మళ్లీ కరోనా కేసులు పెరగడం ప్రారంభమైంది. కొత్తరకం వేరియంట్లు దాడి చేయడం మొదలుపెట్టాయి. ఇలాంటి సమయంలో కరోనా బారిన పడితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలో జీర్ణ వ్యవస్థ పై ఎక్కువ ఒత్తిడి పడకుండా కనీసం మూడు రోజుల పాటు ఉపవాసం చేయడం వలన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ వైరస్ పై దాడిచేసి వైరస్ను నాశనం చేస్తుంది. చాలా తక్కువ సమయంలో కరోనా నుండి బయటపడవచ్చు. దాని కోసం మనం ఎక్కువగా మరిగించిన నీటిని తీసుకోవడం, తరుచు కొబ్బరి నీళ్లు తాగడం వంటివి చేస్తూ ఉండాలి. రోజులో ఎనర్జీ కోల్పోకుండా ఉండడానికి ఒక గ్లాసు నిమ్మరసంలో ఒక స్పూన్ తేనె కలిపి తీసుకోవాలి. ఇలా రోజులో కనీసం 200 గ్రాముల తేనె తీసుకోవాలి.
ఇలా తీసుకోవడం వలన శరీరంలో ఎనర్జీ లెవెల్స్ పడిపోకుండా ఉంటాయి. శరీరానికి కావలసిన గ్లూకోజ్ అందుతుంది. శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. కొబ్బరి నీళ్ళు, నిమ్మకాయ, తేనె నీళ్ల వలన శరీరానికి కావలసిన ఎనర్జీ లభిస్తుంది. బలహీనపడకుండా ఉపవాసాన్ని పూర్తిచేయగలుగుతారు. అలాగే రోజుకి రెండు, మూడు లీటర్ల నీటిని తాగడం తప్పనిసరి చేసుకోవాలి. అప్పుడు శరీరం డీహైడ్రేషన్ కి గురికాకుండా కాపాడుకోవచ్చు. ఎప్పటికప్పుడు మూత్రానికి వెళ్లడం వలన శరీరంలో పేరుకున్న యాసిడ్స్ బయటకు వెళ్లిపోతాయి. నెలలో కనీసం మూడు రోజులు తేనె నీళ్లు ఉపవాసం చేసేవారిలో ఈ యూరిక్ యాసిడ్ సమస్యలు, మరియు వైరస్ తగ్గించుకోవడంలో చాలా బాగా పనిచేస్తుంది.
దీనికోసం ప్రతి గంటకు ఒక గ్లాసు తేనె, నిమ్మరసం కలిపిన గోరువెచ్చని నీటిని తాగుతూ ఉండాలి. ప్రతి రెండు గంటలకు ఒకసారి ఒక గ్లాసు మామూలు నీటిని కూడా తాగాలి. తరుచు మూత్రానికి వెళుతూ ఉండాలి. ఇలా తేనె కలిపిన నీరు ఉపవాసం చేయడం వలన శరీరంలో పేరుకొన్న టాక్సిన్స్, ఆహారం ద్వారా శరీరంలో చేరిన ఎరువులు, పురుగుల మందుల అవశేషాలు , వైరస్ మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి.
అంతర్గత అవయవాలను ముఖ్యంగా లివర్, కిడ్నీలను శుభ్రపరచడంలో ఈ తేనె, నిమ్మరసం అద్భుతంగా పనిచేస్తుంది. అంతే కాకుండా ఇలా కనీసం మూడు రోజులపాటు తేనె ఉపవాసం చేయడం వలన 3 నుండి 4 కేజీల బరువు తగ్గుతారు. దీనితో పాటు ఎనీమా చేసుకోవాలి. దీని వలన పొట్టలోని ప్రేగులలో చేరిన మలినాలు, నులిపురుగుల వంటివి పూర్తిగా శుభ్రపడతాయి. మనం ఏ ఆహారం తీసుకోవడం లేదు కనుక శరీరంలో కొత్తగా అవశేషాలు తయారవవు. శరీరానికి కావలసిన శక్తి కూడా లభిస్తుంది. జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి లభిస్తుంది. మూడు రోజుల్లో ఈ లక్షణాలు తగ్గకపోతే డాక్టర్ ను సంప్రదించవచ్చు.