క్యారెట్లు తినడం వల్ల మధుమేహం పెరుగుతుందని మధుమేహం ఉన్నవారు వాటిని తినకూడదని అనుకుంటారు.. అయితే అది పొరపాటు క్యారెట్లలో పిండిపదార్థాల ఎక్కువగా ఉండవు కాబట్టి మధుమేహం ఉన్నవారు క్యారెట్ తీసుకోవచ్చు. వాస్తవానికి, క్యారెట్లు మధుమేహం ఉన్నవారికి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి అవేంటో చదివి తెలుసుకోవలసిందే.
కెరోటినాయిడ్స్
క్యారెట్లలో కెరోటినాయిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఆహారంలో, ఈ కేరోటియినాయిడ్లు ప్రధానంగా నారింజ మరియు పసుపు రంగు పండ్లు మరియు కూరగాయలలో ఉంటాయి. వీటిలో ఉన్న యాంటీఆక్సిడెంట్ లక్షణాలు రెటీనాను దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడుతుంది. డయాబెటిక్ వల్ల దృష్టి మందగించే వ్యాధి అయిన రెటినోపతికి వ్యతిరేకంగా కెరోటినాయిడ్లు రక్షణగా ఉంటాయి. క్యారెట్ లో బీటా కేరోటిన్ మరియు అల్పా కేరోటిన్ లు ఉంటాయి.
ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు
రక్తంలో గ్లూకోజ్ లేదా రక్తంలో చక్కెరను నియంత్రించడం మధుమేహ చికిత్స యొక్క ప్రాథమిక లక్ష్యం. మనిషి రోజువారీ తీసుకునే కార్బోహైడ్రేట్లు ఈ మధుమేహ స్తాయిపై బలమైన ప్రభావాన్ని చూపుతాయి. క్యారెట్ లో కార్బోహైడ్రేట్స్ ఉన్నా అవి ఆరోగ్యకరమైనవి. ఇందులోని కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది మరియు డయాబెటిస్ ద్వారా ఎదురయ్యే గుండె వ్యాధి, మూత్రపిండ వ్యాధి, దృష్టి నష్టం, స్ట్రోక్ వంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది.
విటమిన్ ఎ
తక్కువ స్థాయిలో విటమిన్ ఎ డయాబెటిస్‌కు కారణం అవుతుంది. దీర్ఘకాల సమస్యగా వేధించే మధుమేహం సమస్య ఉన్నవారు తేలికపాటి కార్బోహైడ్రేట్స్ తో కలిగిన విటమిన్ ఎ మూలాలను తీసుకోవడం మంచిది. టైప్ 1 డయాబెటిస్ ఉన్నవారికి ఇది దోహాధం చేస్తుంది. క్లోమం మరియు బీటా కణాల ఉత్పత్తిలో విటమిన్ ఎ కీలక పాత్ర పోషిస్తుంది.క్యారెట్ లో విటమిన్ ఎ సమృద్ధిగా ఉంయుంది.
ఫైబర్
ఎక్కువ ఫైబర్ తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు క్రమబద్దం అవుతాయి. అంతే కాకుండా శరీరంలో ఇన్సులిన్ డయాబెటిస్‌ను ఎదుర్కోవడానికి సహాయపడతాయి. డయాబెటిస్ ఉన్నవారు కూరగాయలు, పండ్లు మరియు ధాన్యాల నుండి సమృద్ధిగా లభ్యమయ్యే ఫైబర్ ను తీసుకోవాలి.
క్యారెట్ల గ్లూకోజ్ స్థాయి…
నిర్దిష్ట ఆహారాలలో కార్బోహైడ్రేట్లు ఒక వ్యక్తి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని ప్రభావితం చేస్తాయి. ఉడికించిన క్యారెట్లలో ఈ గ్లూకోజ్ స్థాయిలు తక్కువ ఉంటాయి.
క్యారెట్‌లోని వివిధ సమ్మేళనాలు, కెరోటినాయిడ్స్, ఫైబర్ మరియు విటమిన్ ఎ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మరియు మధుమేహం వల్ల ఎదురయ్యే కంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతాయి
చివరగా….
క్యారెట్లు మదుమేహం ఉన్న వారికి ప్రమాదమనే అపోహ వదిలి ఆహారంలో నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. అయితే పరిధి మించి తీసుకోకుండా ఉండటం ఉత్తమం.