face pack for pigmentation at home

మూడు రోజుల్లో ముఖంపై ఉండే మంగు నల్ల మచ్చలు పోగొట్టే టిప్

 చర్మంపై పిగ్మెంటేషన్ ఉన్న, నల్లని మచ్చలు, మొటిమలు, ఓపెన్ పోర్స్,   మొటిమల వలన ఏర్పడిన గుంటలు, అన్ఈవెన్టోన్   ఇలాంటి సమస్యలన్నీ తగ్గించే   చిట్కా. ఈజీగా ఇంట్లోనే తయారుచేసుకొని ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు. ఈ చిట్కా  ఉపయోగించినట్లయితే చర్మం అందంగాo తెల్లగా, కాంతివంతంగా తయారవుతుంది.  దీనికి కావలసిన పదార్థాలు శెనగపిండి, గంధం పొడి, ముల్తానీ మట్టి, రోజ్ వాటర్. ఒక  గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం   శనగ పిండ వేసుకోవాలి.  శెనగపిండికి సమాన మోతాదులో  గంధం పొడి వేసుకోవాలి. తర్వాత అంతే మోతాదులో ముల్తానీ మట్టి కూడా వేసి బాగా కలుపుకోవాలి. దీనిని ఎక్కువగా ఒకసారి తయారు చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. దీనిని రోజు నలుగు పిండి లాగా కూడా వాడుకోవచ్చు. 

లేదా ఫేస్ ప్యాక్ లాగా  లేదా స్క్రబ్బర్ లాగా ఉపయోగించుకోవచ్చు. ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు కొంచెం ఈ పౌడర్ ను ఒక గిన్నెలోకి తీసుకుని  దానిలో కొంచెం పాలు, ప్యూర్ రోజ్ వాటర్ ఉంటే కొంచెం వేసుకుని  బాగా కలుపుకోవాలి.  మిశ్రమాన్ని ముఖంపై రెండు మూడు నిమిషాల పాటు  వేళ్లతో సర్క్యులర్ మూమెంట్లో స్క్రబ్  చేయాలి. తర్వాత ఫేస్ మొత్తం ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలి. 25 నుంచి 30 నిమిషాల పాటు ఆరిన తర్వాత  వాటర్ తో కడిగేయాలి.

ఇలా చేయడం వలన మొహం పై బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, నల్లని మచ్చలు, పిగ్మెంటేషన్ తగ్గి ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. నలుగు పిండిలా కూడా అప్లై చేసుకోవచ్చు. స్నానానికి ముందు తీసుకొని  ప్యూర్ రోజ్ వాటర్ ఉంటే రోజ్ వాటర్ ను వేసుకోవచ్చు. లేకపోతే గులాబీ రేకులను నీటిలో నానబెట్టి  ఆ వాటర్ తో నలుగు పిండి కలుపుకోవాలి.  ఈ పిండిని బాడీ మొత్తం అప్లై చేసుకుని  స్నానం చేస్తే టాన్ పోయి స్కీన్ ఈవెన్ గా  ఉంటుంది. డెడ్ స్కిన్ క్లియర్ అవుతుంది. ఆయిల్ స్కిన్ అయితే గనుక ఆ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది. 

ఇలా వారానికి రెండు మూడుసార్లు చేయడం వలన మంచి రిజల్ట్ ఉంటుంది. మొటిమలు, పిగ్మెంటేషన్, రేడియేషన్ వల్ల వచ్చే మచ్చలు పోయి ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది.దీనికోసం  ఇంట్లోనే ఈ ప్యాక్ తయారు చేసుకోండి.  టమాటో మెత్తటి పేస్ట్ లా చేసుకోవాలి. దీనిలో ఒక స్పూన్ అలోవెరా జెల్ యాడ్ చేసుకోవాలి. దీనిని  బాగా కలుపుకొని ముఖానికి రెండు నిమిషాల పాటు సర్క్యులర్ మూమెంట్లో స్క్రబ్ చేయాలి. 

తర్వాత ముఖమంతా ప్యాక్లా అప్లై చేసుకుని 30 నిమిషాలపాటు ఉంచుకోవాలి. తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. దీని వల్ల పిగ్మెంటేషన్, నల్లని మచ్చలు, ఆయిల్ స్కిన్,  డెడ్ స్కిన్, ముడతలు పోయి మొహం అందంగా,  కాంతివంతంగా  తయారవుతుంది. ఈ ప్యాక్ రాత్రి సమయాల్లో వేసుకుంటే బాగా ఫలితం కనిపిస్తుంది. ప్యాక్ వేస్తున్నప్పుడు  సోప్  వాడకూడదు.  ఈ ప్యాక్ను వారానికి రెండు మూడు సార్లు ట్రై చేయడం వలన ముఖం అందంగా తయారవుతుంది.

Leave a Comment

error: Content is protected !!