ప్రస్తుతం ఆయన పరిస్థితులు ఆహారపు అలవాట్ల వల్ల ప్రతి ఒక్కరూ తెల్ల వెంట్రుకల సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నారు వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికి తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. వాటిని దాచిపెట్టడం కోసం మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ ఉపయోగిస్తున్నారు. ఇవి చాలా హాని కలిగిస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేచురల్ గా ఇంట్లో ఉండే వాటితోనే తెల్ల వెంట్రుకలు నల్లగా మార్చుకోవచ్చు. తెల్ల వెంట్రుకలు రాకుండా ముందు జాగ్రత్త పడవచ్చు.
దీనికోసం ముందుగా 50 గ్రాముల గోరింటాకును తీసుకోవాలి. గోరింటాకు కాడలు తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.గోరింటాకు తెల్ల వెంట్రుకలు తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. తెల్ల వెంట్రుకలు సమస్యతో బాధపడే వారు మార్కెట్లో దొరికే హెన్ హెన్నా పౌడర్ ను ఉపయోగించడం కంటే గోరింటాకు ఉపయోగించడం మంచిది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. తర్వాత 50 గ్రాములు ఉసిరికాయలు తీసుకోవాలి. ఉసిరికాయలోని గింజలను తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఉసిరికాయలు తెల్ల వెంట్రుకలు తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాగే జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది. తర్వాత 50 గ్రాముల కరక్కాయలు తీసుకోవాలి. కరక్కాయలు పగులగొట్టి గింజలను తీసేసి పైన ఉండే బెరడు ఉపయోగించుకోవాలి. కరక్కాయలు కూడా తెల్ల వెంట్రుకలు తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. కరక్కాయలు, ఉసిరికాయలు మిక్సీ పట్టుకోవాలి. ఇంకా గరుకుగా అనిపిస్తే కొంచెం నీళ్ళు వేసి మిక్సీ పట్టుకోవచ్చు. గోరింటాకు కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
ఈ మిశ్రమం మొత్తాన్ని ఇనుప కడాయి తీసుకుని కడాయి మొత్తం అంటుకునేలాగా సర్ధాలి. దీనిని ఒక రాత్రంతా అలాగే మూతపెట్టి ఉండనివ్వాలి. ఉదయం లేవగానే ఒకసారి బాగా కలుపుకుని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత గంట నుండి గంటన్నర వరకు ఆరనివ్వాలి. ఇది పూర్తిగా గట్టిగా అవ్వకూడదు. కొంచెం తడిగా ఉన్నప్పుడే నీటితో కడిగేసుకోవాలి. ఇలా నెలకి మూడు సార్లు చేయడం వలన తెల్ల వెంట్రుకలు తగ్గుతాయి. షాంపూ ఉపయోగించకూడదు.
డ్రై హెయిర్ మీద ఈ ప్యాక్ అప్లై చేసుకోవాలి. తెల్ల వెంట్రుకలు లేని వారికి తెల్ల వెంట్రుకలు మళ్ళీ జన్మలో రాకుండా ఉంటాయి. దీనివలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.ఇది 100 సంవత్సరాల క్రితం చిట్కా చాలా బాగా పని చేస్తుంది. తెల్ల వెంట్రుకల సమస్యతో బాధపడేవారు ఒకసారి ఈ చిట్కా ట్రై చేసి చూడండి. మంచి ఫలితం ఉంటుంది.