Did you know these interesting facts about peanuts?

వేరుశెనగ లను ఈ మూడు సమస్యలు ఉన్నవారు మర్చిపోయి కూడా తినకండి. మీ ప్రాణాలకే ప్రమాదం

చాలామంది పల్లీలను టైం పాస్ కోసం ఈవినింగ్ స్నాక్ గా తింటూ ఉంటారు. అలాగే ఇవి పేదవాడి బాదంగా చెప్పబడుతున్నాయి. వీటిని ప్రతి రోజూ ఒక గుప్పెడు తినడం వలన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతుంటారు. అయితే ఆరోగ్య ప్రయోజనాలతో పాటు కొందరికి పల్లీలను తినడం వలన అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. ఎవరు పల్లీలను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. 

వేరుశెనగలు ముఖ్యంగా ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు మరియు ఫైబర్ యొక్క మంచి మూలం.  అవి పుష్కలంగా పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం మరియు విటమిన్ B-3 (నియాసిన్);  విటమిన్ E (ఆల్ఫా-టోకోఫెరోల్);  విటమిన్ B-1 (థయామిన్);

 స్థూల పోషకాలు: ప్రోటీన్;  కార్బోహైడ్రేట్;  ఫైబర్;  చక్కెరలు, ఖనిజాలు: పొటాషియం;  భాస్వరం;  మెగ్నీషియం;  కాల్షియం;  సోడియం;  ఇనుము;  జింక్

 కొవ్వులు: మోనో అసంతృప్త కొవ్వులు;  బహుళఅసంతృప్త కొవ్వులు;  సంతృప్త కొవ్వులు వీటన్నింటినీ కలిగి ఉంటాయి. 

కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం ద్వారా గుండె జబ్బులను నిరోధించడంలో వేరుశెనగ సహాయపడుతుంది.  అవి రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని కూడా ఆపగలవు మరియు గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.  చాలా ప్రోటీన్ కలిగిన ఆహారాలు మరియు తక్కువ కేలరీలతో కడుపు నిండిన పూర్తి అనుభూతిని పొందడంలో మీకు సహాయపడతాయి. ఎముకలు బలపడటానికి, క్యాన్సర్ కణాలతో పోరాడే టానికి వేరుశనగ చాలా బాగా సహాయపడుతుంది. మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడానికి దోహదపడుతుంది. అయితే వేరుశనగను కొంతమంది తీసుకోకూడదు. ఎవరు తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

 వేరుశెనగ తినడం వలన మీ చర్మంపై ఎలర్జీ, దురద, దద్దుర్లు, ముఖంపై వాపు వంటి సమస్యలు రావచ్చు. వేరుశనగ చాలా మితంగా తీసుకోవాలి. ఎక్కువగా తీసుకోవడం వలన జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. దీని వలన కడుపులో మంట, ఎసిడిటీ వంటి సమస్యలు ఏర్పడతాయి. ఎసిడిటీ  సమస్య ఉన్నవారు తీసుకోకపోవడం మంచిది. కాలేయ సమస్యలు ఉన్నవారు వేరుశెనగ ఎక్కువ తీసుకోకూడదు. దీని నుండి విడుదలయ్యే ఒక రసాయనం కాలేయం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. పల్లీలు తిన్న వెంటనే మంచి నీటిని తాగకూడదు. ఇలా తాగడం వలన జీర్ణ సంబంధిత సమస్యలు ఏర్పడతాయి.

అలాగే పల్లీలులో ఉండి నూనె  ప్రేగులకు అంటుకొని కొవ్వు గా మారుతుంది. ఇది అధిక బరువు సమస్య కారణం అవుతుంది. పల్లీలో ఉండే నూనె జీర్ణం కావడానికి సమయం పడుతుంది. దీని వల్ల జీర్ణ సమస్య ఏర్పడుతుంది పల్లీలు తినడం వలన శరీరంలో వేడి చేస్తుంది. వీటిని తిన్న వెంటనే నీటిని తాగడం వలన జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తాయి. అలాగే పల్లీలు తింటే వెంటనే నీటిని తాగడం వలన నోటి దుర్వాసన సమస్య కూడా ఏర్పడుతుంది. అందుకే పల్లీలను మితంగా తీసుకోవాలి. తీసుకున్నప్పుడు ఈ సూచనలను పాటించాలి. అలర్జీ సమస్య ఉన్నవారు వీలైనంత వేరుశనగలకు దూరంగా ఉండటం మంచిది.

Leave a Comment

error: Content is protected !!