drinking water with empty stomach health benefits

ఉదయాన్నే నీళ్లు తాగుతున్నారా?? అయితే ఈ నిజాలు ఒకసారి చూడండి

ఉదయం లేవగానే బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ  బెడ్ కాఫీ లు తాగుతున్న కాలం ఇది. అన్ని బద్ధకంగా దొర్లుతూ పోతుంటాయ్ ఉదయం నుండి రాత్రి వరకు. కానీ ఒకప్పుడు మన పెద్దోళ్ళు ఉదయం లేవగానే పక్కనే పెట్టుకున్న చెంబుడు నీళ్లలో గుక్కెడు నోరు పుక్కిలించి మిగిలినవి గటగటా తాగేసి రోజు వారీ పనుల్లో పడిపోయేవారు. విచిత్రం వారి ఆరోగ్యం డెబ్భై, ఎనభై ఏళ్ళు వచ్చినా చూపు కోల్పోకుండా, పళ్ళు ఊడకుండా, ఒళ్ళు మెత్త బడకుండా  చెక్కు చెదరకుండా ఉండేవాళ్ళు. కేవలం ఒకేఒక్క అలవాటుతో ఇంత ఆరోగ్యం సాధ్యమా అంటే జీవితంలో రోజువారీ ఒక్క అలవాటు క్రమం తప్పకుండా పాటిస్తే అది నిజమే అనే విషయం మన పెద్దవాళ్లను చూస్తే అర్థమవుతోంది. ఇంతకు అదేంటో ఇప్పటికే అర్థమయి ఉంటుంది దాని గూర్చి వివరంగా చూద్దాం మరి.

◆ఉదయాన్నే నీళ్లు తాగడం అనేది రాత్రి తిన్న ఆహారం జీర్ణమయ్యి పేగులలో నిలవడాన్ని అరికడుతుంది. అంటే మనం తిన్న ఆహారం జీర్ణమయ్యి పేగులలో నిలిచిన వ్యర్థాన్ని మలం రూపంలో సాఫీ గా విసర్జన అయ్యేందుకు ఉదయాన్నే తాగే నీళ్లు తోడ్పడతాయి.

◆ఉదయాన్నే నీళ్లు తాగడం వల్ల పెద్దపేగు శుభ్రపడుతుంది. ఫలితంగా శరీరంలో కొత్త రక్తం తయారవడానికి దోహదం చేస్తుంది

◆ఉదయం నిద్రలేవగానే నోటిని శుభ్రం చేసుకుని అరలీటర్ నుండి లీటర్ వరకు నీటిని తాగడం వల్ల మన శరీరంలో మెటబాలిజం మెరుగవుతుంది. దీనివల్ల శరీరంలోని అధిక కొవ్వులు మెల్లగా కరగడం మొదలుపెడతాయి.

◆పరగడుపున తీసుకునే నీరు శరీరంలో మలినాలను తొలగించి రక్తాన్ని శుద్దిచేస్తుంది. ఫలితంగా రక్తప్రసరణ వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉంటుంది.

◆ఉదయాన్నే తాగే నీటికి ప్రత్యామ్నాయంగా వేడి నీరు తీసుకోవడం వల్ల ఇంకా గొప్ప ఫలితాలు ఉంటాయి. వేడినీరు తాగిన తరువాత దాదాపు గంట వరకు ఎలాంటి కాఫీ, టీ, అల్పాహారం వంటివి తీసుకోకుండా ఉండాలి. దీనివల్ల శరీరంలో అవయవాలలో పేరుకున్న మలినాల వడపోత సులభమయ్యి శరీరం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

◆వేడి నీరు తాగడం వల్ల పేగులు శుభ్రపడి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతే కాదు గ్యాస్, ఎసిడిటీ లాంటి సమస్యలు నివారించబడతాయి.

◆ఉదయాన్నే నీళ్లు తీసుకోవడం వల్ల శరీరంలో అన్ని భాగాలకు అవసరమైన తేమ అందుతుంది. దీనివల్ల బాడీ డీహైడ్రేట్ కాకుండా చర్మం తేమగా ఉంటుంది. పొడిబారడం లాంటి సమస్యలు దరిచేరవు. అలాగే  మొహం మీద మచ్చలు, మొటిమలు వంటివి తగ్గిపోతాయి.

◆ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో తేనె నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల రోజు మొత్తం చురుగ్గా ఉండవచ్చు.

చివరగా……

రోజు ఉదయం నీటిని తీసుకోవడం వల్ల మన శరీర వ్యవస్థను ఒక క్రమపద్ధతిలో ఉంచవచ్చు. ఒక్కటి మాత్రం నిజం ఒక యంత్రం పని చేయడానికి ఇంధనం ఎలాగో మన శరీర వ్యవస్థ సక్రమంగా ఉండటానికి మంచినీళ్లు కూడా గొప్ప ఇంధనమే.

Leave a Comment

error: Content is protected !!