egg nutrients facts and benefits

గుడ్డులో గల పోషక విలువలు తెలిస్తే ఆశ్చర్య పోతారు.

చిన్న నుండి పెద్దలవరకు తీసుకోదగ్గ ఆహారం అంటూ ఒకటి ఉంటుంది. అందరూ తీసుకోవాల్సిన సమతుల్య ఆహారంలో కచ్చితంగా ఉండేది గుడ్డు.  ప్రతిరోజు ఒక గుడ్డు అయిన ఉడికించి తినడం వల్ల బోలెడు పోషకాలు మీ సొంతమవుతాయి. అయితే చాలమందికి గుడ్డులోని పోషకాలు ఏమిటి అనేవి తెలియవు. ఒక్కసారి గుడ్డులో పోషకాలు తెలిస్తే ముక్కున వేలేసుకోవడం మన వంతవుతుంది. 

◆గుడ్డులో విటమిన్లు, కార్బోహైడ్రేట్స్, మినరల్స్, అమైనో యసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇంకా గుడ్డులో 13% మాంసకృత్తులు, 10-12% కొవ్వులు, విటమిన్-ఎ, విటమిన్-బి1, బి2, బి3, బి5, బి6, బి12 మరియు విటమిన్-డి సమృద్ధిగా ఉంటాయి. అందుకే గుడ్డును పోషకాల పుట్ట అని పెద్దలు అంటారు. చిన్న పిల్లల  నుండి  ఎదిగే పిల్లలకు అవసరమైన కాల్షియం ను అందించడం తో పాటు, గర్భం దాల్చిన మహిళలు, మరియు మధ్యవయసు స్త్రీలలో ఎదురయ్యే ఎముకల వ్యాధి నివారించడానికి, వృద్ధాప్యంలో ఎదురయ్యే ఎముకల బలహీనతను నివారించడానికి ఇలా మొత్తం మీద ఎన్నో దశలలో గుడ్డు గుడ్డుగా( మంచిగా) ఉపయోగపడుతుంది.

◆మన దేశంలో దాదాపు 88% మంది విటమిన్- డి లోపం తో బాధపడుతున్నారు. ప్రకృతీ సిద్దంగా సూర్యరశ్మి లో లభించే  విటమిన్-డి ప్రస్తుత పట్టణాలలో అగ్గిపెట్టేల్లాంటి అపార్ట్మెంట్లలో ఉంటున్న వాళ్లకు అందని ద్రాక్ష అయిపోయింది. అందుకే దీనికి ప్రత్యామ్నాయం గా గుడ్డును సూచిస్తున్నారు డాక్టర్లు.

◆విటమిన్ డి లోపం వల్ల ఎముకల వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్, మూత్రపిండాలు, లివర్ వంటి సమస్యలు చుట్టు ముడతాయి. 

◆చిన్నవయసులోనే దృష్టిలోపం మరియు గుండెకు సంబంధించిన వ్యాధులు రావడం వల్ల  విద్యార్థి దశలోనే డీలా పడిపోతున్నారు. వీటిని అడ్డుకోడానికి ప్రత్యామ్నాయ మార్గంగా ప్రతి డాక్టర్ గుడ్డు ను సూచిస్తున్నారు.

◆సూర్యరశ్మి ద్వారా అందని విటమిన్ డి ని గుడ్డు ద్వారా భర్తీ చేసుకోవడం ఉత్తమం. 

◆గుడ్డు తీసుకోవడం ద్వారా పెళుసుసుబారిన ఎములను తిరిగి దృఢంగా మార్చుకోవచ్చు

◆విటమిన్ డి శరీరానికి కావలసిన మొత్తంలో అందితే చర్మానికి సంబందించిన ఎన్నో వ్యాధులు దూరంగా ఉంటాయి.

◆వయసు పెరగడం వల్ల ఏర్పడే వృద్ధాప్యపు చర్మపు ముడుతలు రానీయకుండా చర్మం యవ్వనంగా ఉండేలా  చేస్తుంది.

◆అధిక కొవ్వు తో బాధపడేవారు గుడ్డును తీసుకోవడం వల్ల చక్కని పలితం ఉంటుంది. 

◆గుండెకు మంచి కొవ్వులను అందించడం ద్వారా. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఫలితంగా రక్తప్రసరణ వ్యవస్థ కూడా సమర్థవంతంగా ఉంటుంది.

◆గుడ్డును కేవలం ఆహారంగానే కాకుండా ఫేస్ కు మాస్క్ లా వేసుకుంటే మొహం కాంతివంతంగా మారుతుంది. అంతేకాదు మొహం మీద ఉన్న నల్ల మచ్చలు, మొటిమలు వంటి వాటిని తగ్గిస్తుంది.

◆గుడ్డును జుట్టుకు హెయిర్ పాక్ గా వేసుకుంటారు. దీనివల్ల జుట్టుకు పోషకాలు అంది ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. 

చివరగా….

అందరికి అందుబాటు ఉండే గుడ్డును రోజు తీసుకోవడం వల్ల పైన చెప్పిన సమస్యలను సులువుగా అధిగమించి గుడ్డంత(మంచి) ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. మరి గుడ్డును వాడి వెరీ గుడ్డు అనిపించుకోండి.

Leave a Comment

error: Content is protected !!