అందరికీ జుట్టు రాలడం సమస్య బాగా ఎక్కువగా ఉంటుంది. మరికొందరిలో జుట్టు రాలడంతో పాటు జుట్టు ఎదగడం అనేది జరగదు. జుట్టు చివర్లు చిట్లడం వలన జుట్టు ఎదగడం ఉండదు. రెండు పదార్థాలు కలిపి నూనె తయారు చేసుకునే వాడినట్లయితే జుట్టు రాలడం, చివర్లు చిట్లడం తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. పూర్వం రోజుల్లో ఏది చేసిన ఈజీగా చేసే వాళ్ళు. కానీ దాని ఫలితం మాత్రం చాలా బాగుండేది.
ఈ చిట్కా అమ్మమ్మల కాలం నుండి వస్తుంది. ఈ నూనె రాసుకున్నట్లయితే మీ జుట్టు ఊహించలేనంత పొడవుగా పెరుగుతుంది. ఇప్పుడు ఈ నూనె ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకొందాం. దీని కోసం కావలసిన పదార్థాలు మెంతులు, లవంగాలు, కొబ్బరి నూనె. మెంతులు బేటా కెరోటిన్ అధికంగా కలిగి ఉంటాయి. వాటిలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఎ, విటమిన్ కె, మరియు విటమిన్ సి, కాల్షియం, ఐరన్, పొటాషియం మరియు అధిక ప్రొటీన్లు వంటి అనేక రకాల మంచితగుణాలు కలిగి ఉంటాయి.
ఇవి వాస్తవానికి అనేక రకాల జుట్టు సమస్యలకు సహాయపడతాయి. మెంతులు స్కాల్ప్ పైన రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు పెరిగేలా చేస్తుంది. లవంగాలు సుగంధ ద్రవ్యాలుగా మాత్రమే మనకు తెలుసు. కానీ లవంగాలు జుట్టు ఒత్తుగా పెరిగేలా కూడా చేస్తాయి. లవంగాలు డాండ్రఫ్ ను తగ్గిస్తాయి. డాండ్రఫ్ వల్ల వచ్చే దురద కూడా తగ్గిస్తాయి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. దీనిలో ఒక చెంచా మెంతులు ఒక చెంచా లవంగాలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి.
దీనిలో 50 ఎం.ఎల్ కొబ్బరి నూనె వేసుకోవాలి. 30 సెకండ్ల పాటు నూనె మరగనివ్వాలి. నూనెను చల్లార్చుకోవాలి. తర్వాతే ఏదైనా గాజుసీసాలో మెంతులు, లవంగాల తో పాటు స్టోర్ చేసుకోవాలి. ఈ నూనెను రోజు తలకు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునే ముందు డబల్ బాయిల్ చేయాలి. ఏదైనా కింద గోరువెచ్చటి నీళ్లు తీసుకుని నూనెను ఆ వేడి నీటిలో కొద్దిసేపు ఉంచి తర్వాత తలకు అప్లై చేసుకోవాలి. ఈ నూనె రోజు మనం వాడుకునే నూనెలాగా అప్లై చేసుకోవచ్చు. రోజు తల స్నానం చేసే వాళ్ళు రాత్రి నూనె అప్లై చేసుకుని ఉదయాన్నే స్నానం చేయొచ్చు. రోజు నూనె అప్లై చేసే వాళ్ళు మూడు రోజులకొకసారి తల స్నానం చేయాలి.