Effective Remedies to Get Rid of Mosquitoes at Home

గుప్పెడు ధనియాలు చాలు. ఈ చిట్కాతో ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదు.

ఇంట్లో దోమల సమస్య ఎక్కువగా ఉంటే అవి చేసే శబ్దం, అవి కుట్టడం వలన దద్దుర్లు, దురద వలన చాలా ఇబ్బంది పడుతుంటారు. చిన్న పిల్లలు ఉన్న వారు ఈ సమస్య వలన ఇంకా ఎక్కువగా ఇబ్బందిపడుతుంటారు. చుట్టూ మురుగునీరు, చెట్లు ఉండేవారు దోమల వలన బాధపడతారు. కొన్ని రకాల దోమల వలన మలేరియా, డెంగ్యూ వంటి ప్రమాదకరమైన వ్యాధులు కూడా వ్యాపిస్తాయి. అయితే వీటిని తగ్గించుకోవడానికి ఇప్పుడు మార్కెట్లో అనేక రకాల కాయిల్స్ అందుబాటులో ఉన్నాయి. టెక్నాలజీ మారుతున్న కొద్దీ కాయిల్స్ నుండి  ఆలౌట్, గుడ్ నైట్ లాంటి కొన్ని రకాల మిషన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. కానీ వీటిలో ఉండే కెమికల్ వలన కొంతమంది శ్వాససంబంధ సమస్యలతో బాధపడుతుంటారు. ఈ సమస్యలు వలన  ఉపయోగించకపోతే దోమల వలన ఇబ్బంది.

 ఈ సమస్యకు సహజంగా దొరికే కొన్ని పదార్థాలు కూడా సులభమైన నివారణ అందిస్తాయి. అవేంటో వాటిని ఎలా ఉపయోగించాలో చూద్దాం. ధనియాలు వంటల్లో మనం ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. మొదటి చిట్కా కోసం మనం బిర్యానీ ఆకులు, కర్పూరం తీసుకోవాలి. బిర్యానీ ఆకులు చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో పొడి చేసుకోవాలి. దానిలో మెత్తగా చేసుకున్న కర్పూరం బిళ్ళల పొడి  కూడా వేసుకోవాలి. ఇప్పుడు పొడిని బొగ్గులను కాల్చి అవి నిప్పులా మారిన తరువాత ఈ పొడి చల్లడం వలన ఆ వాసనకి దోమలు ఇంట్లోకి రావు. ఈ కాలంలో బొగ్గులు దొరకడం కష్టం కనుక ధూప్ స్టిక్ కాల్చి దానిపై పొడి వేయాలి. ఇలా చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది. 

తర్వాత చిట్కా కోసం ధనియాలు తీసుకోవాలి. దోరగా వేయించి గ్రైండ్ చేసుకోవాలి. దీని నుండి రసం తీసుకోవాలి. ఈ రసంలో ఒక మీడియం సైజు ఉల్లిపాయ మెత్తని పేస్ట్లా చేసి  దాని రసాన్ని కలపాలి. ఇప్పుడు బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ఒక స్ప్రే బాటిల్లో వేసుకోవాలి. ఎక్కడైతే దోమలు ఎక్కువగా ఉంటాయో అక్కడ ఈ మిశ్రమాన్ని అప్లై చేయడం వలన దోమలు సంఖ్య తగ్గుతుంది. ఈ మిశ్రమం యొక్క ఘాటైన వాసనకు దోమలు ఇంట్లోకి రావు.

Leave a Comment

error: Content is protected !!