ప్రస్తుత కాలంలో కూల్ డ్రింక్స్ తాగడం అనేది చాలా ఫ్యాషన్ అయిపోయింది. కూల్ డ్రింక్ తాగడం వలన అసలు ఏమేమి నష్టాలు జరుగుతాయి అని మనం ఒకసారి ఆలోచిద్దాం. మామూలుగా కూల్ డ్రింక్స్ లో చల్లదనం చూస్తే ఏడు నుంచి పది డిగ్రీల వరకు ఉంటుంది. అంత చల్లగా ఉండే కూల్ డ్రింక్లను పైగా అందులో ఉండే యాసిడ్స్ పీహెచ్ చూస్తే 3.5-5.5 వరకు ఉంటుంది. ఇలా చల్లగా ఉండే కూల్ డ్రింక్ ని పోట్టలో పోసేసరికి పొట్టలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ మరియు జీర్ణ రసాలు మరియు ఎంజైమ్స్ విడుదల చేసే కణాలు అన్నీ కూడా ఈ చల్లదనానికి కుచించుకు పోతాయి.
పైగా ఈ కూల్డ్రింక్స్ లో ఉన్నదంతా కూడా 95-98% అంతా వాటరే. అందువల్ల చల్లగా ఉండే వాటర్ పోసేసరికి కూడా పొట్టలో యాసిడ్ కంటెంట్ అంతా కూడా న్యూట్రలైజ్ అయిపోతుంది. దీనితో పాటు జీర్ణం కూడా 0.8-1.2 పీహెచ్ కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడే ఎంజైమ్స్ బాగా విడుదలవుతాయి. అప్పుడే జీర్ణం యాక్టివ్ గా జరుగుతుంది. ఎంజైయ్ మాటిక్ యాక్షన్ యాక్టివ్ గా జరుగుతుంది. అంటే ఎంజైమ్స్ అన్ని డైజేషన్ ప్రాసెస్ లో పాల్గొనడానికి యాసిడ్ యొక్క ఘాటు ఆ విధంగా ఉండాలి. కానీ చల్లదనంగా ఉండే కూల్ డ్రింక్ తాగడం వలన ఆ చల్లదనం ఎఫెక్ట్కి మన పొట్టలో టెంపరేచర్ కూడా 7-10 కి వచ్చేస్తుంది.
ఈ టెంపరేచర్ మరల 36 కి వెళ్లే వరకు పేగు అంచుల వెంబడి ఉండే హైడ్రోక్లోరిక్ యాసిడ్, జీర్ణ ఎంజైమ్స్ ని ఉత్పత్తి చేసే కణాలు అన్ని సప్రాస్ అవుతాయి. జీర్ణం జరిగే ప్రాసెస్ మొత్తం స్లో అయిపోతుంది. ఈ లోపు కూల్ డ్రింక్ లో ఉండే ఆసిడ్స్ అన్ని పొట్ట లైనింగ్ ని ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. దీనివలన అంచుల వెంబడి రక్షణ వ్యవస్థ మరియు అంచులు వెంబడి కణాలు కూడా చిల్లింగ్ ఎఫెక్ట్కి ముడుచుకుపోయి యాసిడ్ దాడి అక్కడ చేస్తుంది.
అందువలన అల్సర్ రావడానికి, గ్యాసెస్ ఎక్కువ ఉత్పత్తి అవ్వడానికి ఇలా జీర్ణం ఆగిపోవడం, టెంపరేచర్ నార్మల్ అయ్యేవరకు ఎంజైమ్స్ ఉత్పత్తి కాకపోవడం వలన ఇవన్నీ వస్తాయి. పొట్ట సమస్యలు రావడానికి కూల్ డ్రింక్స్ కారణం కావున వాటిని తీసుకోకపోవడమే మంచిది