రూపంలో చిన్నవయినా ప్రపంచంలో సుగంధద్రవ్యాల ఖరీదులో మూడోస్థానంలో ఉన్న యాలకులు ఆరోగ్యానికి అంతే మేలు చేస్తాయనడంలో అతిశయోక్తి లేదు. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో రెండు యాలకులను గనుక తింటే శరీరంలో ఉష్ణోగ్రతని పెంచి కొవ్వు ను కరిగేలా చేస్తుంది. అధిక బరువు వలన గుండె సంబంధ వ్యాధులు వస్తాయి. అందుకే అధికబరువును తగ్గించి గుండె సంబంధిత వ్యాధులను దరిచేరకుండా చేస్తుంది. యాలకులు టాక్సిన్లను తొలగించి శరీరంలోని అన్ని అవయవాలను శుద్దిచేస్తుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.
మలబద్దకం వలన కడుపులో గ్యాస్, ఫైల్స్, ఫిస్ట్యులా లాంటి సమస్యలు మొదలవుతాయి. యాలకులు వలన మలబద్దకం తగ్గుతుంది. గోరువెచ్చని నీటితో యాలకులు నమలడం వలన ఆహారం జీర్ణమయి మలబద్దకాన్ని నివారిస్తుంది. రాత్రుళ్ళు నిద్రపట్టక బాధపడేవారు పాలలో యాలకులు పొడి వేసుకుని తాగడంవలన నిద్రపట్టడంతో పాటు డిప్రెషన్ ను దూరం చేసుకోవచ్చు. మానసిక ఆందోళనలు, డిప్రెషన్కు యాలకుల టీ మంచి ఔషధం. రోజూ యాలకులు తినడం వలన కిడ్నీ, మూత్రాశయంలోని రాళ్ళను తొలగిస్తుంది. అంతేకాకుండా కాల్షియం, యూరియా సంబంధ వ్యర్ధాలను తొలగిస్తాయి.
రక్తహీనతను తగ్గించడంలో అద్భుతమైన ఫలితాలు చూపించే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్స్ అధికంగా లభిస్తాయి. అలసట, నిస్సత్తువ దూరం చేస్తాయి. దంత సమస్యలు తగ్గడానికి యాలకులను నమలడం లేదా టీలా తీసుకోవడం మంచి చిట్కా. నోటి దుర్వాసన తగ్గించడంలో కూడా యాలకులు సహాయపడతాయి. ఇందులో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఎక్కువగా ఉండి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.
ఆస్తమాను అదుపులో ఉంచే లక్షణాలు యాలకులలో ఉన్నాయి. అంతేకాకుండా గురక, కఫంతో కూడిన దగ్గు, శ్వాస ఆడకపోవడం సమస్యలు తగ్గడానికి ఉపయోగపడతాయి. యాలకులలో మాంగనీస్ కూడా ఉంటుంది. ఇది డయాబెటిస్ రాకుండా చేస్తుంది. ఎక్కిళ్ళు ఆగకుండా వస్తున్నప్పుడు ఒక కప్పు టీలో యాలకులను వేసి తాగడంవలన ఎక్కిళ్ళు ఆగిపోతాయి. గుండెల్లో చేరిన కఫాన్ని కరిగించడంలో కూడా యాలకులు బాగా ఉపయోగపడతాయి. యాలకులలో ఉండే విటమిన్ సి శరీరకాంతిని పెంచుతుంది. రక్తప్రసరణలో అడ్డంకులు లేకుండా చేసి బి.పీ సమస్య ను తగ్గిస్తుంది.మరిన్నీ ప్రయోజనాలు అందించే యాలకులు చిట్టివి అనగలమా గట్టివే అనాలి.