Clear Cavities Teeth Whitening

ఇలా చేస్తే పిప్పి పళ్ళు మొత్తం శుభ్రమయిపోతాయి

మన శరీర ఆరోగ్యానికి మన నోటి ఆరోగ్యం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మనం తినే ఆహారాన్ని అందించేందుకు నోటిలోని దంతాలు ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. తిన్న ఆహారాన్ని సరిగ్గా నమలకపోతే అది శరీరంలో 100% జీర్ణమవదు. అలాగే జీర్ణవ్యవస్థపై అధిక భారం పడుతుంది.  పంటి ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు అనేక జీర్ణసంబంధ సమస్యలు వస్తాయి. అందుకే పంటి ఆరోగ్యం దెబ్బతినకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. చాలామంది సరైన నోటి శుభ్రత పాటించకపోవడం వలన పుచ్చు రావడం, దుర్వాసన రావడం, పళ్ళు పచ్చగా మారడం వంటివి జరుగుతూ ఉంటాయి.

 వీటిని నిర్లక్ష్యం చేస్తే పంటిని కోల్పోయే అవకాశం ఉంటుంది. అందుకే పళ్ళకి చిన్న చిన్న సమస్యలు రాగానే వెంటనే దంత వైద్యుడిని కలవాలి. వీలైనంత వరకు ఆరు నెలలకు ఒకసారి డాక్టర్ను కలవడం వలన ఎటువంటి సమస్యలు లేకుండా జాగ్రత్త పడవచ్చు. కొంతమందికి పంటిలో పుచ్చుతో, నొప్పితో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు డాక్టర్ను కలవడం ద్వారా అది తక్కువ పాడయి ఉంటే సిమెంట్ వేస్తారు. పంటిపై ఉండే మూడు పొరలు పైపొరను ఎనామెల్ అంటారు. ఈ ఎనామిల్ దెబ్బతినడం వలన పళ్ళు జివ్వుమనడం, నెమ్మదిగా నరాలు దెబ్బతినడం వంటి సమస్యలు వస్తాయి.

 పుచ్చు పంటి లోపలికి మాత్రమే వెళితే పంటిని సిమెంటుతో మూయవలసి ఉంటుంది. అలా కాకుండా నరాల లోపల వరకూ పాడయ్యి నరాలలో చీము చేరితే దానిని శుభ్రం చేసి సిమెంట్ తో ఫిల్ చేస్తారు. దీన్ని రూట్ కెనాల్ అంటారు. పళ్ళు దెబ్బతిన్నప్పుడు డాక్టర్ సలహా అవసరం. కొద్దిపాటి పంటి సమస్యలకు ఆయుర్వేద వైద్యం ప్రకారం ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించడం వలన సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు. అల్లం ముక్కను నములుతూ ఆ రసాన్ని మింగటం వలన పంటి ఆరోగ్యం మెరుగు పడుతుంది. అల్లంలోని యాంటీబ్యాక్టీరియల్ గుణాలు పళ్ళు పుచ్చిపోకుండా అడ్డుకుంటాయి. చిగుళ్ల వాపు వంటి సమస్యలను తగ్గిస్తాయి.

 త్రిఫల చూర్ణాన్ని నీటిలో కలిపి నోరు పుక్కిలించడం వలన కూడా వంటి సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు. ఇక ఆయిల్తో నోటిని పుక్కిలించడం అనేది ఆయుర్వేదంలో ఎక్కువగా చెప్పే మంచి నివారణ చిట్కా. దీనినే ఆయిల్ పుల్లింగ్ అంటారు. ఆయుర్వేదంలో గాండూషం, కలవం అని పిలుస్తారు. ఇలా ఆయిల్ ని నోటిలో వేసుకొని అది కొంచెం చిక్కగా అయ్యేంతవరకు నోటిని పుక్కిలించడం వలన నోటిలో ఉండే బ్యాక్టీరియా వంటి వాటిని ఈ ఆయిల్ తీసుకుంటుంది.

ఈ పద్థతి పంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. నోటిదుర్వాసన తగ్గిస్తుంది. వీటితో పాటు  రోజు రెండు సార్లు బ్రష్ చేయడం, రెండు నెలలకు ఒకసారి కొత్త బ్రష్ మార్చడం, ఏదైనా తీపి పదార్థాలు తిన్నప్పుడు నోటిని పుక్కిలించడం వంటివి చేయాలి. అలాగే కూల్డ్రింకులుకి దూరంగా ఉండటం వల్ల నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

2 thoughts on “ఇలా చేస్తే పిప్పి పళ్ళు మొత్తం శుభ్రమయిపోతాయి”

  1. నువ్వు పెట్టిన పారాచ్యుట్ ఆయిల్ డబ్బా లోది తాగి ఎవడినైనా పోతే మీరు భాద్యత వహిస్తారా???

    పారాచ్యుట్ అనేది తలకు మాత్రమే వ్రాసుకునేది.లోపలకు వాడకూడదు ఎందుకంటే అది నాచురల్ కాదు,కెమికల్స్ కలుపుతారు.కనీసం నాచురల్ కొబ్బరినూనె బొమ్మ వేయడం కూడా రాదు.మళ్లీ వెబ్ పోర్టల్ ఎందుకు మీకు.

    Reply
  2. సరైన కరెక్టయిన విధానం తెలియనప్పుడు తప్పుడు సమాచారం పెట్టి రోగాలపాలు చెయ్యకండి జనాన్ని. పచ్చి కొబ్బరితో కొబ్బరినూనె ఎలా తయారుచెయ్యాలో చెప్పి ఆ నూనెతో అని చెప్పండి.

    Reply

Leave a Comment

error: Content is protected !!