cloves health benefits and side effects

ఒక్క లవంగంతో ఇలా జరుగుతుందా.రెండు లవంగాలు తిని వేడినీరు తాగితే భయంకరమైన రోగాలు పారిపోతాయి

పాతకాలం నుండి ఆయుర్వేదవైద్యాన్ని మన హిందూధర్మాలతో అనుసంధానించారు. ఎవరైతే మన ఆయుర్వేద జీవన ధర్మాలను అనుసరిస్తారో వారు చాలా ఆరోగ్యంగా మరియు ధృడంగా ఉంటారు.  వారికి తెలిసో తెలియకో ఆయుర్వేదంలోని కొన్ని నియమాలను కూడా జీవనవిధానంలో భాగంగా పాటిస్తూ ఉంటారు.

అందులో ఒకటైన ఆయుర్వేద చిట్కా గురించి మనం మాట్లాడుకుందాం. మన తాతల కాలం నుండి మన పెద్ద వాళ్ళు గుడికి వెళ్లేటప్పుడు ఖాళీకడుపుతో మాత్రమే  వెళ్ళమని చెప్తారు.

అసలు ఖాళీ కడుపుతో గుడికి ఎందుకు వెళ్లాలి అని ఎప్పుడైనా ఆలోచించారా. దీని వెనక ఉన్న శాస్ర్తియ రహస్యం గురించి కూడా తెలుసుకుందాం. మనం గుడికి వెళ్ళినప్పుడు అక్కడ తీర్థం రూపంలో పాలు, తేనె వంటి వాటితో చేసిన పంచామృతం లేదా చరణామృతం ఇస్తుంటారు. ఈ తీర్థంలో తులసి మరియు తేనె కూడా కలుపుతారు. ఈ తులసి తీర్థాన్ని ఖాళీ కడుపుతో తీసుకున్నపుడు శరీరంలో మనకు తెలియకుండానే ఎన్నో అనారోగ్య లక్షణాలు తొలగిపోతాయి.

అంతేకాకుండా గుడిలో ప్రసాదంగా ఇచ్చెవాటిలో యాలకుల, లవంగాలు కూడా వాటిలో కలిపి ఇస్తుంటారు. లవంగాలు, యాలకులు ఖాళీ కడుపుతో తీసుకోవడం వలన ఎన్నో ఉదరసంబంధ సమస్యలు తొలగిపోతాయి.  అందుకే మనల్ని ఖాళీకడుపుతో గుడికి వెళ్ళమని పెద్దలు చెప్తారు.

అందుకే మన ధర్మం లో ఉండే నమ్మకాలు వెనుక ఉన్న వైజ్ఞానిక రహాస్యాల గురించి కూడా తెలుసుకొని వాటిని వదిలేయకుండా పాటించడంవల్ల ఆరోగ్యాన్ని పొందవచ్చు.  ఇప్పుడు లవంగాలు తిని వేడినీరు తాగడం వలన మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం

లవంగాలు అనేక పోషకాలను కలిగి ఉంటాయి.  లవంగాలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని చాల బాగా పెంచుతాయి .

లవంగాలలో ఉండే యాంటీ కాన్సర్ గుణాలు క్యాన్సర్ నుండి మనల్ని  రక్షించడానికి సహాయపడతాయి. యాంటీ బాక్టీరియల్ గుణాలు వలన లవంగాలు బ్యాక్టీరియాలను చంపగలదు.  మన ఆరోగ్యాన్ని కాపాడగలదు .

 కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో లవంగాలు సహకరిస్తాయి. ఇందులో ఉండే విషవ్యర్థాలను బయటకు పంపే గుణాలు శరీరాన్ని నిర్విషీకరణ చేసి కాలేయాన్ని శుభ్రంచేసి కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

 రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడవచ్చు.  డయాబెటిస్ ఉన్నవారికి సహాయకారి. లవంగాలను తరుచు తీసుకోవడం వలన కాల్షియం అంది ఎముక ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.  
మగవారిలో రోజూ రాత్రి పూట రెండు లవంగాలు తిని వేడినీరు తాగడం వలన శృంగార సామర్థ్యం పెరుగుతుంది. లైంగిక సమస్యలు తొలగిపోతాయి. మరియు అధిక బరువు తగ్గడంలోనూ సహాయపడతాయి.

Leave a Comment

error: Content is protected !!