మన శరీరంలో అత్యంత ప్రధానమైన అవయవం కళ్ళు. ఇప్పటి టెక్నాలజీ యుగంలో పిల్లలు పెద్దలు అందరికీ కంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. పెద్దవారిలో అయితే వయసురిత్యా అనుకోవచ్చు. చిన్నపిల్లల్లో కూడా ఈ సమస్య ఎక్కువవుతుంది. దీనికి ముఖ్యంగా మన తీసుకునే కల్తీ ఆహారమే కారణం, జెనెటిక్ లోపం, కళ్ళపై తీవ్రమైన ఒత్తిడి పడడం వలన ఇలా జరగవచ్చు. ఇప్పుడు అందరూ టి.వీ చూడడం, మొబైల్ చూడడం లాంటివి ఎక్కువయ్యాయి. దీనివలన ఒత్తిడి పెరిగి కంటిచూపు తగ్గిపోతుంది. ఎలాగైతే బక్కగా ఉన్న శరీరాన్ని మంచి ఆహారంతో బలంగా చేసుకోగలమో అలాగే కంటి ఆరోగ్యం కోసం మంచి ఆహారం తీసుకోవడం ద్వారా బాగుచేయొచ్చు.అప్పుడు ఇంతకుముందు లానే మంచి దృష్టి కలిగి ఉండొచ్చు. మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి
కంటిచూపును మెరుగుపరచడానికి ఇంట్లోనే మంచి చిట్కాలు పాటించొచ్చు. ఇంట్లో ఉండే పదార్థాలతోనే ఇది తయారచేయొచ్చు. దీనికోసం మనం తీసుకోవలసింది బాదంపప్పు. బాదంపప్పులో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్, కంటిచూపును మెరుగుపరుస్తాయి.ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. బాదం రోజూ తినడంవలన కంటిశుక్లాలు,వార్థక్యలక్షణాలు రాకుండా ఆపుతాయి. కంటిచూపును కాపాడుకోవచ్చు. తర్వాత తీసుకోవసింది మీస్రీ.అంటే పటికబెల్లం .ఇందులో దారం ఉండేది తీసుకోవాలి. ఇది దేశవాళీ పటికబెల్లం. దీనిని చిన్న ముక్కలుగా చేసుకుని ఉపయోగించాలి. ఈ పటికబెల్లం వాత,పిత్త, కఫం వలన కలిగే అనేక రోగాల నుండి కాపాడుతుంది. పటికబెల్లం రోజూ తీసుకుంటే కంటిచూపు మెరుగుపడుతుంది. దీనికోసం మనం తీసుకోవలసింది సోంపు. వీటిని ఫెన్నెల్ సీడ్స్ అంటారు. సోంపు గింజల్లో రాగి, పొటాషియం, ఐరన్, సెలీనియం, మాంగనీస్, కాల్షియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
ఇవి కంటిచూపును వృద్ధి చేస్తాయి. సోంపు గింజలను రోజూ తినడంవలన కళ్ళమంటలు తగ్గుతాయి. ఎందుకంటే సోంపులో విటమిన్ సి, ఎమీనో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ కళ్ళను రక్షిస్తాయి. దీనికోసం యాభైగ్రాముల బాదం, వందగ్రాముల పటికబెల్లం, వందగ్రాముల సోంపు తీసుకోవాలి. తర్వాత వీటిని మిక్సీలో పొడిలా మెత్తగా చేసుకోవాలి. ఈ పొడిని ఉదయం లేచిన విషయం వెంటనే మరియు పడుకునేముందు ఒకస్పూన్ పాలలో కలిపి తాగాలి. ఇలా నెలరోజుల పాటు చేయడంవలన కంటిచూపు పూర్తిగా మెరుగుపడి కంటినొప్పి, కళ్ళలో మంటలు,ఎర్రగా అవడంవంటి సమస్యలు తగ్గుతాయి. ఈ చిట్కా ఎంత బాగా పనిచేస్తుంది అంటే కంటి అద్దాల సంఖ్య నెమ్మదిగా తగ్గి త్వరలోనే కళ్ళజోడు తీసేసే రోజులు వస్తాయి. అందుకే ఒక్క నెలరోజులు ప్రయత్నించి చూడండి.
I will try my level best