టీ అంటే మనందరలో చాలా మంది ప్రాణంలా భావిస్తాం. ఉదయాన్నే ఒక టీ తాగకపోతే తలనొప్పి వస్తుందంటారు కొందరు. మరికొంతమంది సాయంత్రం అల్పాహారం, టీ లేకపోతే ఏదో కోల్పోయినట్టు ఉంటారు. ఇక కొంతమంది రోజులో నాలుగయిదు కప్పులైనా తాగేస్తూ ఉంటారు.
అలాంటి టీ ప్రియులకు ఒకమాట. లేచిన వెంటనే పరగడుపున టీ తాగకూడదని, అది అనారోగ్యానికి కారణమవుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అలా తాగితే వచ్చే అనారోగ్యాల గురించి తెలుసుకుందాం రండి. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.
ఖాళీకడుపుతో టీ తాగితే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. పాలతో చేసిన టీ మాత్రమే కాకుండా గ్రీన్ టీ, బ్లాక్ టీ లాంటివి కూడా పరగడుపున తాగడం కాలక్రమేణా ప్రమాదంగా మారొచ్చు. పరగడుపున టీ తాగడం వలన అవి శరీరంలో ఉండే జీర్ణరసాలతో కలిసి గ్యాస్ ప్రాబ్లం కలిగిస్తాయి. ఎసిడిటీ, అల్సర్లు కు దోహదపడుతుంది.
ముఖ్యంగా పాలతో చేసిన టీ మరింత ప్రమాదం. అలాగే టీ ఎక్కువగా తాగడం వలన కొవ్వును పెంచి రక్తంలో కలిసి గుండె సంబంధ వ్యాధులకు కారణమవుతుంది.మనం కొవ్వుపదార్థాలు తినడం వలనే బరువు పెరుగుతున్నాం అనుకుంటాం. కొంచెం కొంచెం గా టీతో తీసుకునే పాలు, పంచదార కూడా అధిక బరువుకు కారణమవుతాయి. టీ తాగడం వలన జీర్ణక్రియ దెబ్బతిని బాడీ మెటబాలిజం రేటు తగ్గుతుంది.
దీని వలన పొట్ట పెరుగుతుంది. గ్యాస్ చేరి ఇబ్బందిగా కూడా అనిపిస్తుంది. ఫైల్స్ ప్రాబ్లం ఉన్నవారు టీకి దూరంగా ఉండాలి. ఎందుకంటే టీలో ఉండే కొన్ని పదార్థాలు మలబద్ధకానికి కారణమవుతాయి. మలబద్ధకమే ఫైల్స్ వ్యాధికి కారణం. ఫైల్స్ లేనివారు పరగడుపున టీ తాగడం మానుకోవాలి. లేదంటే భవిష్యత్తులో ఫైల్స్ సమస్యకు గురికావచ్చు.
సరిగ్గా నిద్ర పట్టనివారు టీ తాగితే ఆ సమస్య మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఆకలిలేమికి కూడా టీ తాగడమనేది కారణం కావచ్చు. టీ ఎక్కువ తాగేవారిలో కఫం చేరి ఆకలిని నిరోధిస్తుంది. జీర్ణక్రియ ను దెబ్బతీసి ఆకలిలేకుండా చేస్తుంది.