హలో ఫ్రెండ్స్ వర్షాకాలం అయిపోయి చలికాలం మొదలయింది కదా.. వాతావరణంలోని మార్పుల వల్ల జలుబు దగ్గు అలాగే జ్వరం ఫ్లు వంటివి చాలా కామన్. దీంతో అనేక రకాల రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ దాడి చేసే ప్రమాదం ఉంది.. ముఖ్యంగా ఈ సమయంలో ఇన్ఫెక్షన్లు కూడా మూకుమ్మడిగా దాడి చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుత పరిస్థితులలో మహమ్మారి ప్రతాపాన్ని ఎలా చూపిస్తుందో అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ సమయంలో మన ఇమ్యూనిటీ system ఇంప్రూవ్ చేసుకోవడంతోపాటు ఇలాంటి కామన్ వైరల్ ఇన్ఫెక్షన్లను తగ్గించే ఒక ఆయుర్వేదిక్ రెమిడితో పాటు కొన్ని టిప్స్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.
ముందుగా మీరు పది తులసి ఆకులు తీసుకుని శుభ్రంగా కడిగి మిక్సీలో కాని రోటిలో కానీ వేసి కొద్దిగా ఒక స్పూన్ మోతాదులో నీటిని వేసి జ్యూస్ తీసుకోవాలి. ఈ తులసి రసాన్ని రెండు స్పూన్ల మోతాదులో ఒక బౌల్లోకి తీసుకోండి. తర్వాత మూడు నుంచి నాలుగు నల్ల మిరియాలను మెత్తటి పొడిలా చేసి ఈ బౌల్ లోకి ఆడ్ చేయండి. తర్వాత ఇందులో ఒక స్పూన్ మోతాదులో తేనెను వేసి బాగా కలపండి. ఈ మూడు పదార్థాలు మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి. అంతే కాక శరీరంలోని ఇన్ఫెక్షన్లను నయం చేస్తాయి.
ప్రతి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ మిశ్రమాన్ని ఒక స్పూన్ మోతాదులో తీసుకోవాలి. నీకు జ్వరం వచ్చింది అని తెలిసిన వెంటనే ఈ మిశ్రమాన్ని తయారు చేసుకుని తాగండి. ఇలా మీరు రోజులో మూడు నుంచి నాలుగు సార్లు తీసుకుంటే చాలు ఇంతటి భయంకరమైన దగ్గు జలుబు జ్వరం అయినాసరే మీకు ఖచ్చితంగా ఒక్కరోజులోనే తగ్గిపోతుంది.ఇలాంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోవడానికి మా పేజీని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి