉన్న ఆహారం నువ్వులు. నువ్వులతో పోలిస్తే మిగతా ఆహారాలు ఎందుకూ పనిచేయవు. అంత ఎక్కువ కాల్షియం ఉంటుంది. 100 గ్రాములు నువ్వులలో 1450 గ్రాముల కాల్షియం ఉంటుంది.పెద్దలకి 450 మిల్లీగ్రాములు, పిల్లలకి 600 మిల్లీగ్రాములు, గర్భిణీలకు 900 మిల్లీగ్రాముల క్యాల్షియం అవసరం అవుతుంది.
ఒక నువ్వుల ఉండ తినడం వలన మనకు లభిస్తుంది. నువ్వులు ఎక్కువగా తినాలని మన పురాతన కాలం నుండి రుషులు, మహర్షులు చెప్పారు. శరీరానికి వేడి చేస్తుంది అని చాలామంది నువ్వులు తినరు. నువ్వుల్లో వేడి చేసే గుణం లేదు. సరిగ్గా నీరు తాగకపోవడం వల్ల వేడి చేస్తూ ఉండవచ్చు. ఆవకాయ తింటే వేడిచేస్తుంది. అందులో ఉండే ఉప్పుకారాలు వలన దాహం ఎక్కువగా వేస్తుంది. మీరు తగినంత నీరు తాగకపోవడంవలన నోరు ఆరిపోయినట్టు ఉంటుంది. మలంతో పాటు రక్తం పడుతుంది. ఇప్పుడు ఎలా ఉంది. నిజంగా వేడి చేసినా మీరు ఆవకాయ తినడం మానరు.
నువ్వులు వేడి చేయకపోయినా ఆ నింద వేసి నువ్వులను దూరం పెడతారు. నువ్వులు తిన్నప్పుడు కొంచెం ఎక్కువ నీళ్లు తాగడం వల్ల వేడి చేసే అవకాశం ఉండదు. నువ్వుల పొడి వంటల్లో చల్లుకున్న వేడి చేయదు. నువ్వులను ఖర్జూరం లేదా బెల్లం తో లడ్డూలు చేసి వాడుకున్న చాలా మంచిది. మన శరీరానికి కావల్సినంత క్యాల్షియం అందుతుంది. నువ్వులం ఈ రూపంలో మీకు ఇబ్బంది లేకుండా తినిపించే పద్దతులు. నువ్వుల్లో కాల్షియం బాగా ఒంటికి పట్టాలంటే నువ్వుల్ని నానబెట్టి కొంచెం తీసుకుని మీరు మొలకలు తినేటప్పుడు మొలకలతో తినకుండా విడిగా నువ్వులను నమలడం వలన శరీరానికి పడతాయి. లేదంటే మలంతో కలిసి బయటకు వచ్చేస్తాయి.
అది నోట్లో బాగా నమలడం వల్ల బాగా జీర్ణమై దాంట్లో ఉండే కాల్షియం శరీరానికి అందుతుంది. బాగా నమలడం వలన దాంట్లో ఉండే పాలు జీర్ణాశయానికి చేరుతాయి. పెద్దవారికి ఇలా నానబెట్టి ఇవ్వడం వలన మంచిది. నువ్వులు తినడం వలన గర్భిణీలలో గర్భస్రావం అవుతుందా అనేది పెద్ద అపోహ. గర్భిణీలకు నువ్వులు చేసే మేలు ఏ ఆహారం చేయదు. మామూలు వ్యక్తుల కంటే గర్భిణీలకు క్యాల్షియం ఎక్కువగా తీసుకోవాలి. పాల కంటే ఎక్కువ కాల్షియం నువ్వుల్లో లభిస్తుంది. గర్భిణీ స్త్రీలు తప్పకుండా నువ్వుల ఉండ తీసుకోవాలి. రోజు నువ్వులు తీసుకోవడం మంచిది.నువ్వులు తీసుకోకపోవడం వలన మన ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి మన ఆహారంలో నువ్వులను కూడా చేర్చుకోవాలి.