ముఖ్యంగా ఆడవారు చేసే పెద్ద పొరపాటు ఇది. ఆహారం మాడి నప్పుడు అది పడేయడం ఎందుకు అని చాలామంది తినేస్తూ ఉంటారు. అలాంటి మాడిన ఆహారం తింటే మన ఆరోగ్యానికి చాలా నష్టం కలుగుతుంది. చాలామంది ఆహారం వండేటప్పుడు పకోడీలు, బజ్జీలు, ముఖ్యంగా బిర్యానీలు వంటివి ఎక్కువగా అడుగడుతు ఉంటాయి. అసలు మాడినవి చాలా హాని చేస్తాయి. కనుక ఇటువంటి వాటిని తినకూడదు. ఇలా మాడిన ఆహారం తినడం వలన కలిగే నష్టాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుత కాలంలో క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. పూర్వం రోజుల్లో ఎక్కువ రకాలు వండుకునే వారు కాదు. అన్నం మరియు ఒక కూర వండుకునేవారు అంతే. ప్రస్తుత కాలంలో నూనెలో దేవించినవి వాడడం వలన అవి ఎక్కువగా మాడిపోతు ఉంటాయి. అలాగే ఓవెన్ లో వండినవి కూడా త్వరగా మాడుతాయి. ఇప్పట్లో ఉన్న టెక్నాలజీ మాడు ఎక్కువగా తినేటట్టు చేస్తుంది. అందువలన క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. క్యాన్సర్ రావడానికి కారణాలైన కెమికల్స్ ఇందులో తయారవుతున్నాయి. అవి ఫ్రీ కార్బన్, హెట్రో సైకీల్ ఆమైన్స్, పాలి ఆరోమేటిక్ కార్బన్స్ తయారవుతాయి.
ఈ మూడు ఏం చేస్తాయి అంటే మన శరీరంలో ఉన్న ఆరోగ్యకరమైన డిఎన్ఏ ను డామేజ్ చేసి అదుపు లేకుండా కొత్త కణాలు విభజన జరుపుతుంది. ఈ విభజన ఎక్కువ అయ్యే సరికి అవి క్యాన్సర్ కణాలుగా మార్పు చెందుతాయి. 40 రకాల క్యాన్సర్లు రావడానికి ఈ మార్పు కారణం. ఇంకొక విధంగా నష్టం ఏమిటంటే ఈ మాడినవి రోగ నిరోధక శక్తి పై పనిచేసి క్యాన్సర్ కణాలను నియంత్రించే పని ఈ రోగనిరోధక వ్యవస్థ చేయలేదు. అంతేకాకుండా చాలామందికి ఆల్జిమార్స్ వంటి వయసు పడిన తర్వాత వచ్చే రోగాలకు ఇందులో ఉండే కెమికల్స్ కారణం అవుతాయి.
అంతేకాకుండా ఇవి బ్యాడ్ కొలెస్ట్రాల్ తయారయ్యేటట్టు చేసి ఒంట్లో కొవ్వు పెరిగేటట్టు చేస్తుంది. దీనివల్ల గుండెజబ్బులు ఎక్కువ వస్తాయి. మాడిన ఫూడ్ ను డీటాక్స్ చేయడానికి లివర్‌కు ఎక్కువ సమయం పడుతుంది. మాడిన ఫుడ్ ఫ్రీ రాడికల్స్ ను తయారు చేస్తుంది. దీనివలన దీర్ఘ రోగాలకు కారణం అవుతాయి. మాడిన వెజిటేబుల్స్ తినడం వలన దీనిలో ఒక రకమైన కెమికల్ రిలీజ్ అవుతుంది. ఇది ఇన్ఫ్లమేషన్ కు కారణం అవుతుంది. కనుక మాడినవి అనేక రోగాలకు కారణం అవుతాయి…