సిరా కాయలు గురించి పల్లెల్లో పుట్టిన ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. నీలంగా, చిన్నచిన్నగా ఉండే ఈ కాయలు చిన్నతనంలో నలిపి వీటి వలన వచ్చే రంగుతో రాసుకుంటూ ఉండేవారు. వీటి పండ్లను తినడం వలన నాలుక నీలంగా మారితే అది చూసి పిల్లలు సంతోషపడేవారు. అలాంటి ఈ చెట్టు ఆకులు, కాయలు అనేక ఆయుర్వేద చికిత్సా గుణాలను కలిగి ఉంటాయి అని చాలా మందికి తెలీదు. వీటిని ఉపయోగించి అనేక రకాల వ్యాధులను తగ్గించుకోవచ్చు.
ఈ మొక్క ఫిలంథస్ రెక్టికులస్ జాతికి చెందినది. దీనిని ఫిలాంథస్ రెక్టికులస్ అంటారు. దీనిని తెలుగులో సిరా కాయలు, పురుగుడు చెట్టు, నల్ల పురుగుడు చెట్టు, ఇంకు కాయలు చెట్టు వంటి అనేక పేర్లతో పిలుస్తారు. ఇంగ్లీషులో ఈ చెట్టు పువ్వులు బంగాళదుంప వాసన రావడం వల్ల పొటాటో బుష్ అని. ఈ చెట్టు యొక్క పండ్లు పుల్లటి ద్రాక్షను పోలిన రుచిని కలిగి ఉంటాయి కనుక సోర్ క్రీపర్ అని పిలుస్తారు.
నోటి దుర్వాసన తొలగించుకోవడానికి, పళ్ళ చిగుళ్ళు వాపు, నొప్పి తగ్గించుకోవడానికి ఈ చెట్టు ఆకులు నీటిలో మరిగించి ఆ నీటిని పుక్కిలించడం ద్వారా నోటి దుర్వాసనను తొలగించుకోవచ్చు. అలాగే ఈ చెట్టు యొక్క కాండంతో దంతధావనం చేయడం ద్వారా పళ్ళను ఆరోగ్యవంతంగా చేసుకోవచ్చు. ఈ కాండంతో పళ్ళను తోమడం మన పూర్వీకుల నుండి చేసేవారు. ఈ చెట్టు ఆకులను నీడలో ఎండబెట్టి పొడిలా చేసి కొంచెం ఉప్పు కలిపి పళ్ళపొడిలా ఉపయోగిస్తూ దంతధావనం చేయడంవలన పంటి నొప్పి, పంటి నుండి రక్తం రావడం వంటి సమస్యలు తగ్గి పళ్ళు తెల్లగా మెరుస్తూ ఉంటాయి.
నోటి పూత సమస్య ఉన్నవారు ఈ చెట్టు ఆకులను నమలితే నోటిపూతను తగ్గించుకోవచ్చు. అలా చేయలేని వారు ఆకులను, బెరడును తీసుకుని నీటిలో మరిగించి రోజుకు నాలుగైదు సార్లు ఈ కషాయంతో నోటిని పుక్కిలించడం ద్వారా నోటి పూత సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. నాలుకపై పగుళ్లు, పెదవుల పగుళ్లకు ఈ ఆకులు చాలా బాగా పనిచేస్తాయి. ఆకులను నమిలి రసాన్ని నోటిలో ఉంచుకొని కొంతసేపటి తర్వాత ఊయడం వలన నాలుక పగుళ్లు తగ్గించుకోవచ్చు.
అలాగే పెదవులు పగిలినప్పుడు ఆకుల రసాన్ని రోజుకు రెండు మూడు సార్లు అప్లై చేయడం వల్ల పెదవులు పగుళ్ళు, పెదవులు చివర్లో వచ్చే పుండ్లు తగ్గించుకోవచ్చు. ఈ చెట్టు ఆకులు విరేచనాలు మరియు ఫైల్స్లను ఉబ్బసం నివాణ కోసం ఉపయోగిస్తారు. మొక్క యొక్క పండు వాపు చికిత్సలో ఉపయోగించబడుతుంది. ఫైలాంథస్ రెటిక్యులాటస్ యాంటీ డయాబెటిక్, యాంటీవైరల్, యాంటీకాన్సర్, యాంటీప్లాస్మోడియల్, హెపాటోప్రొటెక్టివ్, యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను సమృద్ధిగా కలిగి ఉంటుందని నిరూపించబడింది.