జలుబు, దగ్గు సీజనల్గా వస్తుంటాయి.అలాగే రోగనిరోధక శక్తి బలహీన పడితే ఎప్పుడు పడితే అప్పుడు దాడిచేస్తుంటాయీ. వాటివలన వచ్చే చికాకు నీరసం ఏ పనిమీద ధ్యాస లేకుండా చేస్తుంది. అస్తమానం మందుల వెంటపడుతుంటే దుష్ప్రభవాలు కూడా తోడవతాయి. అలాకాకుండా ఇంట్లోనే సహజంగా రోగనిరోధక శక్తిని బలపరుచుకొని జలుబు, దగ్గుకి దూరంగా ఉండొచ్చు. దానికోసం మనకు కావలసినవి మన వంటిట్లోనే ఉండే పదార్థాలు. ఇక ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక గ్లాసున్నర నీటిని తీసుకుని అందులో ఒక ఇంచు అల్లంముక్క చిన్న ముక్కలుగా తరిగి లేదా కచ్చాపచ్చాగా దంచి నీటిలో వేయాలి. అల్లంలో ఉండే యాంటీ బాక్టీరియల్ యాంటీ వైరల్ గుణాలు జలుబు దగ్గుకి కారణమైన బాక్టీరియాతో పోరాడతాయి. దీనిలో ఉండే జింజరాల్, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అల్లానికి శరీరాన్ని వేడిచేసే గుణం ఉంటుంది. మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి..
దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ప్రీ రాడికల్స్ తో పోరాడి వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తుంది. తర్వాత దీంట్లో తమలపాకు ఒకటి ముక్కలుగా చేసి వేయాలి. ఫోలిక్ యాసిడ్స్, కాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ సి అధికంగా ఉండి శరీరంలో రోగనిరోధక శక్తి పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. గొంతులో గరగర, నొప్పి తగ్గడానికి సహాయపడుతుంది. తర్వాత ఇందులో తులసి ఆకులు వేసుకోండి. తులసికి శరీరంలో బాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్లు నిరోధించే గుణం ఉంటుంది. భారతదేశంలో తులసిని పవిత్రమైన మొక్కగా పూజిస్తారు. తులసి రోజుమొత్తంలో ఇరవై రెండు గంటల పాటు ఆక్సిజన్ విడుదల చేసి కార్బన్ డయాక్సైడ్ పీల్చుకుంటుంది. యోగా,ధ్యానం చేసేటప్పుడు తులసిచెట్టుకు సమీపంలో చేస్తే మంచి ఫలితం ఉంటుంది. జ్వర తీవ్రంగా ఉన్నప్పుడు తులసిని నీటిలో మరిగించి తాగినా వెంటనే ఉపశమనం లభిస్తుంది.
ఇప్పుడు వేసిన అల్లం, తులసి, తమలపాకు సారం దిగిన తర్వాత కొంచం బెల్లం ముక్క వేయాలి. బెల్లం తెల్లగా ఉన్నది కాకుండా కొంచెం నల్లగా లేదా బ్రౌన్ కలర్లో ఉన్నది తీసుకోండి. బెల్లంలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, కాల్షియం, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీర ధృడత్వానికి సహాయపడతాయి. మరియు రోగనిరోధక శక్తిని పెంపొందించి జలుబు,దగ్గు తగ్గడంలో సహాయపడతాయి. మరిగాక నీటిని వడకట్టి గోరువెచ్చగా తాగాలి. టీ తాగినట్టు వేడివేడిగా సిప్ చేస్తూ తాగడం వలన ఒక్కరోజులోనే మంచి ఫలితం ఉంటుంది. ఈ నీటిని పెద్దవారు రోజుకి మూడుసార్లు అరకప్పు, ఐదేళ్ళు నుండి పదేళ్ళ పిల్లలకి రెండు చెంచాలు చొప్పున, సంవత్సరం పిల్లలు చెంచా చొప్పున రోజుకి మూడుసార్లు ఇవ్వాలి. ఇలా రెండు రోజులు తాగడం వలన చాలా త్వరగా ఉపశమనం భిస్తుంది.
a very useful and easy to prepare,iwill follow.
a very useful and easy to prepare .iwill follow.
Very useful