Doctor tips for Frequent Urination in Telugu

మాటిమాటికి యూరిన్ వచ్చి విసిగిస్తుందా? ఇక దీనికి చెక్ పెట్టే ఐడియా చెప్తా

నీరు మన మంచి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది మరియు నిజంగా, ఇది శరీర అవయవాలు అన్నింటికీ సహాయపడుతుంది.  మానవ శరీరంలో దాదాపు 60% నీరు ఉన్నందున, ఇంధన కణాలకు హైడ్రేషన్ స్థాయిలను నిర్వహించడం మరియు మెదడు మరియు శరీర పనితీరును కొనసాగించడం కోసం నీరు చాలా అవసరం.

 మీరు ఆహారపదార్థాల నుండి ముఖ్యంగా దోసకాయలు, పుచ్చకాయలు, బెల్ పెప్పర్స్ మరియు టొమాటోలు వంటి నీటి శాతం ఎక్కువగా ఉన్న కూరగాయలు తీసుకోవాలి., వాస్తవానికి, ఒక ప్రతి ఒక్కరూ రోజుకు మూడు నుండి నాలుగు లీటర్ల నీటిని తాగాలి. 

కానీ ప్రయాణాలలో పనిలో ఉండే వారు ఎక్కువగా నీటిని తాగడానికి ఇబ్బంది పడుతుంటారు నీటిని తాగడం వలన కి వెళ్ళ వలసి వస్తుందని చాలా మంది నీటిని తాగడం తగ్గించేస్తారు  ఇలా నీటిని తాగకపోవడం వలన నిర్జలీకరణ వస్తుంది.  నీటిని తాగడంవలన ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది కాబట్టి, మీరు తగినంతగా నీటిని మధ్యాహ్నం తాగకపోతే ఏమి జరుగుతుంది?  తగినంత నీరు తీసుకోకపోవడం వల్ల కలిగే కొన్ని దుష్ప్రభావాలు ఇక్కడ ఉన్నాయి. తక్కువ శక్తి, మానసిక సమస్యలు, స్ట్రోక్ యొక్క అధిక ప్రమాదం, మూడినెస్, నెమ్మదిగా జీవక్రియ, తలనొప్పులు, చర్మం కాంతిని కోల్పోతుంది, యూరిన్ ఇన్ఫెక్షన్, కిడ్నీలో రాళ్లు ఏర్పడటం, జుట్టు రాలిపోవడం, కాంతిని కోల్పోవడం జరుగుతుంది. 

అందుకే ప్రతి రోజు శరీరానికి కావలసిన నీటిని తాగడం చాలా అవసరం. అలాగని ఎక్కువగా నీటిని తాగి ఇబ్బంది పడకుండా ఇప్పుడు చెప్పబోయే చిట్కాతో శరీరానికి కావలసిన నీటిని అందిస్తూ ప్రతిసారీ మూత్రానికి వెళ్ల వలసిన అవసరం లేకుండా చేస్తుంది. దాని కోసం మనం ప్రతి పది నిమిషాలకు లేదా పావు గంటకు ఒకసారి ఒక బుక్కెడు నీటిని తాగడం వలన అది శరీర అవసరాలకు సరిపోతుంది.  అతిగా ఇవ్వలేదు కనుక మూత్రానికి వెళ్ళవలసిన అవసరం రాదు. శరీరానికి తగినంత నీటిని ఇవ్వడం వలన వేడి చేయడం, వికారం వంటి సమస్యలు తగ్గుతాయి

Leave a Comment

error: Content is protected !!