వంటింట్లో తప్పనిసరి ఉండేది పోపుల పెట్టె. ఆ పోపుల పెట్టెలో అమ్మ దాచే డబ్బులతో పాటు అద్భుతమైన ఔషదాలు ఉంటాయి. నిజమండి పోపుల పెట్టెలో ఔషధాల రహస్యం ఒక్కసారి చూడండి.

ఆవాలు
◆పోపుల పెట్టెలోనూ పోపులోను తప్పకుండా చిటపటలాడేవి ఆవాలు. వీటిలో మెగ్నీషియం, మాంగనీస్, కాల్షియం, జింక్, ఒమేగా 3 ఫ్యాటీ యసిడ్స్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.
◆ఆవాలను నీళ్లలో వేసి నానబెట్టి ఆ నీళ్లతో నోరు పుక్కిలించడం వల్ల పంటి నొప్పి తగ్గుతుంది.
◆ఆవాల పొడిని తేనేతో కలిపి తీసుకోవడం వల్ల శ్వాశ సంబంధ వ్యాధులు నయమవుతాయి.
◆ఆవాల ముద్ద, కర్పూరము కలిపి కీళ్లనొప్పులు ఉన్న ప్రాంతం మీద రాయడం వల్ల నొప్పి తగ్గుతుంది
◆అవాలను చెక్కెరతో కలిపి తినడం వల్ల ఉబ్బసం తగ్గుతుంది.

జీలకర్ర
◆జీలకర్రలో ఐరన్, ఫైబర్, యాంటీ బాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి.
◆జీలకర్ర కషాయం తీసుకోవడం వల్ల బిపి,షుగర్, గుండె నొప్పి వంటి సమస్యలు అదుపులో ఉంటాయి.
◆జీలకర్ర దోరగా వేయించి మెత్తగా దంచి సైందవ లవణం కలిపి తీసుకోవడం వల్ల గర్భాశయ సమస్యలు నయమవుతాయి.
◆జీలకర్ర తరచుగా తీసుకోవడం వల్ల నీరసం, కాళ్ళనొప్పులు, పైత్యం వంటివి తగ్గిపోతాయి.
◆జీలకర్ర నిమ్మరసంతో కలిపి తీసుకుంటే తలతిప్పడం సమస్య తగ్గిపోతుంది.

మిరియాలు
◆పీచు కాల్షియం, ఇనుము, పాస్పరస్, కెరోటిన్లు, మెగ్నీషియం, ఖనిజాలు ఉంటాయి.
◆కప్పు మజ్జిగ లో పావు చెంచా మిరియాల పొడి కలిపి తీసుకుంటే కడుపులో గ్యాస్ సమస్య తగ్గిపోతుంది.
◆కండరాలు నరాల నొప్పులు బాధపెడుతుంటే చిటికెడు మిరియాల పొడి బాదం తో తింటూ ఉంటే ఉపశమనం ఉంటుంది
◆భోజనానికి గంట ముందు మిరియాల పొడి కొద్దిగా తేనెతో కలిపి తీసుకుని వేడి నీళ్లు తాగాలి. దీనివల్ల అధిక బరువు ఉన్నవారికి మంచి ఫలితం ఇస్తుంది.
◆జలుబు, తుమ్ములు బాధిస్తుంటే రాత్రి పూట పసుపు, మిరియాలు నీళ్లలో వేసి మరిగించి తాగుతుంటే సమస్యలు నయమవుతాయి

మెంతులు
◆కాల్షియం,పాస్పరస్,కెరోటిన్, ధయామిన్, నియాసిన్ మెంతులలో పుష్కలంగా ఉంటుంది.
◆నాలుగు గంటలు మెంతులు ననబెట్టుకుని దాన్ని నేరుగా ఉడికించి వడగట్టి అందులో కాసింత తేనె కలిపి తీసుకోవడం వల్ల రక్తహీనత,ఉబ్బసరోగం, కీళ్లనొప్పులు తగ్గుతాయి.
◆వేయించిన మెంతులు పొడి మజ్జిగలో కలిపి తీసుకుంటే కడుపుమంట తగ్గుతుంది
◆మలబద్ధకంతో బాధపడేవారు రెండు నుండి మూడు స్పూన్ల మెంతులు నానబెట్టి తరువాత వాటిని నమిలి తినాలి దీనివల్ల సమస్య పరిష్కారం అవుతుంది.
◆భోజనానికి అరగంట ముందు అరస్పూన్ మెంతి పొడి తీసుకుంటే మధుమేహానికి దూరంగా ఉండచ్చు.

వెల్లుల్లి
◆విటమిన్ బి, బి2, బి3, బి5, బి6, బి9, విటమిన్-సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, సోడియం, పాస్పరస్, జింక్. ఓయబ్బో చెబితే వెల్లుల్లి లో ఔషధాల పుట్టకు అంతు లేదు.
◆వెల్లుల్లి అధిక రక్తపోటు ను క్రమబద్దీకరిస్తుంది.
◆జీర్ణశక్తి వృద్ధికి తోడ్పడుతుంది
◆పరగడుపున రెండు లేక మూడు వెల్లుల్లి తింటే అన్నిరకాల కడుపుకు సంబంధించిన సమస్యలు నయమవుతాయి.
◆ఇందులో విటమిన్ సి నోటి వ్యాధులకు అద్భుతంగా పనిచేస్తుంది.
◆వారానికి అయిదు వెల్లుల్లి రెబ్బలు తింటే యాభై శాతం వరకు క్యాన్సర్ ను రాకుండా కాపాడుకోవచ్చు.

దాల్చిన చెక్క
◆తీపి, కారం కలగలిసిన మధురమైన సువాసన దాల్చిన చెక్క సొంతం.
◆పార్శ్వపు నొప్పి ఉన్నవాళ్లు దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల పలితం ఉంటుంది
◆దాల్చిన చెక్కను బుగ్గన పెట్టుకుని మెల్లిగా ఆ రసాన్ని మింగుతూ ఉండటం వల్ల గొంతు సమస్య, బొంగురు గొంతు తగ్గిపోతుంది.
◆దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు పరిష్కారం అవుతాయి.
◆గర్భదోషాలు ఉన్నవారు దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాన్ని పొందవచ్చు
◆ఋతుస్రావ సమస్యతో బాధపడుతున్నవారు దాల్చిన చెక్కను వాడటం వల్ల సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.
చివరగా….
పోపుల పెట్టెలో ఉన్నవాటిని తక్కువ అంచనా వేయడం ఇప్పటికైనా మానుకోండి. అందరి దగ్గర ఒక మెడిసిన్ కిట్ అంటే ఇదే కదా…..